**పోల్ మేనేజ్ మెంటు**
మా చిన్నప్పుడు జరిగే ఎన్నికలను గమనిస్తే పోలింగ్ రోజు పోలింగ్ ఎలా జరుగుతుంది, పోలింగు ఎలా మేనేజ్ చేసేవారో , చేయొచ్చు, అనేది తెలుసుకోవచ్చు .
ఆ కాలంలో ఇంటింటికి డబ్బు పంచడం అనేది చాలా తక్కువ.. క్యాంపెయిన్కు పెద్దపెద్ద నాయకులు తీసుకురావడం, ఒక బహిరంగ సభ జరపడం, అనేది సాధారణం.. గోడల మీద రాయడం తర్వాత డబ్బు పంచడంతో అసలైన పోల్ మేనేజ్మెంట్ మొదలయితది..
ఎన్నికలు జరిగే రోజున ప్రతి పార్టీ అభ్యర్థి వోటర్లకి టిఫినీలు, మధ్యాహ్నం అయితే లంచ్ కూడా ఏర్పాటు చేసేవారు , ఆ తరువాత ఆడవారికి, ముసలివారికి ఆటోలు ఇచ్చేవారు. ఆవిధంగా అభ్యర్థులు వోటర్లని ప్రభావితం చేసేవారు, ఓట్లు వేయించుకొనేవారు.
దొంగ ఓట్లు అనేది ఆ కాలంలో కూడా ఉండేది.. కానీ ఆ కాలంలో ఏం చేసేవారు అంటే ఓటుకు రాకుంటే వాళ్లది వేరే వాళ్ళు వేసే వాళ్ళు.. నచ్చని ఊర్లలో పోలింగ్ జరుగుతూ ఉంటే అక్కడ మనకు తక్కువ ఓట్లు పడతాయి అనుకున్నప్పుడు ఆ పోలింగ్ బాక్సుల్లో "ఇంకు సిరా" చలేవాళ్ళు అప్పుడు "రీ పోలింగు" జరిగేది..
తర్వాత పోలింగ్ బూత్ ను కొందరు గొడవలు చేసి ఆక్రమించుకునే వాళ్ళు.. అప్పుడు చకచకా తమకు కావాల్సిన ఓట్లు గుద్దుకునేవారు దీన్ని "రిగ్గింగ్" అని అనేవారు.. ఆఖరి రెండు గంటలు సమయంలో జరిగేది.. పోలింగ్ బూతునే కొన్ని పల్లెల్లో ఆక్రమించుకునే వాళ్ళు దీన్ని "బూత్ క్యాప్చరింగ్" అనేవారు..
1990 ప్రాంతంలో ఇంకో కొత్త ఆచారం వచ్చింది దీనిలో పక్క నియోజకవర్గాల నుంచి కొంతమందిని తీసుకొని వచ్చి ఆ పోలింగ్ రోజు నిలబెట్టి దొంగ ఓట్లు వేయించేవాళ్ళు.. దాని తర్వాత వీళ్ళనే ఇంకొక బూతులోకి తీసుకెళ్లి మల్ల ఓట్లు వేయించే వాళ్ళు దీన్ని "సైక్లింగ్" అని అనేవారు..
పోలింగు కేంద్రానికి దూరం ఉన్న ప్రాంతప్రజలి తీసుకోని వచ్చి ఓట్లు వేయించేవారు, దానిద్వారా వీరికి ఎక్కువ ఓట్లు రావడం, భారీమెజార్టీతో గెలిచేవారు.
పోల్ మేనేజ్మెంట్లో బాప్ కాంగ్రెస్ అయితే బడాబాప్ టిడిపి ఉండేది..
మేనేజ్మెంట్ చాలా కీలకం ఆరోజు ఆఖరి ఓటు వరకు బూత్ కు తీసుకొచ్చి వేపించడం అనేది నలభై నియోజకవర్గాల్లో ప్రభావం చూపించేది.. ఇదే పార్టీ గెలవడానికి సోపానం వేసేది..
ఇపుడు అంటే అనేకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. సోషమీడియా వచ్చిన తరువాత టీవిలో చర్చలు, యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్ లో ప్రకటనలు ఇవ్వడం, తప్పుడు ప్రచారం చేయడం అలవాటైపోతుంది.
రోజురోజు కొత్త కొత్త సలహాలు ఇచ్చే ఎలక్షన్ కన్సల్టెంట్లు, కులాల వారీగా ఓట్లు ఎంత ఉన్నాయి అని క్యాలిక్యులేట్ చేసి ఏ నియోజకవర్గంలో ఎవరికి ఇస్తే బాగుంటుంది అనే సర్వే టీం లు, అంగబలం, అర్థబలం, కుల బలం చూసి క్యాండిడేట్ల నిర్ణయించడం పరిపాటైపోయింది..
కానీ ఓ పార్టీ బూత్ లెవెల్ పోల్ మేనేజ్మెంట్ లో తన పట్టు ఇప్పటికి కొనసాగిస్తున్న కేవలం బూత్ లెవెల్ మేనేజ్మెంట్ కుదరదు అనేది ఇప్పటి స్టేటస్.. ఎందుకంటే మార్జిన్ ఓటింగ్ ఐదు శాతం కంటే ఎక్కువ ఉంటే ఈ బూతు లెవెల్ మేనేజ్మెంట్తో నెగ్గుకు రావడం కష్టం..
అందుకే ప్రజలను ఆకట్టుకోవడానికి సంక్షేమ పథకాలు, రకరకాల తాయిలాలు అన్ని పార్టీలు ప్రకటిస్తూ ఉంటాయి.. సంక్షేమ పథకాలు మరియు రకరకాల పెన్షన్లతో ప్రభుత్వాలు ముందుకు పోతున్న ప్రజల ఆకాంక్ష ఏ విధంగా ఉంది అనేది పోలింగ్ రోజు వరకు ఒడిసిపట్టలేము.. అభిప్రాయాలను మార్చడానికి కూడా పోలింగ్ సర్వేలు అని అంటూ కొన్ని కంపెనీలు ఊదరగొడుతుంటాయి.. చాలాసార్లు అవి పెయిడ్ ప్రమోషన్స్ లాగే ఉండి నిజమైన ప్రజానాడిని పట్టడంలో సక్సెస్ అయిన దాఖలాలు తక్కువే..
ప్రజాస్వామ్యంలో నోటుకు ఓటు అనేది తప్పయినప్పటికీ నోటిస్తేనే గాని ఓటేయము అనే జనాలు చాలామంది ఉంటారు.. పేకాట పేకాటే తమ్ముడు తమ్ముడే.. అన్నట్లు ఆరోజు పంచడము, మద్యం ఏరులై పారించడం ఇవన్నీ పరిపాటే.. కొండకచోట మాకు డబ్బులు ఇవ్వలేదని లేక మాకు కావలసిన టీవీలు, ఫ్రిజ్లు లాంటివి అందలేదనో అలిగే ఓటర్లు ఉంటారు... వీళ్ళందర్నీ సముదాయించుకుని బూతుకు తేవడం చాలా సమస్య..
ఇప్పుడు కేవలం పోల్ మేనేజ్మెంట్ నే కాకుండా వాళ్లు పొందిన లాభాలు, ఇచ్చిన హామీలు, అసంతృప్తులను దువ్వుకోవడం, సరైన క్యాండిడేటిను నియమించడం, బహుమతులు తాయిలాలు ఇవ్వడం, పోలింగురోజున పోలింగ్ బూత్ కు మనుషులను తీసుకురావడం.. ఎవరు ఓటేస్తారు ఎవరు మనకు ఓటేయరు అని జాబితాన కంప్యూటర్లో నిక్షిప్తం చేసుకొని ప్రతి ఒక్కరిని పోలింగ్ బూత్ కి తరలించినప్పుడు మార్జిన్ అనేది గెలవడానికి ఎక్కువగా ఉంటుంది..
ప్రజాస్వామ్యంలో 51% వచ్చినవాడు గెలుస్తాడు 49% వచ్చినవాడు ప్రతిపక్షంలో కూర్చుంటాడు కాబట్టి ఆ ఒక్క పర్సెంట్ అనేది చాలా ఇంపార్టెంట్..
అదే పోల్ మేనేజ్మెంట్..
0 Comments