గుండెను పదిలంగా ఉంచుకోవాలంటే ఏమి చెయ్యాలి ?

గుండెను పదిలంగా ఉంచుకోవాలంటే ఏమి చెయ్యాలి ?

అల్ప ప్రాణి జాతి ! 
గుండె పోటు మరణాలు సర్వ సాధారణం అయిపోయాయి .
 పెరిగిన గుండెపోటు మరణాలకు" కరోనా నే కారణమని" కవర్ అప్ వ్యవహారం నడుస్తోంది .
 వినేవాడు కరోనా భయస్తుడు అయితే చెప్పేవాడు ఫార్మాసురుడు! 
ఈ వ్యవహారం ఎలా ఉన్నా... 
 గుండెను పదిలంగా ఉంచుకోవాలంటే ఏమి చెయ్యాలి ?



... ఇదీ నేడు అనేక మందిని వేధిస్తున్న అంశం ! 
గుండె పదిలంగా ఉండాలంటే కార్డియో వ్యాయామం ఒక క్రమ పద్ధతిలో చెయ్యాలి !
 కార్డియో వ్యాయామం అంటే ఊపిరి బాగా పీల్చుకొనేలా, గుండెవేగంగా కొట్టు కొనేలా నడవడం . జిం లో అయితే ట్రెడ్ మిల్. 
 వేగంగా నడిచినప్పుడు...
 లోతుగా ఊపిరి పీల్చుకోవలసిన{ డీప్ బ్రీతింగ్ } అవసరం ఏర్పడుతుంది .
 గుండె వేగంగా కొట్టుకొంటుంది .
 గుండెకు , ఊపిరి తిత్తులకు వ్యాయామం .
 రక్త ప్రసరణ వ్యవస్థ , శ్వాస వ్యవస్థ బలోపేతం ! 
" ఆధునిక కాలం లో నడక లేదా జిం లో ట్రెడ్ మిల్/ స్టెప్పెర్ లాంటి వాటి పై వ్యాయామం తప్పని సరి" అని ఎవరైనా చెబితే , "పూర్వీకులు ఇవన్నీ చేసారా ? చేయక పోయినా ఆరోగ్యంగా ఉన్నారు కదా?" అని కొందరు ప్రశ్నిస్తారు .

 నేడు ..
ఆంగ్లం అంతర్జాతీయ భాష అయ్యింది . ఆంగ్లం నేర్చుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, తద్వారా జీవితం  సాగుతుందని నమ్మం, అందుకే అందరు ఆంగ్లం నెవార్థం మొదలు పెట్టారు 
కానీ నేడు మనం ఇంకో అడుగు ముందుకేసి చిన్నపిల్లని కూడా ఆంగ్లంలో , అది అమెరికన్ యాస లో మాట్లాడాలని ఒత్తిడి చేస్తున్నారు , ఆ దిశగా తల్లితండ్రులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు .
ఆంగ్ల భాష పుట్టింది ఇంగ్లాండ్ లో. తెల్ల దొరల వలస పాలన వల్ల అది అనేక దేశాలకు విస్తరించింది . ఇప్పుడు ఆంగ్ల భాషకు ఎన్నో యాసలు . 
అమెరికా యాస . ఇంగ్లాండ్ యాస . ఆస్ట్రేలియా యాస ,. న్యూజిలాండ్ యాస . దక్షిణాఫ్రికా యాస , కెనడా యాస ఇండియా లో ప్రమాణీకృతమయిన నగర ఆంగ్ల యాస .
ఒక్కో భాష ఆవిర్భావం , పరిమాణం లో ఆయా ప్రాంతాల భౌగోళిక చారిత్రక కారకాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి . 

ఆంగ్లం పుట్టింది ఇంగ్లాడ్ లో అని చెప్పుకొన్నాం . ఇది చలి దేశం . సంవత్సరం లో తొమ్మిది నెలలు మంచు .. విపరీతమయిన చలి . 
చలి ప్రాంతం లో బాగా నోరు తెరిచి , గట్టిగా శ్వాస పీల్చుకొంటూ మాట్లాడితే ,నోటిద్వారా లేదా ముక్కు గుండా ఊపిరి తిత్తులలోకి వెళ్లి ఇన్ఫెక్షన్(వ్) లు సోకే ప్రమాదముంది . 
మీరు అద్దం ముందు కూర్చొని ఒక ఆంగ్ల పుస్తకం తీసుకొని గట్టిగా చదవండి . 
లేదా మీ ఇంట్లో ఇంకొకరి చేత చదివించండి . 
 మనం రకరకాల పదాలను ఉచ్చరిస్తున్నప్పుడు మన శరీరం లోని ఏ ఏ అంగాలు వాడుతాము ?
గొంతు , నాలుక , పెదాలు ,ముఖ్యంగా స్వరపేటిక . పదాలనిబట్టి దవడల సాయం . అవునా ?
 ఇంకేదైనా శరీర అంగాలను ఉపయోగిస్తామా ?
 అవునండీ ఊపిరి తిత్తులు .ఛాతి భాగం కూడా ! 
మీరు కానీ మీఇంట్లో ఎవరైనా ఆంగ్లాన్ని చదివినప్పుడు ఎంత వరకు ఊపిరి తిత్తులను వాడారు ? 
 బాగా తక్కువ . అవునా ? కాదా ? ఒక సారి టెస్ట్ చేసుకోండి !
ఇప్పుడు యూట్యూబ్ లో కానీ టీవీ లో కానీ బీబీసీ న్యూస్ ఛానల్ చూడండి .
 ప్రాచ్యాత్యులు (అమెరికా ,కెనడా ,ఇంగ్లాండ్) లో ప్రజలు మాట్లాడే  యాసలు నిశితంగా గమనించండి . వారి మాటల్లో గట్టిగా శ్వాస పీల్చుకొనే అవసరం బాగా తక్కువగా ఉంటుంది . 
నూటికి తొంబై అయిదు మాటలు , నోటి ద్వారా అంటే కేవలం స్వర పేటిక, నాలుక దవడలు సాయం తోనే పలుకుతారు . 

అంటే ఇండియన్ ఇంగ్లీష్ కన్నా అమెరికా / కెనడా / ఇంగ్లాడ్ యాసల్లో శ్వాస వ్యవస్థపై ఒత్తిడి బాగా తక్కువ . 
బాగా గమనించండి 
ఇప్పుడు తెలుగు భాష విషయానికి వద్దాము . 
భారతదేశం లో చాల భాషలకి మాతృక సంస్కృతం , తమిళం కి మినహాహింపు. సంస్కృతం లో అలాగే మన తెలుగు లో అల్ప ప్రాణ అక్షరాలు , మహా ప్రాణ అక్షరాలు వున్నాయి .
ఈ కింది పదాలను గట్టిగా పలకండి . 
కలం , గంట , జలం, దయ , పలక... ఊపిరి తిత్తుల పై ఒత్తిడి లేకుండా ఈ పదాలను పలికెయ్యొచ్చు .
 క , గ , చ , జ , ద, ప వీటిని అల్ప ప్రాణ అక్షరాలు అంటారు .
ఇప్పుడు వొత్తు క . అదే నండీ ఖ . అలాగే ఒత్తు గ .. ఘ.. లాంటి ఒత్తు హల్లులనే మహా ప్రాణాక్షరాలు గా అంటాం !
మహా ప్రాణాక్షరాలతో వచ్చే ఈ పదాలను గట్టిగా పలకాలి . 
 ఏదీ చెయ్యండి .
ఖజానా , తాఖీదు , ఖాతా, నిఘా , ఘనం , మేఘం , ఘీంకారం , ఘంటారావం .. 
 ఏమండీ... ఒత్తి పలకాలి . గట్టిగా పలకాలి .
 వరుసగా అయిదారు సార్లు పలకండి .
పలికారా ? ఇప్పుడు మీ గుండెను తాకండి . అది మునుపటికన్నా కాస్త వేగంగా కొట్టుకొంటోంది . అవునా ? కాదా ?
 మహాప్రాణాక్షరాలను పలికేటప్పుడు ఊయిరి ఊపిరితిత్తుల సాయం తీసుకొన్నారు . అలాగే ఛాతిని కూడా ఉపయోగించారు .
 కదా ? 
ఒక్క ముక్క లో చెప్పాలంటే సంస్కృతం లో , తెలుగు లో ఇంకా అనేక భారతీయ భాషల్లో మహాప్రాణ అక్షరాలను గట్టిగా చదవడం అంటే..... కార్డియో . 
గుండె ఊపిరి తిత్తులకు క్రమ బద్ధమయిన వ్యాయామం .
ఊబకాయం ఉన్న వ్యక్తులు గుక్క తిప్పుకోకుండా మాట్లాడలేరు . 
మాట్లాడితే ఆయాసం వస్తుంది .
అవునా ? కాదా ?
మీరు తిరుమల కొండ కు వెళ్ళారా ? ముఖ్యంగా సుప్రభాత దర్శనం చేసుకున్నారా ? అక్కడి పురోహితులు ఎక్కువమంది ఎంతో కొంత ఊబ కాయాన్ని కలిగివుండడం చూసివుంటారు . { వారి వృత్తి రీత్యా శారీరిక శ్రమ తక్కువ , తీసుకొనే ఆహారం ఎక్కువ ఫాట్ ను కలిగివుండడం కారణాలు }. తెల్లవారు జామున మూడు గంటలకు మొదలెట్టి మరో ఇరవై నిముషాలు శ్రీవారి సుప్రభాతాన్ని వినిపిస్తారు . 
చూసారా ? విన్నరా ? ఏదో లోకంలోకి వెళ్లిపోయారు కదా? 
సుప్రభాతం అటు పై శ్రీవారి గద్యం చదువుతున్నప్పుడు పురోహితులు ఎక్కడైనా తడబడడం గస { ధం} పోయడం చూసారా ? ఎక్కడా ఎవరూ ఊపిరి తీసుకోవడం లో అలిసి పోయినట్టు కనిపించరు . 
.కారణమేంటో ఎప్పుడైనా ఆలోచించారా ?
మహా ప్రాణాక్షరాలు పలకడం కూడా ఒక రకమైన కార్డియో నే. 
రోజూ మహాప్రాణ అక్షరాలను పలికే వారికి గస ఎందుకు వస్తుంది ?
కార్డియో వాస్కులర్ వ్యవస్థ దృడంగా ఉంటుంది మరి !
ఆంగ్లంలో మహా ప్రాణ అక్షరాలు లేవా ? 
స్ప్లాష్ , స్ట్రీట్ లాంటి కొన్ని పదాలను మినహాహాయిస్తే ఆంగ్లంలో మహాప్రాణ అక్షరాలు లేవు . 
ఉండవు కూడా ? 
ఎందుకో ఆలోచించారా ?
చెప్పాను కదా ! వారి భాష పుట్టింది శీతల ప్రాంతాల్లో . గట్టిగా ఊపిరి పీల్చుకొని మాట్లాడితే ,ఊపిరి తిత్తుల్లోకి చెమ్మ దానితో బాటే వైరస్ మరియు బ్యాక్తీరియా వెళుతాయి . ఆరోగ్య సమస్యలు వస్తాయి . ఈ విధంగా భౌగోళిక చారిత్రక కారణాల వల్ల వారి భాషలో వొత్తిపలికే అక్షరాలు పదాలు లేకుండా పోయాయి . ఉన్నా బాగా తక్కువ.  
అంటే ఆంగ్ల భాష మాట్లాడితే కార్డియో వ్యాయామం పెద్దగా ఉండదు .
ముఖ్యంగా అమెరికా యాసను చూడండి . దీనిలో నూటికి తొంబై తొమ్మిది పదాలు నోటితో, ముక్కుతో మాట్లాడివే . ఊపిరి తిత్తుల ప్రమేయం ఉండదు .
మనది ఉష్ణ మండల ప్రాంతాలు . ముఖ్యంగా దక్షిణాదిలో మంచు పడడం ఉండదు .శీతాకాలం లో కొన్ని రోజులు తప్పించి పొగమంచు పెద్దగా ఉండదు. 
అందుకే ఇక్కడి భాష లో మహా ప్రాణాక్షరాలు .
తెలుగు భాషను { ఆ మాటకొస్తే అనేక భారతీయ భాషలు } సరిగా మాట్లాడడం అంటేనే కార్డియో వ్యాయాయం ! 

ఒక సారి యూట్యూబ్ లో ఎస్పీ పాడిన చరణ కింకిణులు / శంకరా నాద శరీరాంభర/ శివరంజని లాంటి పాటలు చూడండి . ఇలాంటి లోతైన శ్వాస తీసుకోని పడే పాటలు ప్రాచ్యాత ప్రపంచంలో ఎన్ని ఉన్నాయి  ? ఎలాగూ యూట్యూబ్ఓపెన్ చేసారు కదా ? శంకరాభరణం లో శంకర శాస్త్రి గారు వెస్టర్న్ మ్యూజిక్ కు ఇండియన్ మ్యూజిక్ గల తేడా ను వివరించి న క్లిప్ చూడండి . ర... ర... ర... రే... రే... అని పాడినప్పుడు ఎంత వరకు శ్వాస వ్యవస్థ ఉపయోగించారు అదే ఆ... ఆ... ఆ... అని పాడినప్పుడు శ్వాస వ్యవస్థ ఉపయోగించిన తీరు చూడండి . 
తెలుగు భాష ను చదవక , చదివినా ఆంగ్లాన్ని మాట్లాడినట్టు " మంచు యాస" లో { అంటే మంచు పడే ప్రాంతాల్లో వారు మాట్లాడినట్టు ఊపిరి వాడకుండా అంటే ఒత్తి పలకకుండా ముక్కుతో నాలుకతో మాట్లాడడం అండీ . ఇంకేదో అనుకునేరు . అయ్యో రామా ! } మాట్లాడితే ?
రోజు ప్రతి బిడ్డ కు / మనిషికి సహజంగా వచ్చే కార్డియో వ్యాయాయం చచ్చినట్టే గా ?
తెలుగు భాష ను మరవడం అంటే మహా ప్రాణులమయిన మనం అల్ప ప్రాణులం అయినట్టే ! 

ఒప్పుకొంటారా?
ఇంకో మాట ! 
మన పూర్వీకులు .. కాలినడకన .. 
మల్లన దర్శనం చేసుకోవాలంటే శ్రీశైలం వెళ్లేవారు . 
వెంకన్న కోసం తిరుపతి .
భద్రాద్రి .. నరసింహ స్వామి .
అందరు దేవుళ్ళు కొండపైనే .
సంవత్సరానికి కనీసం ఒక్క సరి స్వామి దర్శనం కోసం నడవాలి . అటు పై కొండ ఎక్కాలి.
కొండ ఎక్కడం అంటే మరింత దృఢమయిన కార్డియో . 
కొండ ఎక్కేటప్పుడు ఊరుకునే వారా ?
శంభో శంకర ! 
విత్తల విత్తల { టైపు చేస్తుంటే వత్తు ట్ట రావడం లేదు . సరిగా చదుకోగలరు } మహా ప్రాణాక్షరాలు .
అంటే డబల్ కార్డియో .
మీ అనుమానం నాకు అర్థం అయ్యింది . గోవిందా గోవిందా అనే దానిలో మహాప్రాణాక్షరాలు లేవు అనేగా? 
గోవిందా... గోవిందా... పది సార్లు గట్టిగా పలికి మీ ఊపిరి తిత్తులను .. గుండె వేగాన్ని చెక్ చేసుకోండి .
భగవన్నామ స్మరణతో కొండపై మనం పలికే పలుకులు కూడా / దేవుని దర్శనం అంటే కార్డియో .
తెలుగు వారికి నేడు బూతులు ప్రియం అయిపోయాయి .
తెలుగు భాష ను మాట్లాడక పోవడం అంటే .. " చేసుకొంది పొయ్యింది .. ఉంచుకొంది పొయ్యింది " అనే పరిస్థితి.

Post a Comment

0 Comments

Advertisement