బెట్టింగ్ బాలరాజులు !
బెట్టింగ్... ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్ ... చాప కింద ఆసిడ్ లా విస్తరించి అనేక కొంపల్ని ముంచేస్తోంది .
బెట్టింగ్ ఒక మానసిక వ్యసనం !
తల్లితండ్రులు " కంచు" టైపు అయితే పిల్లల్లో బెట్టింగ్ వ్యసనం వచ్చే అవకాశం ఎక్కువ !
" కంచు మొగునట్లు కనకంబు మోగునా ?" అని నానుడి .
కొంత మంది ఎంత సేపూ "షో ఆఫ్ " టైపు .
ఎందుకంటే తమతమ గొప్పలు చెప్పుకోవడం వీరి దిన చర్య .
కిట్టి పార్టీలు మందు పార్టీలలో ఈ" కంచు లు" గణగణ మోగుతుంటాయి .
" ఈ కాలం కూడా ఇంకా మారుతీ సుజుకి లో ఎట్టా ట్రావెల్ చేస్తారో .. ఏంటో .. నేనైతే మినిమం వోల్వో వదినా .. మా అన్నగారయితే లాండ్రోవర్ దిగరు" అని బిల్డ్ అప్ లు ఇస్తూ బతికేస్తారు .
అదొక ఐడెంటిటీ క్రైసిస్ .
ఆత్మ న్యూనతా భావం .
ఆవు చేలో దూడ గట్టున మేస్తుందా ?
నేను గొప్ప అని అవతలివారికి చాటి చెప్పుకోవాలి అనే ఆలోచన బెట్టింగ్ కు దారి తీస్తుంది .
కష్టపడే తత్త్వం లేకపోవడం , ఈజీ గా డబ్బు సంపాదించాలి అనుకోవడం కూడా ఒక కారణం
గ్యాంబ్లింగ్ డిసార్డర్ - అనేది తీవ్ర మానసిక రోగం . నేడు ఎంతో మంది దీని బారినపడి సతమమవుతున్నారు .
ఆలోచనలు ఎప్పుడూ గ్యాంబ్లింగ్ చుట్టూ తిరుగుతుంటాయి . ఎన్నికలు .. క్రికెట్ . .. సినిమా జయాపజయాలు .. కాదోయి ఏది బెట్టింగ్ కు అనర్హం .
ఒక్క సారి గెలిస్తే .." ఇప్పుడు మనకు సుడి తిరిగింది .. స్టార్స్ కలిసి వస్తున్నాయి .. బెట్టింగ్ / గ్యాంబ్లింగ్ చేస్తే అది ఇప్పుడే.. ఇప్పుడే" అంటూ అందులో లీనం అయిపోతారు .
ఓడితే .. "ఇజ్జాత్ కా సవాల్ .. ప్రెస్టేజ్ కొచ్చిన్ .. ఓడి పోయి .. పోవడమా? గెలిచే దాక ఆడాల్సిందే!" అంటూ ఆటలో మునిగిపోతారు .
అంటే బెట్టింగ్ / గ్యాంబ్లింగ్ అనేది సుడిగుండం . పద్మ వ్యూహం లాంటిది. ఒకసారి దిగితే సురక్షితంగా రావడవంటూ కుదరదు. . ఆలా ఒక ఒకటి రెండు సార్లు వచ్చినా ఆది అంతం కాదు .. జస్ట్ బిగినింగ్..
జూదం లో గెలవడం వల్ల డోపమైన్ హార్మోన్ వస్తుంది . ఇది మాహా కిక్కు ఇస్తుంది .
ముందుగా ఒక పెగ్గు మందు తో స్టార్ట్ చేసినవాడికి మూడేళ్లయ్యే సరికి కనీసం క్వార్టర్ దిగనిదే కిక్కు ఎక్కదు.
బెట్టింగ్ కూడా అంతే.
ఎంత డబ్బు ఎక్కువ వేస్తూ, దాన్ని ఆలా పెంచుకొంటూ పెద్ద పెద్ద బెట్టింగ్ / గ్యాంబ్లింగ్ చేస్తేనే కిక్కు వస్తుంది అనేది .
కాబట్టి చిన్నగా మొదలయిన వ్యసనం.. ఆస్తులు... పెళ్ళాం పిల్లల తాకట్టు దాక దారితీస్తుంది .
"నేనట్టా కాదు లే ... నేను మహా స్మార్ట్ . జస్ట్ ఫన్ కోసం ఆడుతున్నా". అని ప్రతి బెట్టింగ్ బంగారు రాజు అనుకొంటాడు . బెట్టింగ్ అనేది ఒక హై డోపమైన్ అని, అదొక విషపదార్థం లాంటిది, ఎవరిని వదలదు . దాన్ని అర్థం చేసుకొని , ఆ ఊబి నుండి బయటపడేలోగా అతన్ని , అతని కుటుంబాన్ని సర్వనాశనం చేసుతుంది.
మన మహాభరతం లో కూడా ఇలాంటి అనేకరకాల మాయ జూదాలు ఉండేవి, కెసినో కి వెళ్లి సర్వనాశనం కానోడు, దాన్ని నిర్వహించినాడు కోట్లకుకోట్లు డబ్బు సంపాదించింది ఈ లోకంలో కనపడదు.
బెట్టింగ్ బంగారు రాజులను బకరాలను చేయడానికి బెట్టింగ్ మాఫియా .." ఫలానా వాడు మిలియన్స్ సాధించాడు" అని బిల్డ్ అప్ స్టోరీ లు వదులుతుంటుంది . బకరాలు నమ్మేస్తారు .
బెట్టింగ్ వల్ల మనిషి ఒకచోట నిలకడగా ఉండలేదు , ఒక చోట కూర్చోలేని తిరుగుడు స్వభావం వస్తుంది . ఇలాంటి వారు ఏ పనిపై దృష్టి సారించకపోగా , లేనిపోని నిందలు, అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొంటారు. . బెడ్ రూమ్ లో కూడా ఇదే ద్యాస తో వుంటారు .ఉస్సేన్ బోల్ట్ లయి పోతారు సంసారం జీవనం లో చిక్కులు .
బెట్టింగ్ గాళ్ళు సులభంగా చిరాకు కు గురవుతారు . అసహనం పెరిగిపోతుంది .
బెట్టింగ్ అప్పులకు దారి తీస్తుంది . అప్పులు తీర్చ్చడానికి అదనంగా బెట్టింగ్ చేస్తారు . ఆంటే చిన్న ఊబిలో నుంచి మరీనా ట్రెంచ్ లోతుల్లోకి వీరి పయనం సాగుతుంది .
బెట్టింగ్ / గ్యాంబ్లింగ్ జరిగే చోట మందు- విందు- పొందు తప్పని సరి ఆడ్ ఆన్స్.
దీనివల్ల లేనిపోని రోగాలు, వస్తాయి, ఎలాంటివంటే మధుమేహం,కిడ్నీ సమస్యలు, ఊబకాయం, వంటికి అదనపు బహుమతులు.
బెట్టింగ్ వల్ల అప్పుల ఊబి ఖాయం . ఆత్మహత్యలు ... కొన్ని సార్లు హత్యలు .. అటుపై చిప్పకూళ్ళు ..
బెట్టింగ్ కుటుంబాలను నాశనం చేస్తుంది .
బెట్టింగ్ బాలరాజులు !
25 ఏళ్ళు లోపువారిలో మెదడు ముందుభాగం ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ సరిగ్గా అభివృద్ధి చెందివుండదు . దీనితో వీరు భావోద్వేగాలను తట్టుకొనే సామర్త్యాన్ని కలిగివుండరు . వీరి చేతిలో సెల్ ఫోన్ . నేడు నీలి చిత్రాలు , హింసాత్మక వీడియో గేమ్స్ కన్నా కుటంబాలను నాశనం చేస్తోంది ఆన్లైన్ బెట్టింగ్ .
చేతిలో సెల్ ఫోన్ ఏదో చేసుకొంటున్నాడు అని తల్లితండ్రులు అనుకొనే లోపే బెట్టింగ్ మాఫియా లు వచ్చి " మీ వాడు ఇరవై లక్షలు అప్పుపడ్డాడు . ఇస్తారా చస్తారా? అంటూ బెదిరించి ఆస్తులు మానప్రాణాలు తీసిన ఘటనలు ఎక్కువుగా జరుగుతున్నాయి .
మీ ఇంటిలో కూడా పునరావృతం కాకుండా జాగ్రత్త పడండి.
బెట్టింగ్ మాఫియా కాళ్లావేళ్లా పడ్డా కనికరించదు.
దయనీయమయిన స్థితిలో జీవితాన్ని చాలించాల్సి వస్తుంది .
సిగరెట్ తాగితే ఇరవై ఏళ్లకు ప్రాణం మీదకు వస్తుంది .
మందు తాగితే పదహైదేళ్లకు.
గంజాయి కొడితే ఐదేళ్లకు .
ఆన్లైన్ బెట్టింగ్ చేస్తే కేవలం ఆరునెలలకు ..
మిగతా వాటిలో తాగిన వాడొక్కడి ప్రాణం .
కానీ ఆన్లైన్ బెట్టింగ్ లో ఇంటిల్లి పాదీ.. కట్టకట్టుకుని..
తస్మాత్ జాగ్రత్త .
పిల్లల్ని సెల్ ఫోన్ కు దూరం గా ఉంచండి .
'ఈజీ మనీ పాములాంటిది అని చెప్పండి .
కష్టపడే తత్వాన్ని నేర్పండి .
0 Comments