మానసిక సమస్యలు

మానసిక సమస్యలు

 ఈ మధ్య చాలా ఎక్కువ మందిలో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అధ్యయనం ప్రకారం ప్రపంచం లో ప్రతి నలుగురు లో ఒకరు మానసిక వ్యాధి తో బాధపడుతున్నారు. మానసిక ఆరోగ్యానికి డాన్ బానోస్ అనే మానసిక ఆరోగ్య ఆధునిక పరిశోధకుడు ఈ 8 సూత్రాలు ప్రతిపాదించాడు

1. పోషకాహారం (Nutrition)
2. వ్యాయాయం (Exercises)
3. నీళ్ళు (Water)
4. సూర్య రశ్మి (Sunshine)
5. నిగ్రహ శక్తి (Temperance)
6. గాలి (Air)
7. విశ్రాంతి (Rest)
8. నమ్మకం (Trust)
1. పోషకాహారం (Nutrition)
అన్ని కాయకూరలు సమపాళ్ళలో తినాలి. విటమిన్స్, ప్రోటీన్స్ ఉండే ఆహారం, ఫ్రూట్స్, ఆకుకూరలు అన్నీ తినాలి. బిర్యాని నచ్చుతుంది అని అదే తింటుంటే శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందవు. అలా అని ఎవరో పాలకూర తింటే మంచిది అన్నారు అని యూరిక్ యాసిడ్ లెవల్స్ మనకి ఎక్కువ ఉన్నప్పుడు అది తింటే సమస్య పెరుగుతుంది.
మన శరీరం అంటే కెమికల్స్, అణువులు, పరమాణువుల సముదాయం. అన్నీ సమపాళ్ళలో ఉంచుకునేలా పోషకాహారం తినాలి మన శరీర అవసరాలకి & హెల్థ్ ప్రొఫైల్ కి తగినట్లు.
ఏదో ఒక విటమిన్ తక్కువ అయినా, ఏదో ఒక పోషకం మరీ తక్కువ అయినా బద్దకం పెరుగుతుంది, ఏదీ చేయాలి అనిపించదు. అందుకే శరీరం లో జీవక్రియలు సక్రమం గా జరగాలంటే పోషకాహారం ప్రధానమైనది.
2. వ్యాయాయం (Exercises): వ్యాయామం చేయటం వలన న్యూరో ట్రాన్స్ మిటర్స్ - డోఫమైన్, సెరటోనిన్, మంచి కెమికల్స్ రిలీజ్ అయ్యి చాలా ఆనందం గా, సంతోషంగా ఉంటారు.
రోజుకి కనీసం 45 నిమిషాల నడక చాలా మేలు చేస్తుంది.
3. నీళ్ళు (water):
మన శరీరం లో 70% వాటర్ తోనే ఉంటుంది. అన్నీటికి మించి 80% మెదడు నీళ్ళకి సంబంధించిన కాంపోనెంట్స్ తోనే నిర్మితమై ఉంటుంది. అందుకే సరిపోను నీళ్ళు తాగాలి.
ఇంకా మెదడు కు కావాల్సిన ట్రిప్టోఫాన్ ని సరఫరా చేసేది నీళ్ళే; అందుకే తెలివితేటలకి ప్రధాన కారణాల్లో ఒకటి నీళ్ళు కూడా (సరిపోను నీళ్ళు తాగని వారికి మానసిక రోగాలు వస్తై). సెరటోనిన్ రిలీజ్ అయ్యి శరీరాన్ని సమతుల్యం గా ఉంచుతుంది.
మంచినీళ్ళు ఎక్కువ తాగని వారికి క్లారిటీ తక్కువ, సంతోషం తక్కువ.
4. సూర్య రశ్మి (Sunshine)
ప్రధానం గా వ్యాధినిరోధక శక్తి కి మూలకారణమైన విటమిన్ డి సూర్యరశ్మి నుంచే వస్తుంది.ఎక్కువ ఎండలో ఉన్నవాళ్ళకి నిద్ర ఈజీ గా పడుతుంది.సూర్య రశ్మి పెయిన్స్ ని బాధని తగ్గిస్తుంది.
5. నిగ్రహ శక్తి (Temperance)
ఆల్కహాల్, స్మోకింగ్, డ్రగ్స్ కి దూరం గా ఉండటం మంచిది. మోతాదు మించితే మానసిక రోగాలు వస్తై.
ఆలోచనల్లో కూడా ప్రధానం గా నిగ్రహం ఉండాలి. మనకి తెలిసిందే నిజం, మనమే కరక్ట్ అని కొంతమంది వాదిస్తుంటారు. కారణం మానసిక రోగం. చాలామంది డాక్టర్స్ లో కూడా ఈ మానసిక రోగం ఉండటం నేను గమనించాను. ప్రతిదానికీ అల్లోపతినే కరక్ట్ , అల్లొపతి సైన్స్ ని మించింది లేదు అని అనటం తో ఆపకుండా కరివేపాకు ఎందుకు, తాళింపు లో ఆవాలు ఎందుకు, జిలకర ఎందుకు అని కొందరు అనటానికి ఈ మానసిక రోగమే కారణం.
కొంతమంది - వాళ్ళకి తెలిసిందే నిజం, వాళ్ళే తెలివికలవారు అనుకోటానికి కారణం మానసిక రోగం. దురద్రుష్టవ శాత్తూ, ఆ మానసిక రోగం ఉంది అని వాళ్ళకి తెలియక చిన రాయుడు లా బిహేవ్ చేస్తూ ఉంటారు.
6. గాలి (Air)
ఇళ్ళు చిన్నది, ప్రక్రుతి పెద్దది. ప్రక్రుతి ఉన్నదే మనం ఎక్కువ సమయం బయట గడపటానికి. కనీసం 30 నిమిషాలు అయినా బయట వాతావరణం లో బతికేవారికి సమతుల్య మానసిక ఆరోగ్యం ఉంటుంది. ఆ సమయం తగ్గితే మానసిక రోగం ఉన్నట్లే
7. విశ్రాంతి (Rest)
కొత్త కార్ అయినా 4 గంటలు నడపగానే విశ్రాంతి తీసుకోమ్మని వార్నింగ్ ఇస్తుంది. టాటా నెక్సాన్ లో అయితే 2 గంటల 30 నిమిషాలకే బ్రేక్ తీసుకొమని చెప్తుంది.
మరి మన శరీరానికి..? తగిన విశ్రాంతి అవసరం. విశ్రాంతి లేకుండా పని చేసే వారికి మానసిక రోగం ఉన్నట్లే.
8. నమ్మకం (Trust):
నమ్మకమైన స్నేహితులు, కుటుంభ సభ్యులు, చుట్టుపక్కల మంచి వాతావరణం ఉన్న వారికి సరైన మానసిక ఆరోగ్యం ఉంటుంది.
* మానసిక రోగం అంటే మన బ్రెయిన్ లో ఉన్న కెమికల్స్ కొంచెం తగ్గటమే

Post a Comment

0 Comments

Advertisement