పేదోళ్లంటే ప్రేమలేదు పై దేవుడికి .

పేదోళ్లంటే ప్రేమలేదు పై దేవుడికి .

పేదోళ్లంటే ప్రేమలేదు పై దేవుడికి .
యాడికి పోతున్నావ్ తాత..
యాడికేంటి బిడ్డ . నీళ్లు రాలేదు గ .పొలం కి వెళ్లి తెచ్చుకోవాలి .యండకాలం వస్తే ఊర్లో నీళ్లు రావు గ.
ఉన్న ఇద్దరు బిడ్డలు పట్నం వెళ్లారు. ఇక్కడ నీళ్లు రాక , తినడానికి తిండి లేదంటే , పట్నం లో ఏదన్న పని దొరకకపోదా అని వెళ్లారు.
నా పిల్ల తనం నుండి చూస్తున్న ఈ నీటి కష్టాలు, తీర్చేటోడే పుట్టకపోయే . మాయమాటలు చెప్పేటోళ్లే గాని, మంచి గా చేసేటోళ్లు లేకపోయే. ఊరి పక్కన ఉన్న అడవిని కొట్టేసి మిద్దెలు కడుతున్నారు, పక్కన ఉన్న ఏరులో ఇసుకని తవ్వేశారు , చెట్లు ఉంటె గదా బిడ్డ యాడన్న వానలు పడేదానికి . కనుచూపుమేర ఎండిన భూమే గా. కరెంటు కూడా సక్కగా రాదాయె, ఎపుడు వస్తదో ఎదురుచూస్త ఉండాలే.
అయినా ఇది పేదోళ్ల కర్మ బిడ్డ. పేదోళ్లంటే ప్రేమలేదు బిడ్డ పై దేవుడికి .
By SS

Post a Comment

0 Comments

Advertisement