జాలి లేని ప్రేమ - new love letter

జాలి లేని ప్రేమ - new love letter

నా చెలి ప్రియా కి ప్రియంగా రాస్తున్న ...

అమ్మ చెప్పింది అందరితో ఆనందంగా ఉండాలని
నాన్న చెప్పాడు నలుగురి కోసం నడవాలని
ఏంటో ఉరకలేసే వయసు ఊరుకోదుగా
ఆ నలుగురిలో , అందరిలో ఉన్న నీకోసం నడిస్తే చాలనుకున్న
గోరుముద్దలు పెట్టిన అమ్మ తో గొడవ పడ్డా
 చేయి పట్టి నడిపించిన నాన్న ని నవ్వులపాలు చేసిన
నాది కానీ నా రక్తం (స్నేహితుడు )  నాతొ లేకున్నా నష్టం లేదన్న
బంధాలన్నీ భారమనుకొని అడ్డుగోడతో ఆపేసిన
ఎగిరిపడి యవ్వనంలో ఎవడు కంట పడలేదు నీవు తప్ప
నాతోడు నీవుంటే చాలు  ఎవరితో  ఎం పని అనుకున్న
కాలం కూడా కరుగుతున్న కనపడలేదు కన్నీటి బాధ ,నీతో కాలం చాలనుకున్న
పుట్టినవాడు గిట్టక తప్పదు అంటే నీ  ప్రేమకోసం గిట్టితే చాలు అనుకున్న
నీమాటలనే కోటలుగా  చేసి కొండనెక్కా కిందపడ్డ
అపుడు తెలిసింది
అమ్మ చెప్పిన మాటలు
నాన్న చెప్పిన సూక్తులు
నా రక్తం నాతొ లేకుంటే తెలిసిన కష్టాలు
తెలిసిన చేయడానికి నేను లేనని ఎలా తెలుసు ?

By SMS(suma manassulo srinu)

Post a Comment

0 Comments

Advertisement