తెలివైనోళ్లందరూ అమ్రికా లోనే వుంటారు . అబ్బబబ .. అమెరికా వోల్ల తెలివి తేటలు .. నో భూతం .. నో భవిషత్ ..
వాళ్లకు వచ్చే అవిడియాస్ మామూలుగా వుండవు . వాళ్ళ కొత్త అవిడియాస్ వింటుంటే మనకు సిగ్గు వెయ్యాల్సిందే . మందీ ఒకే మానవ జన్మేనా అని సిగ్గుపడాలసిందే ....
ఆడ , మగ.. నపుంసకులు .. ఇది కదా లింగాల గురించి మనం ఇన్నాళ్లు అనుకొన్నది.
ఇదంతా ట్రాష్. మొత్తం 87 లింగాలు ఉన్నాయని అమ్రికా మారాజులు కనిపెట్టేశారని గత పోస్ట్ లలో చెప్పాను కదా .
అమ్రికా మేధావులు కనిపెట్టిన ఇంకో సరి కొత్త విషయం.
మీకు నాకు ఇప్పటిదాకా ఒకే రకమయిన స్కూల్స్ గురించి మాత్రమే తెలుసు .
అదేనండి మన అజ్ఞానం .
మనం ఇంకా ఆటవిక యుగంలో వున్నామాయె.
కృత్రిమ మేధ యుగంలో అమ్రికన్లు లు కొత్త రకం స్కూల్స్ కనిపెట్టేసారు . మైక్రో స్కూల్స్ ... హోమ్ స్కూల్స్... ఇలా ఇంకా కొన్ని ఉన్నాయి.
ఎందిరా ! ఎందిరా అమెరికా అయ్యా ! ఏందిది ? హోమ్ స్కూలా ? ఏమి తెలివిరా నా తెల్ల తోలు రాజా ? పట్టపగలు .. మిట్ట మద్యాహ్నం పిల్లాడు ఇంట్లో ఉండే స్కూలా? దున్నపోతా ? పిల్లాడు ఇంట్లోనే ఉంటే వాడికి సామజిక తెలివితేటలు ఎడ్నించి వస్తయిరా ? వాడు రేప్పొద్దున పెళ్ళాంతో అయినా కాపురం చెయ్యగలుగుతాడా ? ఇదేమి తేలితేటలురా నా జులపాల రాజా !
సూర్యకాంతమ్మ :
ఏడ్చావులే .. తింగరచచ్చినోడా ! చదవేస్తే ఉన్న మతి పోయిందంట ! ఇంట్లో పెరిగిన కుక్క ను వీధిలో వదిలేస్తే బతుకుతుందా ? పిల్లాడిని ఇంట్లోనే ఉంచి చదివిస్తే రేపు వాడు సమాజం లో ఎలా బతుకుతాడురా ? అమెరికా లో దిబ్బరొట్లు తినీ తినీ ఇట్లా అయిపోయారురా ! కూసిన్ని నువ్వుల లడ్లు పంపుతా . తిని చావండి . చావు తెలివి తేటలు చూపకండి .
తమరి శ్రాద్ధం .. పిండా కూడు . బలిసిన దున్నపోతు కు ప్యాంటు తొడిగినట్టు . ఆహా ఏమి ఫేసులురా... మీ పిండం పిల్లలకు పెట్టా. హోమ్ స్కూల్ ఏంట్రా ? హోమ్ హోమే! స్కూల్ స్కూలే.! కక్కూసు డైనింగ్ టేబుల్ .. డైనింగ్ టేబుల్ టాయిలెట్ .. ఇలా ఉంటుందేంట్రా ? టాయిలెట్ లో కమోడ్ పైన కూర్చొని పిజ్జా లు తినే పేస్ లు చూడు . డైనింగ్ టేబుల్ పైన పెట్టిన టిష్యూ పేపర్ తో ముడ్డి తుడుచుకొని దానితోనే నోరు తుడుచుకొనే సన్నాసుల్లారా ! మళపత్రాష్టులార ! పోతారు రే .. పోతారు .. జూ లో పుట్టి పెరిగిన సింహం పిల్లను అడవిలో వదిలేస్తే వేటాడి బతకగలదా? రెండు రోజుల్లో కడుపు మాడి చచ్చి ఊరుకుంటుంది. స్కూల్ నేర్చేది కేవలం పుస్తకాల్లోని పాఠాలే కాదురా . నలుగురు పిలల్లతో కలిసి మెలగడం .. దీన్నుంచి.. ఏది మంచి? ఏది చెడు? అని గ్రహించడం .. దీన్నే సోషల్ ఇంటలిజెన్స్ అంటారు . ఇంట్లో కూర్చో పెట్టి చదివిస్తే... తమరి పిండా కూడు.... పిల్లాడు టార్జాన్ అయిపోడా! అశుద్ధ బక్షకా !
అబ్బబ .. ఏమి బిల్డ్ అప్ అన్నా.. బయ్యా జ్యూస్ లాంటోడిని తిరిగీ నిలబెట్టేందుకు ఇస్తున్న బిల్డ్ అప్ . మనోళ్లది అసలే బట్టి చదువులు . బుర్రలో మొత్తం బంక మట్టి . స్కూల్ అంటే అర్థం కూడా తెలియదా ?
0 Comments