ప్రజా ఆరోగ్య వ్యవస్థ

ప్రజా ఆరోగ్య వ్యవస్థ

 **ప్రజా ఆరోగ్య వ్యవస్థ ఎలా ఉండాలి? **


మన దేశంలో ఆరోగ్య వ్యవస్థ డబ్బుతో ముడిపడి ఉంది.. మనకు ఏదన్నా జబ్బు చేస్తే మనం ఆరోగ్యాన్ని డబ్బుతో కొనుక్కోవాల్సి వస్తుంది.. భారతదేశంలో అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ రోగులు తమ చేతి నుంచే ఖర్చుపెట్టే డబ్బు 65% గా ఉంది.. 

ఇండియా లో ఎన్నో ఆరోగ్య పథకాలు  వివిధ రాష్ట్రాల్లో  ఉన్నప్పటికీ సగటున భారత దేశంలో ఆరోగ్యానికి అయ్యే ఖర్చు ప్రతి నూరు రూపాయల్లో 65 రూపాయలు తమ సొంత ఆస్తులు నుంచే ఖర్చు పెట్టాల్సి వస్తుంది... ఇది బాధాకరం. 


యునైటెడ్ కింగ్డమ్ మరియు 45 దేశాలలో ప్రజా ఆరోగ్య వ్యవస్థ నేషనల్ హెల్త్ సర్వీసెస్ స్కీం ద్వారా నడుస్తూ ఉంటుంది .. ఇందులో పేషంట్ చేతి నుంచి ఖర్చు పెట్టే విధానం ఉండదు.. స్వయం ప్రతిపత్తి గల సంస్థకు ప్రభుత్వమే టాక్స్ ప్రేయర్స్ మనీ నుంచి కొంత డబ్బును అందులోనికి మార్చడం ద్వారా ఈ ప్రజారోగ్య వ్యవస్థను ప్రభుత్వమే నడిపిస్తుంది... అమెరికాలో లాగా ఇన్సూరెన్స్ సిస్టం అంటూ ఉండదు....

మనకు ఏదైనా సమస్య వస్తే మనం ఒక జనరల్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్ళాలి.. అతను మన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అవసరమైతే స్పెషలిస్ట్ డాక్టర్లకు, సూపర్ స్పెషలిస్ట్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తారు.. చిన్న చిన్నవి అయితే వాళ్లే మందులు రాసిస్తారు.. పది యూరోలలోపు ఖర్చు అయ్యే మందులను వెంటనే ఇచ్చేస్తారు కూడా.. ఎలాంటి పరిమితులు ఉండవు.. దంత సమస్యలు మరియు కంటి సమస్యలకు అయితే ఈ వెసులుబాటు ఉండదు.. పెద్ద ఆసుపత్రికి రెఫరల్ జరిగితే అక్కడ మిగతా వైద్యం అంత నేషనల్ హెల్త్ స్కీం ద్వారా ఉచితంగా జరుగుతుంది.. రోగికి వైద్యులకు ఆర్థిక సంబంధాలు డబ్బు లావాదేవీలు ఉండవు..

మన దేశంలో అయితే ఎవరికైనా గానీ జబ్బు చేసి వైద్యుని దగ్గరికి వెళ్లాలనుకుంటే రోగి డాక్టర్ని ఎంచుకుంటాడు.. రోగి తనకు తెలిసిన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి లేదా కార్పొరేట్ హంగులను బట్టి ఆసుపత్రి కానీ ఓ డాక్టర్ గాని మంచివాడు అని డిసైడ్ చేసుకొని అతని దగ్గరకు డైరెక్ట్ గా వెళ్ళిపోతాడు.. రోగికి తను ఏ డాక్టర్ దగ్గరికి అతను వెళ్లాలి అనేదానిపైన ఖచ్చితమైన అవగాహన ఉండదు... అందువలన అతను చిన్న తలనొప్పికి కూడా ఒక ప్రముఖ న్యూరోసర్జన్ దగ్గరికి వెళ్తాడు.. అప్పుడు అతను సిటీ స్కాను, ఎమ్మారై లాంటి పరీక్షలు కూడా రాస్తాడు.. దీనివలన చేతికి చిలుము వదులుతాది... అదే యూకే సిస్టంలో అయితే జనరల్ ప్రాక్టీషనర్ మొదటి చూసి అతనికి ఓ పారాసెటమాల్ టాబ్లెట్ ఇవ్వడంతో అంతా సెట్ అయిపోతుంది...

వైద్యుడికి రోగికి మధ్య ప్రత్యక్ష ఆర్థిక లావాదేవీలకు తావులేని ఆరోగ్య వ్యవస్థను మనం నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.. ఇచ్చి పుచ్చుకోవడం అనేది రోగికి వైద్యునికి మధ్య ఉన్నప్పుడు వైద్యంలో అనైతిక ధోరణులు ప్రబలడానికి ఆస్కారం ఉంది.. నేషనల్ హెల్త్ స్కీమ్ అనే సార్వత్రిక ఆరోగ్య రక్షణ వ్యవస్థ అనేది ప్రపంచంలో 40 దేశాలలో అమలవుతుంది ... మనకంటే పేద దేశమైన శ్రీలంకలో కూడా ఉంది మన దేశంలో మనం ఎందుకు అమలుపరచుకోలేము...

ప్రైవేటు వైద్య రంగాన్ని నియంత్రించే చట్టం ఏమీ లేకుండా కేవలం మార్గదర్శకాలు, నిబంధనల ద్వారానే మనం ప్రజలకు అందరికీ ఆరోగ్యాన్ని అందించగలము అని కలలు కనడం కేవలం భ్రమ మాత్రమే అవుతుంది..  చాలా మటుకు అన్ని జబ్బులకు ప్రామాణికమైన మార్గదర్శకాలను నిర్దేశించడం కూడా మనదేశంలో చాలా అవసరం ఉంది.. ఒకే జబ్బుతో ఓ రోగి ఓ ఆసుపత్రికి వెళ్తే ఒక రకమైన పరీక్షలు ఇంకో ఆసుపత్రికి వెళ్తే ఇంకో రకమైన పరీక్షలు మరియు వైద్యము జరుగుతుంది.. దీనివలన రోగులు వైద్యం గురించి తికమక పడడం జరుగుతూ ఉంటుంది..

మన దేశంలో వ్యవస్థలు విఫలం అవ్వడానికి కారణం మనలో సామాజిక స్పృహ అడుగంటడమే.. నిజాయితీ లోపించడం మరియు కమర్షియల్ గా మారిపోవడం అడుగడుగునా మనం చూస్తూనే ఉన్నాం.. ఇదే మన ప్రగతిని అడ్డుకుంటున్నది.. మరియు మనకు కావలసిన ఆరోగ్య భద్రతను సమకూర్చ లేకుండా ఉన్నది... 

ఆరోగ్య భద్రత కల్పించాల్సిన విషయం వైద్యులపైన మరియు వారిని నియంత్రించే ఎంసిఐ పైన మరియు ప్రభుత్వాలపైన ఈ బాధ్యత ఉంది.. వారందరూ తమ బాధ్యతను విస్మరిస్తే ఇక పేద ప్రజలకు దిక్కేమిటి..??

ఇలా వ్యవస్థలు అన్ని నిర్వీర్యం అయితే పేద ప్రజల ఆరోగ్యాన్ని కాదేది ఇక దేవుడే....?????

Post a Comment

0 Comments

Advertisement