శ్రీ సిద్ధి వినాయక దేవాలయం - గణేష్ గడ్డ 🙏
శ్రీ సిద్ధి వినాయక దేవాలయం రుద్రారం గ్రామం, సంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ ముంబై హైవే లో ఉంది . తోషిబా ఎలక్ట్రికల్ కంపెనీ దగ్గర.
పటాన్‌చెరు నుండి 14km దూరం లో ఉంది.
కోరికలు నెరవేరడానికి భక్తులు 11ప్రదక్షిణాలు చేసి, ఆ కోరికలు నెరవేరక 108 ప్రదిక్షణలు చేస్తారు.
.
శనివారం, పర్వదినాలలో రద్దీగా ఉంటుంది.
👉 ఆలయ చరిత్ర: ప్రాచుర్యంలో ఉన్న కథ.
చాలా సంవత్సరాల క్రితం వినాయకుడి భక్తుడు కాలినడకన తిరుపతి వెళ్ళేవాడు. ఇలా ప్రతియేడు వెళ్ళేవాడు. ఒక సంవత్సరం ఆలా తిరుమలకి వెళుతుండగా చీకటి పడే వేళకి , రుద్రారం ఊరిని చేరుకున్నాడు. అపుడు ఆ గ్రామం అంతా ఒక అడవిలాగా ఉండేది. జనాలు తక్కువగా ఉండేవారు . అక్కడి గుడి లో నిద్రపోయాడు. స్వామి కలలో కనిపించి , నేను ఇక్కడే కొలువై ఉన్నాను, నన్ను ఇక్కడ ప్రతిష్ఠించు అని కలలో చెప్పాడని, అపుడు ఆ భక్తుడు , ఆ ఊరి జనాలకి చెప్పాడా, వారు ఏంటో ఆనందంగా స్వామి కోరిక మేరకు గుడిని నిర్మించాడని ప్రతీతి.
స్వామి కోరిక మేరకు సిందూర రూపంలో వెలశాడని భక్తుల నమ్మకం. తరువాత ఆ భక్తుడు తిరుపతి కి వెళ్ళిపోయాడు.
శ్రీ శివరామ భట్టు ఆవిష్కరించిన మూర్తి మరుగున పడింది. మఖం దాస్ అనే భక్తుడు గుర్రంపై స్వారీ చేస్తున్నప్పుడు, ఆ గుర్రం ముందుకు వెళ్లడం మానేసినప్పుడు, మఖం దాస్ ఈ ప్రాంతంలోనే ఉన్నాడు మరియు గణపతిదేవుడు తాను ఆలయాన్ని నిర్మించాలనుకుంటున్నట్లు తన సన్నిధికి తెలియజేశాడు. స్వామివారి ఆజ్ఞను అనుసరించి స్వామివారికి ఆలయాన్ని నిర్మించాడు.
తరువాత కాలక్రమేణా, ఎవరు పట్టించుకోక పోవడంతో గుడి శిథిలావస్థకు చేరుకుంది. తరువాత భక్తులు రావడం వాళ్ళ, వారి కోరిన కోరికలు నెరవేరడం తో స్వామి వైభవం వచ్చింది.
గర్భగుడిలో స్వామి సిందూర వర్ణం లో ఉంటాడు.
సిందూర వర్ణం రూపం మనం ఉత్తరభారత దేశం లో ఎక్కువగా చూడొచ్చు. దక్షిణభారతదేశం లో ఎక్కువగా నలుపు వర్ణం ఉంటాడు.
గణేష్ దగ్గ ఆలయం దర్శనంతో సకల పాపాలు పోతాయని నమ్మకం, కారణం స్వామి సిందూర వర్ణం కలిగివుండటం.
ప్రతి ఏడు స్వామి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి వినాయక చవితి నాడు.
వివిధ ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు ఈ ఉత్సవాలకు విచ్చేసి గణేష్ ఆశీస్సులు పొందుతారు మరియు హోమాలు కూడా నిర్వహిస్తారు.
ఈ ఆలయప్రాగణం లో దేవీమాత, సుబ్రమణ్యస్వామి, కొలువై ఉన్నారు .
పులిహోర, లడ్డు ప్రసాదం ఇస్తారు .
Temple outside - lot of parking
-- Temple Timing
Morning : 5.00 AM -12PM
Evening 4 PM to 8 PM
Accommodation
Rudram village or patancheru or hyderabad
Map
https://www.google.co.in/maps/place/Ganesh+Gadda+Temple/@17.5738005,78.1542301,15z/data=!4m2!3m1!1s0x0:0xefa467361338619c?ved=2ahUKEwit8rv3v_7eAhXJpo8KHVQoDVAQ_BIwFnoECAYQCA
0 Comments