బుల్డోజర్ బాబా

బుల్డోజర్ బాబా

 ఉత్తరప్రదేశ్ : ఆజామ్ ఖాన్ తో పాటు అతని. భార్య, కొడుకు కి 7 సంవత్సరాల కారాగార శిక్ష పడ్డది!


90 వ దశకంలో ఉత్తరప్రదేశ్ లో ములాయం, ఆజంఖాన్ వంటి రాజకీయనాయకుల పేర్లు ప్రముఖంగా వినపడేవి. 

అజాం ఖాన్ అంటే  లాల్ టోపీ పార్టీ గా అభివర్ణించేవారు!

అప్పటి ముఖ్యమంత్రి ములాయoసింగ్ యాదవ్ తరువాత పార్టీలో నంబర్ 2 అజాం ఖాన్ గా ఉండేవారు. 

ములాయంసింగ్ యాదవ్ కొడుకు అఖిలేషుయాదవ్ ఉన్నాకూడా  అజాం ఖాన్ నంబర్ టూ గా ఉండేవాడు. 

**********************

ప్రభుత్వ,ప్రవేటు కార్యక్రమైన ఆజంఖాన్ ఉండేవాడు, అయన లేకుండా ఈ కార్యక్రమం జరిగేదికాదు. అంతలా ఆయన ప్రాబల్యం ఉండేది. 

సుదీర్ఘకాలం ఉత్తరప్రదేశ్ ని పాలించిన సమాజ్వాదీ పార్టీ లో అజాం ఖాన్ పాత్ర ఎలాంటిది అంటే …… పారిశ్రామికవేత్తలు,IAS,IPS,వ్యాపారవేత్తలు ఇలా ఎవరికయినా పని కావాలంటే అజాం ఖాన్ ని కలిస్తే చాలు వాళ్ళకి కావాల్సిన పని చేసిపెట్టేవాడు అజాం ఖాన్.

ముఖ్యమంత్రి ని కలవాల్సిన అవసరం ఉండేది కాదు ఎవరికీ! చివరికి అఖిలేష్ యాదవ్ వల్ల కూడా కాని పనిని అజాం ఖాన్ చేసిపెట్టేవాడు.

********************

డిజీపి నుండి సాధారణ అధికారి వరకు ఆజంఖాన్ ఫోన్ చేస్తే , చెప్పిన పని చేసేవాళ్ళు.  

ఇక పరిపాలనా విభాగం అయితే చీఫ్ సెక్రటరీ నుండి తాహశీల్దార్ వరకు ఒక్క ఫోన్ కాల్ తో పన్చేయించుకునే వాడు అజాం ఖాన్!

**************

కానీ కాలం యోగి ఆదిత్యనాధ్ రూపంలో కాటు వేసింది!

అజాం ఖాన్ అతని కుటుంబం మొత్తం జైలు పాలయ్యారు.

ఫోర్జరీ,చీటింగ్,ఫ్రాడ్,మరియు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేసారంటూ IPC సెక్షన్లు 420 / 467 / 468 / 471 / 120B కింద అభియోగాలు లని మోపి వాటిని నిరూపించిన కారణంగా 7 ఏళ్ళు జైలు శిక్ష విధించింది

రామ్ పూర్ కోర్టు.

*****************

ఇక అజాం ఖాన్ భార్య అయిన తాన్ సేన్ ఫాతిమా, కొడుకు అబ్దుల్లా లు ఇద్దరూ తమ పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రాలని ఫోర్జరీ చేసి తప్పుడు ఆఫడవిట్ లు ఇచ్చారు.

1990 లో రామ్ పూర్ మునిసిపాలిటీ ఎన్నికలలో ఇచ్చిన ఆఫడవిట్ లో తమ పుట్టినరోజు ధృవ పత్రాలలో ఇచ్చిన తేదీ ఒకటయితే,1993 లో లక్నో మునిసిపల్ ఎన్నికల కోసం ఇచ్చిన ఆఫడవిట్ లో వేరే తేదీలు ఉన్నాయి. కానీ ఆలా రెండుచోట్ల ఇచ్చిన తేదీలు  అసలువి కాదు.

అబ్దుల్లా నకిలీ పాస్పోర్ట్ తో విదేశాలకు వెళ్లి వచ్చాడు.

*****************

వివాదనేరాల పైన 2019 లో రెండేళ్లు జైలు శిక్ష, 2022 లో 3 సంవత్సరాల జైలు శిక్షని విధించింది అలహాబాద్ కోర్ట్ . దాని ఫలితంగా తన ఎమ్మెల్యే పదవిని కోల్పోయాడు. 

*****************

 2014 లో మోదీజీ ప్రధానమంత్రి అయ్యాక ప్రజాస్వామ్యం ప్రమాదం లో పడిందంటూ చేసిన ప్రకటన రాజకీయ ప్రకంపలను రేపింది. 

ఇప్పుడు 7 ఏళ్ళు రాంపూర్ జైల్లో నిజమయిన ప్రజాస్వామ్యాన్ని అనుభవించపోతున్నాడు!

******************

ఇంతా చెప్పుకొని అసలు విషయం చెప్పుకోక పోతే దర్జా తగ్గిపోతుంది!

మన బుల్డోజర్ బాబా పేరు ఇప్పుడు ఇటలీ దేశంలో మారుమోగుతున్నది!

ఇటలీ ప్రధాని జార్జ్ మెలోనీ ఇటలీ దేశంలో ఉంటున్న అక్రమ వలసదారులని అరెస్ట్ చేసి దేశం నుండి వాళ్ళ వాళ్ళ దేశాలకి పంపించే పనిలో ఉంది!

ఇప్పటికే బుల్డోజర్ల తో అక్రమ నివాసాలాని కూల్చి వేస్తున్నది. 

'నేను ఇటలీని మరో మధ్యప్రాచ్యం కానివ్వను' జార్జ్ మెలోని!

జార్జ్ మెలోని చెప్పిన మాటలని మరో సారి గుర్తు చేసుకుందాము!

నేను అధికారంలోకి వస్తే అక్రమంగా కట్టిన మసీదులని కూలగొడతా! సిరియా,ఆఫ్ఘనిస్థాన్ నుండి వచ్చి అక్రమంగా ఇటలీ లో ఉంటున్న వారిని దేశం నుండి వెళ్ల గోడతా! ఇటలీలోని మసీదుల నుండి మైక్ లో ప్రార్ధన వినపడుతుంది ఆ ప్రార్ధన అరబిక్ లో ఉంటుంది దాని అర్ధం ఏమిటో నాకు తెలుసు. అందుకే ఇటలీ లో మసీదుల్లో చేసే ప్రార్ధన ఇటాలియన్ భాషలో చేయాలి అని చట్టం చేస్తాను. అప్పుడు ఇటలీ ప్రజలకి మసీదుల్లో రోజూ చేసే ప్రార్ధన అర్ధం ఏమిటో తెలుస్తుంది.

******************


బుల్డోజర్ బాబా మోడల్ ని అనుసరిస్తున్న జార్జ్ మెలోని అంటూ ఇటాలియన్ మీడియా వార్తలు వ్రాస్తున్నాయి!

Post a Comment

0 Comments

Advertisement