అచ్చమైన 16 అణాల తెలుగు కథ.
హీరో అమెరికా పౌరుడు. తెలుగు రాయడం, చదవడం , మాట్లాడటం రాదు . యూనివర్సిటీ లో పీజీ చేస్తుంటాడు . అదే కాలేజీ లో తెలుగు కుర్రాడు చదువుతుంటాడు . ఇద్దరు రూమ్మేట్స్ . ఒకరోజు హీరో పైన హత్య ప్రయత్నం జరుగుతుంది . టైం మెషిన్ ఉపయోగించి ఎవరు చేసారో తెలుసుకొంటాడు. రూమ్మేట్ చేసాడని నిలదీస్తే,
మీ నాన్న నాన్న , మా నాన్న నాన్నని చంపాడు అందుకే నేను నిన్ను ,నీ కుటుంబాన్ని చంపాలని వచ్చాను అని చెప్తాడు . వాణ్ణి అక్కడే బందించి , అసలు ఈ పగలు ఎక్కడ, ఎందుకు మొదలు అయ్యాయో తెలుసుకోవాలని విమానం ఎక్కి నేరుగా తెలంగాణ లో దిగుతాడు .
ఆలా రోడ్ పైన వెళుతుంటే , హీరోయిన్ అనుకోకుండా అక్కడికి వస్తుంది .
హీరోని చూసి లవ్ లో పడుతుంది ..
--------- ఇక్కడ సాంగ్-----------
ఆలా వారిద్దరూ మూవీ కి వెళుతుండగా ఒక ఎటాక్ జరుగుతుంది, ఎవరు చేసారు అని తెలుసుకుంటే, ఒక ఇంటర్నేషనల్ మాఫియా డోన్ తమ్ముడు హీరోయిన్ లవ్ ఒప్పుకోలేదు అని , ఇపుడు హీరోతో లవ్ ఉందని ఎటాక్ చేసాడని అతన్ని చంపుతాడు. తమ్ముడు అన్న అదే డాన్ గుర్రంపైన ఇటలీనుండి వచ్చి హీరో ని చంపేస్తా అని బెదిరిస్తాడు .
తరువాత ఒకరోజు హీరోకి ఒక ఫోన్ వస్తుంది , అదే డాన్ నుండి ..
నీవు ప్రధాని కూతురిని కిడ్నప్ చేస్తే నిన్ను వదిలేస్తా అంటాడు.. దానికి హీరో ఒప్పుకుంటాడు .
ప్రధాని కామన్వెల్త్ మీటింగ్స్ అని వైజాగ్ వస్తాడు కూతురుతోపాటు.
అక్కడ కూతురిని లైన్ వేస్తె పడిపోతుంది . ఆమెని కిడ్నప్ చేసి మలేషియా తీసుకెళ్లి దాచిపెడతాడు .
FBI ,RAW , CBI అందరు కలిసి హీరో కోసం వేట సాగిస్తారు . ఏసమయం లో నే , ప్రధాని కూతురు హీరో తో నన్ను ఎందుకు కిడ్నప్ చేసావ్ అంటే .. ఒకపుడు మీనాన్న , మా నాన్న నాన్నని చంపేసి రాజయికీయాల్లో ఎదిగి ప్రధాని అయ్యాడు . అందుకే మీ నాన్నని చంపితే నా పగ చల్లారుతుందని చెప్తాడు.
------- సాంగ్ 2---------
హీరో ప్రపంచం మొత్తమ్ ఫేమస్ అవుతాడు . ఆ ఫోటో చూసి చందమామ పైన ఉండే హీరో తండ్రి , హీరో కి కాల్ చేసి నిజం చెప్తాడు .
అసలు చంపింది ప్రధాని కాదని , వేరే వాడు కర్నూల్ లో ఉన్నాడని చెప్తే , నేరుగా మలేషియా నుండి హీరో వచ్చేటప్పుడు మొదటి హీరోయిన్ హైదరాబాద్ కలిస్తే ------- సాంగ్ 3---------
తరువాత హీరో కర్నూల్ ఎద్దుల బండి పైన వెళ్లి నేరుగా ఫ్యాక్షనిస్ట్ తో ఢీకొని అతడిని చూపిస్తాడు ..
కథ ఇక్కడితో అయిపోలేదు ..
వచ్చేబాగం నెక్స్ట్ పోస్ట్ లో
0 Comments