బరాక్ ఒబామా 44 ఏళ్లకే అమెరికా అధ్యక్షుడయ్యాడు . 55 ఏళ్లకు రిటైర్ అయ్యాడు .
డోనాల్డ్ ట్రంప్ 70 ఏళ్లకు అమెరికా అధ్యక్షుడయ్యాడు .
జగపతి బాబు వయస్సు 61 . గత ఐదారేళ్ళనుంచి హీరో పాత్రలకు స్వస్తి చెప్పి విలన్ పాత్రలను పోషిస్తున్నాడు .
హీరోగా చిరంజీవికే పోటీనిచ్చిన , రాజశేఖర్ 61 ఏళ్లకు అనారోగ్య సమస్యల తో బాధ పడుతున్నాడు .
హీరో సుధాకర్ తెలుగు గా, సహజంగా సినిమా ఫీల్డ్ లో ఉండే కుళ్ళుని , కుతంటాలని,కులవివక్షని ఎదుర్కొని గెలిచాడు. ఇప్పుడు వయస్సు 64 . అనేక ఏళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు .
మహేష్ బాబు వయస్సు 48 . ఇరవై అయిదేళ్ల హీరో లాగా కనిపిస్తున్నాడు .
బాలకృష్ణ వయస్సు 63 . తన నట జీవితం లో ఎప్పుడూ లేనంత పీక్ లో ఉన్నాడు.హాట్రిక్ విజయాల్ని సాధించాడు .
చిరంజీవి వయస్సు 68 . కసితో మరో హిట్ కొట్టాలని ఎదురుచూస్తున్నాడు .
రజనీకాంత్ వయస్సు 74 . ఈ వయస్సులో చాలా మంది అన్ని వ్యాపకాలను మానుకొని ఇంటిపట్టున ఉండిపోతారు . ఈయన 600 కోట్ల బ్లాక్ బస్టర్ కొట్టి అభిమానుల గుండెల్లో మరో సారి జైలర్ అయ్యాడు .
తాత సూపర్ స్టార్ . తండ్రి సూపర్ స్టార్ .
మరో స్టార్ హీరో నాగార్జున కొడుకు అఖిల్ వయస్సు 29 y . ఇంకా హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు అఖిల్ .
రవి తేజ 1992 సంవత్సరంలోనే నటించడం మొదలెట్టాడు . పదేళ్ల తరువాత, 35 y వయస్సు లో తోలి హిట్ చూసాడు. .
జీవితం ఒక సూదూర పరుగుపందెం .
అంటే మారథాన్ రేస్ .
పదవ తరగతి , ఇంటర్ , ఎంసెట్ , క్లాట్, నీట్ , ఐఐటీ జేఈఈ, సివిల్స్, గ్రూప్ 1 , 2 , పెళ్లి , వ్యాపారం , జాబ్ .. లాంటివి వంద మీటర్ ల పరుగుపందేలు .
గెలిస్తే బాగుటుంది .
గెలవడం కోసం ఇష్టపడి కష్టపడాలి .
కానీ .. వాటిలో గెలిస్తే జీవితం సెటిల్ అయిపోయినట్టు కాదు .
IAS , IPS లాంటి సర్వీస్ లు సాధించి రిటైర్మెంట్ వయసులో కూడా ట్రోలింగ్ కు గురవుతున్న వారిని చూస్తున్నాము . { వారు మాట్లాడింది సరైందా? కాదా? వారిని ట్రోలింగ్ చేయడం న్యాయమా ? అనే చర్చ లోకి ఇక్కడ వెళ్లడం లేదు . గమనించగలరు }.
పాట ఆగకూడదు .. ఆట ఆగకూడదు
బహుదూరపు బాటసారి !
పేరుగెత్తాలి . ప్రతి రోజు .. ప్రతి గంట .. పరుగెత్తాలి .
మారథాన్ రేస్ లో వంద మీటర్ ల పరుగుపందెం లో పరుగెత్తినట్టు ఊపిరి బిగబట్టి పరిగెత్తితే త్వరగా అలసిపోతావు .
నింపాదిగా ప్రతి నిముషాన్ని... గంటని... ఎంజాయ్ చేసూ పరుగెత్తాలి .
రేస్ లో ఉన్నామని గుర్తుంచుకోవాలి .
చాలా మంది ఒక సక్సస్ సాధించిన వెంటనే" ఇంకేంటి లైఫ్ లో గెలుపొందాము" అనుకొని పరుగును ఆపేస్తారు .
ఆత్మ హత్య చేసుకొన్న ఐఏఎస్ ల ను చూసాము . ఐఐటీ విద్యార్థుల ఆత్మ హత్యలు చూస్తున్నాము .
ఊహ తెలిసినప్పటినుంచి తుది శ్వాస దాక మారథాన్ ను సాగించాలి ." రిటైర్ అయ్యాను! నాకేంటి పెన్షన్ వస్తుంది "అని సంతోషంగా ఇంటిపట్టునే కూర్చుంటాను అనుకుంటే మానసిక రొగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది .
చేస్తున్న పని ని ఎంజాయ్ చేస్తూ జీవనం సాగించాలి .
ఒక పరీక్షలో లేదా వరుసగా పది పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం ముగిసినట్టు కాదు . చిరంజీవికి కు ఒక దశలో ఎన్ని ప్లాప్ లో వచ్చాయి తెలుసా ?
ఎవరూ విజేతలు కారు .. పరాజితులూ కారు .
ఎన్నో సాధించిన వారు కూడా అరవై- డెబ్భై ఏళ్ళ వయసులో వచ్చే అనారోగ్యం , పిల్లల ప్రవర్తన వల్ల కలిగే బాధల్ని, అవమానాల్ని ఎదుర్కొని , తట్టుకొని నిలబడి జీవితం లో విజయాన్ని చవిచూచి ఆనందించేవారు ఎందరో !
జీవితంలో చదువు, ఉద్యోగం/వ్యాపారం, పిల్లలు, తల్లితండ్రులు , ఆరోగ్యం కూడా ముఖ్యమే . దీనిలో ఏది ఫెయిల్ అయినా జీవితం నరకం .
జీవితం ఒక విస్తరి . రుచి బాగుంది అని లడ్డునే కడుపునిండా తినరు కదా . ప్రణాళిక ఉంది, పోరాటం చేస్తే కష్టాల్ని గ్లూకోస్ గా గా తీసుకొంటూ ... అవమానాల్ని షూస్ గా వేసుకొని పరుగు సాగించాలి .
అపజయానికి మించిన గురువు లేదని గ్రహించాలి.
నిన్నటి కంటే నేడు బాగుండాలి . రేపటి కంటే ఎల్లుండి బాగుండాలి .
నీ జీవితానికి నువ్వే హీరో / హీరోయిన్ . వేరొకరితో పోలికెందుకు?
ఇహలోక కుబేరుడు అంబానీ నేడు బ్లాక్ మైలర్స్ థ్రెట్ ను ఎదురుకొంటున్నాడు .
మంత్రులు తుపాకి నీడలో బతుకుతున్నారు .
హీరో లు హీరోయిన్ లు సెలబ్రిటీ లు .. నీలా రైల్వే స్టేషన్ కు బస్టాండ్ కు పార్క్ కు .. టూర్ కు పోగలరా ? వారు పంజరం లో పక్షులు . అదృష్టం నీదా? వారిదా ?
మన ఆలోచనే మన జీవితం .
ఎందుకు పుట్టావో ఎందుకు మరణిస్తావో తెలియదు . అది నీ చేతిలో లేదు. ఈ దూరపు ప్రయాణం నీచేతిలోనే , ముళ్లబాటలోనాఅనేది నీవే నిర్ణయించుకోవాలి.
బలే మంచి రోజు .. పసందైన రోజు .. వసంతాలు పూచే రోజు అను సాగాలి,
అది నీ చేతిలోనే ఉంది.
ఈ లోకం నీ ముందు నిలిచిన అద్దం.
ఓ బాటసారి !
ఈ మాటల్ని మరువకోయి !
0 Comments