వెన్నెల వీధుల్లొ

వెన్నెల వీధుల్లొ

అందమైన రాత్రుల్లో
వెన్నెల వీధుల్లొ
తారలతో సహవాసం చేస్తూ
నీతో నేను కన్న కలలు
నా కళ్ళలో నీపై కనిపించే ప్రేమ
నీకు దగ్గరగా ఉన్నపుడు నీ వైపు చూసిన చూపులు
ఏమని మాట్లడినా నీవే నా మాటల్లొ ఉండలనే తలపు
ఎటు చుసినా నీవే కనిపించాలనే ఆరాటం
నీతో నడచిన చిన్న చిన్న దూరాలు
నీతో పంచుకున్న చిన్న చిన్న ఆనందాలు
నువ్వు పొగిడినపుడు కలిగిన ఆనందం
నువ్వు కసిరినపుదు కలిగిన అలక
ఇవన్నీ ఇంకా నన్ను వీడి వెళ్ళలేదు
కానీ నువ్వు మాత్రం నన్ను వీడిపోయావు
అవే అందమైన రాత్రుల్లో
అవే వెన్నెల వీధుల్లొ
తారలతో మన ఊసులన్నీ చెప్పుకుంటూ
ఎప్పటికైనా వస్తావని ఎదురుచూస్తూ....!

Post a Comment

0 Comments

Advertisement