1 . ఆ సినిమాకు తమ పేరు పెట్టినందుకు పాపం .. మూగ జీవులు .. జంతువులు బాధపడుతున్నాయట .. అలాంటి సినిమాని మానవ మృగాలు చూసి ... ఆనందించి... సూపర్ హిట్ చేసి, మరిన్ని భయంకరమయిన సినిమాలు .. వాటి ప్రేరణ తో హింస , అకృత్యాలు మరింతగా పెచ్చరిల్లే ప్రమాదమున్న సమాజంలో ..
2 . పిల్లలని బడికి పంపాల్సిన అవసరం లేదు . అమ్మ నాన్న ఇంట్లో వర్క్ ఫ్రొం హోమ్ చేస్తారు కనుక పిల్లలకు హోమ్ స్కూలింగ్ ఉంటే సరిపోతుంది అని ... నిండా మునిగిపోతున్న ఎడ్ టెక్ కంపెనీలు ఎలాగైనా కొంత బిజినెస్ చేసుకోవాలి అనే ఆలోచనతో స్పాన్సర్ చేసి వదులుతున్న వీడియోలను నిజమని నమ్మే అమాయక తల్లితండ్రులు ఉన్న లోకం లో ..
౩. పిజ్జా లు బర్గర్ లు పొటాటో చిప్స్ లాంటి జంక్ ఫుడ్ , ఇంకా జన్యు మార్పడి పంటలయిన అమెరికన్ స్వీట్ కార్న్ , సొయా లాంటి వాటిని తెగ తిని అమ్మాయిలు పదేళ్లకే రజస్వల లైతే పదమూడేళ్లకే థైరాయిడ్ పీసీఓడీ లాంటి వ్యాధులబారిన పడితే .. తమ నేరం ఎక్కడ బయటపడుతుందో అని జంక్ ఫుడ్ మల్టీ నేషనల్ కంపెనీ లు తప్పు పాలపై నెడుతూ వీడియో లు పెడితే నిజం అని నమ్మే అమాయకులు ఉన్న లోకం లో { పాలు స్వచ్ఛం అనడం లేదు . నేడు లభ్యం అవుతున్న పాలతో కొన్ని సమస్యలు ఉన్నమాట నిజమే .. కానీ పాలవల్లే అమ్మాయిలు పాలపళ్ళు ఊదడానికి ముందే రజస్వలలు అవుతున్నారు అనేది దొంగ .. వేరొకరిని చూపించి దొంగ దొంగ అని అరవడం } .
4 . అమ్మాయిలకు అబ్బాయిలకు ఒకే రకం యూనిఫామ్ పెట్టి మన దేశం లోని కొన్ని ఇంటర్నేషనల్ పాఠశాలలు అమెరికా లో జరుగుతున్న లింగ తికమక { పురుషులు పురుషులు కాదు.. స్రీలు స్రీలు కాదు .. అంతా పెద్దల చాదస్తం .. కాలం చెల్లిన భావన .. అమ్మాయిలు అబ్బాయిలుగా మారొచ్చు .. అబ్బాయిలు మరోలా మారొచ్చు .. హాపీ గా లింగాన్ని మార్చుకోండి .. హార్మోన్ థెరపీ చేసుకోండి అనే మెడికల్ మాఫియా ప్రచారానికి పాఠశాలలను వేదికగా చేసుకోవడం }... ఇక్కడ కూడా ప్రారంభిస్తే ఇది సమస్యే కాదు అనుకొనే అమాయకులు ఉన్న లోకం లో ..
5 . తరతరాల నాగరికతను .. సభ్యసమాజ పునాదులను వెబ్సెరీస్ , ఓటీపీ యూట్యూబ్ అన్నిటికీ మించి చేతిలో సెల్ ఫోన్ రెండేళ్లలో ధ్వంసం చేసినా ఇదో సమస్యే కాదు అనుకొనే జనాలున్న లోకంలో ..
6 . గంజాయికి మంచే చేసే గుణం ఉందని తులసి మొక్క స్థానంలో ప్రతి పెరట్లో గంజాయి పెంచుకొనే రోజులో ఎంతో దూరం లో లేని సమాజం లో ..
7 . కొడుకులు అల్లుళ్లను... కూతుళ్లు కోడళ్లను తెచ్చే రోజులు .. పెళ్ళెందుకు ? కలిసి కాపురం చేస్తే పోతుంది .. కావలసినప్పుడు విడి పోవచ్చు .. ఇదే నాగరికత .. పెళ్లి .. కుటుంబం అంతా ట్రాష్ అని చర్చలు పెట్టి జనాల ను బ్రెయిన్వాష్ చేస్తున్న లోకంలో ..
బతుకుతున్న మనం !
కనీసం బాధ్యతగా జనాల్లో అవగాహన తీసుకొనివద్దామా ?
సమాజాన్ని , మానవాళిని బతికించుకొందామా ?
ఇలాంటి రకరకాల మాఫియాల అకృత్యాలకు, ఆగడాలకు అడ్డుకట్ట వేసే సమయం ఇదే.
0 Comments