హీరో వర్షిప్ సిండ్రోమ్ :

హీరో వర్షిప్ సిండ్రోమ్ :

 హీరో వర్షిప్ సిండ్రోమ్ :


మనం ఒక క్రికెటర్, మూవీ హీరో, రాజకీయనాయకుడిని అభిమానించడం లేదా ఆరాధించడం జరుగుతుంది, గతంలో కూడా ఇలాగె ఉండేది. 

 ఇది ఒక మాస్ సైకాలజీ అంశం .


తాను నిజజీవితంలో చేయలేనిది తన హీరో { ముఖ్యంగా సినిమా హీరో } వెండి తెరపై చేసి చూపిస్తే,  అది తనకు వర్తింప చేసుకొని ఒక రకమైన బ్రాంతి,  అందులోనించి వచ్చే అనుభూతి ని ఎంజాయ్ చేయడం .

ఉదాహరణకు రిక్షా నడిపే వ్యక్తి . శ్రమను  ను గౌరవించాలి . ఆ వృత్తిలోని గొప్పదనాన్ని సమాజం అర్థం చేసుకోవాలి . కానీ మన సమాజం లో ఆలా జరగలేదు .  అలాంటి   ప్రయత్నాలు కూడా పెద్దగా   జరగలేదు .

 రిక్షా నడిపే వ్యక్తిని సమాజం చిన్న చూపు చూస్తుంది . తెలుగు హీరో చిరంజీవి , "రిక్షావోడు" అని  సినిమా తీశారు . అందులో రిక్షా నడిపే వ్యక్తిని,  అందమైన, గొప్పింటి అమ్మాయి ప్రేమిస్తుంది . నిజజీవితం లో అలాంటివి చూడలేము, కానీ దాన్ని ఆ హీరో అందులో చేస్తాడు . దీన్ని  చూసి రిక్షా కార్మికులు ఎంతో మంది మానసిక/ఒక రకమైన సంతోషకరమైన  అనుభూతిని పొందారు . ఎందుకంటే వారు చేయలేనిది వేరొకరిద్వారా ఆ కోరిక నెరవేరింది అని. 

ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే . 

తొండ ముదిరితే ..?

హీరో ను అభిమానంచడం సాధారణం . కానీ ...

ఒక వ్యక్తిని .. ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు, హీరో కావొచ్చు, విభిన్న రంగాలకి చెందిన గొప్ప వ్యక్తులు కావొచ్చు , అనగా యూట్యూబ్, ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్,ట్విట్టర్ లో బాగా ప్రాచుర్యం పొందిన వ్యక్తులు.. 

ఆ వ్యక్తిని ...

1 . అమితంగా అభిమానించడం . తన కంటే తన భార్య / భర్త , తల్లి , తండ్రి , కొడుకు కూతురు కంటే ఎక్కువ ఇష్టపడడం .

2 . రోజులో ఎక్కువ గంటలు ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తూ , పోస్ట్ చేస్తూ , వాదిస్తూ గడపడం .  తన వృత్తి కంటే ఎక్కువ సమయం తన హీరో గురించి ఆలోచిస్తూ వాదిస్తూ గడపడం 

3 . ఆ వ్యక్తి గురించి ఎవరైనా సహేతుకంగా విమర్శించినా సహించలేకపోవడం . అలాంటి వారిని ద్వేషించడం .

4 .ఆ  వ్యక్తిలో లోపాలు ఉన్నా దాన్ని గ్రహించలేకపోవడం . గ్రహించినా దాన్ని సమర్థించడం . 

5 . ఆ వ్యక్తి దేవుడి ప్రత్యేక సృష్టి అని నమ్మడం .. ఆరాధించడం .. ఆ వ్యక్తి ఆరాధనే తన జీవితంగా చేసుకొని బతకడం .

👎👎 చదువంటే పట్టాలు మార్కు లు కాదు . చదువంటే సామజిక , భావోద్వేగ తెలివితేటలు  నేర్పేది . అది లేనినాడు నాడు సమాజం లో భావ దారిద్య్రం వస్తుంది . అది లేనివారికి అదొక  సూన్యత. ఆ ఖాళీ ను హీరో వర్షిప్ సిండ్రోమ్ భర్తీ చేసే అవకాశముంది .

👎👎 ఒక వ్యక్తి తన జీవితం లో అనుకున్నదాని పొందలేకపోయిన లేదా సాధించలేక పోయినా,  అతని తీరని కోరికలు ఎక్కువైనా హీరో వర్షిప్ సిండ్రోమ్ కు గురయ్యే అవకాశముంది . 

👊👊 సోషల్ మీడియా చాల ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీని ద్వారా హీరో వర్షిప్ అనీ అంటువ్యాధి    పెరిగి పెద్దదై ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది .  ఒక పండెమిక్ గా మారుతుంది .ఒకరి వల్ల,  మరొకరి లో ఈ సిండ్రోమ్ తీవ్రత పెరుగుతుంది. 

నేటి సమాజం లో అలాంటివారు కోట్లమంది. ఎంతగా అంటే తల్లితండ్రులు, గురువులు, మానసిక శాస్త్రవేత్తలు, మేధావులు కూడా గుర్తించలేనంతగా అది వ్యాపిస్తుంది.   ఇది  సహజం , సాధారణం అనుకొనేంతగా పరిస్థితి మారిపోతుంది .

ఇప్పటికే కనిపించి కనిపించని అంత దూరాలు తీసుకొనివెళ్ళింది

Post a Comment

0 Comments

Advertisement