రాము, తెల్లవారుజామున నిద్ర లేచిన వెంటనే , తన ఇష్ట దైవం ఫోటో ముందు నిలుచుని " దేవా ! ఈ రోజంతా నేను సంతోషంగా ఉండాలి . ఎలాంటి సమస్య వచ్చినా దాని పరిష్కారించుకొనే శక్తిని నా కివ్వు స్వామి " అని ప్రార్థిస్తాడు .
రాము లైఫ్ హ్యాపీగా సాగిపోతోంది .
రంగయ్య వయసు 55 ఏళ్ళు . కొడుకు.. కూతురు ... ఇద్దరూ అమెరికా లో సెటిల్ అయ్యారు . హైదరాబాద్ నగరం లో నెలకు మూడు లక్షల అద్దె వచ్చే కమర్షియల్ ప్రాపర్టీ ఆయన ఆస్థి . చేస్తున్న ఉద్యోగంనుంచి స్వచ్చంద పదవీ విరమణ చేసి లైఫ్ ను ఎంజాయ్ చేయాలి అనుకొన్నాడు . రిటైర్ అయ్యాక పొద్దుపోవడం ఎలాగో తెలియడం లేదు . ఈ లోగా తన స్నేహితుడొకడు గుండెపోటుతో మరణించాడు . గుండెపోటు ఎందుకొస్తుందో వివరించే ఒక వీడియో యూట్యూబ్ లో చూసాడు . మరుసటి రోజు అలాంటిదే ఇంకో వీడియో కనిపించింది . దాన్ని చూసాడు . అదేమీ చిత్రమో తెలియదు కానీ ఇప్పుడు ప్రతి రోజూ ఆయనకు గుండెపోటు వీడియోలు / వార్తలు కనిపిస్తున్నాయి .
ఇవన్నీ చూడడంతో తనకు కూడా గుండెపోటు వస్తుందేమో అని దిగులు పట్టుకొంది. ఒక రోజూ ఛాతి దగ్గర మంటగా అనిపించింది . వెంటనే గాబరా పడి ఆసుపత్రికి వెళ్ళాడు . పరీక్షలు చేసి అసిడిటీ పెరిగిందని ఏవో మందులిచ్చారు . అవి తీసుకొని ఇంటికొచ్చేలోగా రంగయ్య గుండెపోటు తో మరణించాడు .
రాకేష్ ఇంటర్ చదువుతున్నాడు . వీడియో గేమ్ లంటే తనకు ఇష్టం . ఒక గేమ్ లో గన్ పట్టుకొని బీచ్ కి వెళ్లి అక్కడ పడుకొన్న వారి పై కాల్పులు జరపాలి . గురి చూసి కాల్చాలి . రాకేష్ ఈ గేమ్ ను చక్కగా ఆడుతాడు . ఎప్పుడూ అతనికి హై స్కోర్ వస్తుంది .
ఇంటర్ కొచ్చినా చదువు పై శ్రద్ధ పెట్టక ఎప్పుడూ సెల్ ఫోన్ పై వీడియో గేమ్ లేంటని తల్లి తిట్టింది . ఇంట్లోని లైసెన్స్ రివాల్వర్ తీసుకొని రాకేష్.. తల్లిని, తండ్రిని , అడ్డొచ్చిన చెల్లిని చంపేశాడు .
సూరజ్ తొమ్మిదో తరగతి అబ్బాయి . డాక్టర్ కావాలని తన ఆశయం . తల్లితండ్రి "మా సూరజ్ డాక్టర్ కాబోతున్నాడు అని అందరికీ చెప్పేవారు . సూరజ్ తన ఆశయ సాధనకోసం ప్రతి రోజూ కష్టపడి చదివేవాడు .
ఇప్పుడు నీట్ పరీక్షలో అల్ ఇండియా టాప్ రాంక్ సాధించాడు . ఢిల్లీ లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్స్ లో సీట్ ఖాయం .
రవి మృదు స్వభావి . పోలీస్ ఆఫీసర్ కావాలనేది అతని ఆశయం . "నీ ప్రవృత్తికి అది సరిపడదు "అని కొంతమంది చెప్పారు . అయినా పట్టువిడవ కుండా ఎస్సై అఫ్ పోలీస్ పరీక్ష రాసి ఉద్యోగం సాధించాడు . క్రమినల్ తో రోజూ వ్యవహరించడం ఇప్పుడు అతని దినచర్య .
రవి లో ఇప్పుడు మృదు స్వభావం పోయి దాని స్థానం లో కాఠిన్యం , కరుకుదనం వచ్చింది . మాట తీరు కూడా మారింది .
మధు సంసారం జీవితం చక్కగా సాగిపోతోంది . వారిది అనోన్య దాపత్యం అని అందరూ అంటారు . మధు ఒక పార్టీ అభిమాని . తమ పార్టీ కి నాయకుడికి వ్యతిరేకంగా మీడియా లో ఏదైనా వార్త వస్తే దాన్ని ఖండిసూ పోస్ట్ లు పెట్టడం మొదలెట్టాడు . అవతలి పార్టీ వారితో కామెంట్స్ రూపం లో వాగ్యుద్ధానికి దిగడం ఇప్పుడు అతని దినచర్య అయ్యింది . చాల సార్లు బూతులు తిట్టుకోవడం జరిగింది .
ఉన్నట్టుండి మధు కాపురం లో కలహాలు మొదలయ్యాయి . భార్య పై చీటికీ మాటికీ కోప్పడ్డం... కొన్ని సార్లు బూతులు తిట్టడం మొదలెట్టాడు . భర్తకు తనపై ప్రేమ చచ్చిపోయిందని మధు భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది . ఇప్పుడు మధు విడాకుల నోటీసు అందుకొన్నాడు .
అమర్ స్కూల్ టీచర్ . పిల్లలతో గడపడం అంటే తనకు ఎంతో ఇష్టం . పిల్లలతో టూర్ లు వెళ్ళినప్పుడు వారితో ఎగురుతూ దూకుతూ గడపడం చేసేవాడు . ఇలా చేయాలంటే తానూ ఫిట్ గా ఉండాలి . ఫిట్నెస్ కోసం నడక, వ్యాయామం మంచి ఆహారం తీసుకోవడం మొదలెట్టాడు . ఇప్పుడు అమర్ ఈడు వారిలో వృద్ధాప్య ఛాయలు కనిపిస్తుంటే తానూ మాత్రం యంగ్ గా కనిపిస్తున్నాడు . తన కుటుంబ వివరాలు తెలిసిన వారు తప్పించి , మిగతా వారు తన ఏజ్ ని గెస్ చేయలేరు .
పై ఘటనలకు వివరణ :
1 రాము పూజలు ఫలించాయి . రోజూ సంతోషంగా బతకమని దేవుడు దీవించాడు .
2 రంగయ్య కు ఏలిననాటి శని దశ వచ్చింది . అందుకే ఆరోగ్యం దెబ్బ తిని, 56 ఏళ్లకే మరణించాడు .
3 రాకేష్ పై అకాడమిక్ ప్రెషర్ ఉంది . ఆ ఒత్తిడిలో సంయమనం కోల్పోయి కాల్పులు జరిపాడు .
4 సూరజ్ మంచి కోచింగ్ సంస్థలో చేరాడు . అందుకే మంచి రాంక్ వచ్చింది .
5. రవి లో వచ్చింది... కాలం తెచ్చిన మార్పు .
6. మధు కొత్తగా ఇల్లు మారాడు. ఆ ఇంటిని పూర్తిగా ఈశాన్యం లో కట్టారు . దక్షిణం వాయువ్యం పశ్చిమం లో చాలా స్థలం ఖాళీ . అందుకే సంసారం లో కలతలు. అది విడాకుల దాకా వచ్చింది .
7. అమర్ వ్యాయాయం తో.. డైట్ తో... ఫిట్నెస్ మైంటైన్ చేస్తున్నాడు .
ఈ వివరణలు మీకు నచ్చాయా? అయితే పోస్ట్ చదవడం ఇక్కడితో ఆపేయండి .
ఇంకా లోతుగా తెలుసుకోవాలి.. మీకు అంతగా పరిచయం లేని కోణం నుంచి చూసి అవగాహన చేసుకోవాలి .. అంటే చదవండి .
ఏపిజెనెటిక్స్ అనేది అభివృద్ధి చెందుతున్న ఒక శాస్త్రం . తెలుగు లో బాహ్య జన్యు శాస్త్రం .
1. మన ఆలోచనలే మన జీవితం .
2 మన ఆలోచనలు … మనం విన్నవి .. కన్నవి .. చూసినవి... మనల్ని ప్రభావితం చేస్తాయి .
3 మన బాడీ కెమిస్ట్రీ లో మార్పులు తెస్తాయి .
4 డిఎన్ఏ లో మార్పులు రాకుండా మన జన్యువులు మన ఆలోచన రీతిని ప్రభావితం చేస్తాయి . ఈ మార్పులు జన్యు పరంగా అనువంశికంగా మారుతాయి .
అంటే హింసను నమ్ముకొన్న తండ్రికి అలాంటి మనస్తత్వవం ఉన్న కొడుకు పుట్టే అవకాశం ఎక్కువ .
5. నిరాశ నిస్పృహలు అలముకొన్న వారికి , ఎప్పుడూ నెగటివ్ ఆలోచనలు ఉన్న వారికి కాన్సర్, న్యూరోలాజికల్ వ్యాధులు, ఆటో ఇమ్యూన్ వ్యాధులు వస్తాయి .
ఇది శాపం కాదండీ .
బాహ్య జన్యు శాస్త్రం చెబుతున్న మాటలు .
6. పాజిటివ్ ఆలోచనలు వున్నవారికి మెదడు చురుకుగా పని చేస్తుంది . న్యూరో ప్లాస్టిసిటీ వస్తుంది . అంటే ఎలాంటి సమస్యలనయినా పరిష్కారించుకోతగ్గ సామర్థ్యం .
అర్థం కాలేదా !
పై ఉదంతాలను మరో సారి చదివి బాహ్య జన్యు శాస్త్ర కోణం నుంచి అర్థం చేసుకోండి .
ఇప్పుడు అర్థం అయ్యిందా ? కాకపోతే... మరో సారి .. ఇంకో సారి చదివి అర్థం చేసుకోండి .
అన్ని పాయింట్ లు అర్థం అయిపోతాయి .. . రంగయ్య కు పదేపదే గుండెపోటు వీడియో లు ఎందుకు కనిపించాయి అనే పాయింట్ తప్ప . అది కృత్రిమ మేధ చలవ . మనం ఒక సారి దేనికోసం వెతుకుతామో దేన్ని చూస్తామో అలాంటి దాన్నే కృత్రిమ మేధ మనకు తిరిగి తిరిగి చూపిస్తుంది .
సారం .
మనం కోరుకొన్నదే మనకు దక్కుతుంది .
రాతి యుగానికి వెళుదాము. అడవిలో ఒక తెగ { జట్టు } . వారిది సంచార జీవనం . ఇప్పుడు నివాసాన్ని మార్చాలి . ఉత్తర దిక్కున వెళితే దుంపలు పళ్ళు చిన్న చిన్న జంతువుల రూపం లో ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది అని ఆ జట్టు లో ఒక అనుభజ్ఞుడు చెప్పాడు . మరో సీనియర్ "లేదు అక్కడ పులులు సింహాలు ఉన్నాయి" అన్నాడు . కొంతసేపట్లో ఆ జట్టులోని సభ్యులు ... ఉత్తర దిక్కున వెళ్లకూడదని, మరో చోటుకు వెళ్లాలని నిర్ణయించారు .
అదే కీడెంచి మేలెంచడం .
మానవ బుద్ధి నెగటివ్ విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది . ఇది మానవ జాతి మనుగడ రహస్యం .
సరిగ్గ్గా ఈ మన బలహీనతను ఆసరాగా చేసుకొని మీడియా సోషల్ మీడియా పని చేస్తుంది ఒక నటుడు ఎన్ని కష్టాలు పడి అగ్రనటుడు అయ్యాడు అనే స్టోరీ కన్నా ఆ నటుడు హీరోయిన్ ల కన్యత్వాన్ని ఎలా దోచుకున్నాడు అనే స్టోరీ కు లక్ష రెట్లు ఎక్కువ పాపులారిటీ . అందుకే సోషల్ మీడియా లో మానసిక రోగులు నేరప్రవృత్తి కలిగిన వారు సంఘ వ్యతిరేక శక్తులు హీరో లు అయిపోయారు . వార్తల్లో నిలవాలి అంటే నెగటివ్ విషయాలు వివాదాలు ఎత్తుకోవాలి అనేదే ఓడ్కా వాడి స్కూల్
ఈ పోస్ట్ వోడ్కా , అగ్గిపెట్టె మామ, తార్నాక పాలు లాంటి వారి గురించి కాదు .
ఈ పోస్ట్ మీ గురించి .. అంతకన్నా ఎక్కువగా మీ పిలల్ల గురించి .
మీ ఆలోచనలే మీ జీవితం . మీ ఆలోచనలే మీ పిల్లల భవిత . మీ ఆలోచనలే మీ వంశ చరిత్ర
"శుభం పలకరా" అన్నారు పెద్దలు .
పాజిటివ్ విషయాలే చదవండి . మాట్లాడండి . కామెంటండి . చూడండి .
అప్పుడు మీ బతుకు చక్కగా... చల్లగా... హ్యాపీగా
ఎప్పుడూ నెగటివ్ విషయాలు బుర్రలోకి ఎక్కిస్తే... రోగాలు రొచ్చులు .. బతుకు బుగ్గి పాలు..
నెగటివ్ విషయాలు అంటే ?
రామ రావణ యుద్ధం ... రామాయణం . కురు పాండవ యుద్ధం మహాభారతం .
ఇవి పాజిటివ్ ? లేదా నెగటివ్ ?
కథ కాదు .. కథనం ముఖ్యం .
రావణుడు కీచకుడు లాంటి వారిని గురించి చదివితే .. చెడు ను ఎదిరించాలి పోరాడాలి అని ధైర్యం సంకల్పం వస్తుంది . ఇదే స్టోరీ ని నేడు సోషల్ మీడియా వారు తీస్తే ?
కీచకుడి కోణం నుంచి భారతం.. రావణుడి కోణం నుంచి రామాయణం { .. రావణుడు చేసిన పనిలో తప్పేముంది .. ఆయన చెల్లి ముక్కు చెవి కోశారు కదా .. ఇలా అడ్డగోలు వాదనలు తో }
.సత్య హరిశ్చంద్ర నాటకం చూస్తే ఎన్ని కష్టాలకు ఓర్చయినా నిజం పలకాలి అని సంకల్పం వస్తుంది .
ఇదే కథను తీసుకొని" నిజం మాట్లాడితే ఇన్ని కష్టాలు వస్తాయి .. వున్నది ఒకటే లైఫ్ .. ఎంజాయ్ చెయ్యండి . లవ్ లో స్వార్థం ఉంది . అదే సెక్స్ లో ఇవ్వడం ఉంది" . అని చెప్పడం? అదే ఓడ్కా స్కూల్. అదే నేటి సోషల్ మీడియా
మంచికి చెడు సంఘర్షణ ఉంటుంది . ఉండాలి . దాన్ని చదవడం తెలుసుకోవడం నెగటివ్ కాదు . పాజిటివ్ .
వివాదాలు .. వక్రీకరణలు .. అడ్డగోలు వాదనలు .. బూతులు .. హింస .. సామజిక విలువలు మరచిన సెక్స్ .. ఇవన్నీ నెగటివ్ .
నెగటివ్ ని బహిష్కరించండి . అలాంటి వాటిని చూడొద్దు . విమర్శ కోసం అయినా కామెంట్ చెయ్యొద్దు . షేర్ చెయ్యొద్దు . లేకపోతే అది మిమ్మల్ని దహించి వేస్తుంది .
ధర్మో రక్షతి రక్షితః .
మంచిని కాపాడండి .
మంచి ని మాట్లాడండి . వినండి . చూడండి .
ఈ మెసేజ్ ను అందరితో పంచుకోండి . నా పేరు చేర్చనక్కర లేదు .
అజ్ఞాత రచయిత అనుకోండి చాలు .
{ఈ పోస్ట్ చదివి ఇందులో నేను వాస్తు శాస్త్రానికి దైవానికి వ్యతిరేకంగా కామెంట్ చేశాను అని మీరనుకొంటే ..
! చదివి విషయాన్ని ఆవగాహన చేసుకొనే శక్తి లేదని ..
2 సోషల్ మీడియా పుణ్యమా అని మీ బుర్ర పూర్తిగా పాడైపోయిందని అర్థం }
0 Comments