**జీవితం అంటే?**
మనం మన నిత్య జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటాము.. జీవిత ప్రయాణం సాఫీగా సాగడానికి కావలసిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం.. చదువు ఉద్యోగం సంసారం పిల్లలు బాధ్యతలు ఈ చక్రంలో మనం కొట్టుకొని పోతూ ఉంటాం...
కానీ మనలో ఉన్న మనసును తట్టి లేపితే మనకు కూడా తీరని కోరికలు ఉంటాయి.. కోరికలు అంటే చాలా పెద్ద పెద్దవి కాదు.. చిన్న చిన్నవి కూడా ఉంటాయి.. ఈ బిజీ లైఫ్ లో వాటి గురించి పట్టించుకునే అవసరం, సమయం మనకు ఉండదు... దాని నోరు నొక్కేసి ఉంటాం.. ఓసారి ప్రశాంతంగా రెండు రోజులు కూర్చుని నీ మనసుతో మీరు మాట్లాడుకోండి.. మీకు తీరని కోరిక ఏముందో మీకు తెలుస్తుంది...
అలా ఓ ముసలామెకు ఖద్రుంగ్ లా అనే లడక్
లో ఉండే హైయెస్ట్ ప్లేస్ కు బైక్లో వెళ్లాలని కోరిక ఉంటుంది.. యూట్యూబ్ అమ్మాయి తన ఫ్రెండ్ చేతిలో మోసపోయి లైఫ్ అంటే అందరూ తనని ఎక్స్ప్లైట్ చేస్తున్నారు అని అనుకుంటుంది.. దానికి ఆమె జీవిత గమనాన్ని మరలించుకోవాలని లడక్ వెళ్లాలని దాన్ని షూట్ చేయాలని అనుకుంటుంది..
మరో అమ్మాయి కి కొత్తగా పెళ్లి కుదిరింది. అయితే ఆమె భర్త గురించి ఆమెకు ఏమి తెలియలేదు . ముఖం చూసే పెళ్లి చేసుకోవాలా? వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదా? అని మానసిక సంఘర్షణ పడుతూ ఉంటుంది అప్పుడు ఓ గురువు ఆమెను బైక్ లో అక్కడికి రమ్మంటాడు.. ఆ జర్నీలో ఆమె ఏం తెలుసుకుంటుంది అనేది సినిమాలో పాయింట్.. వారితోపాటు ఓ మహిళా బైక్ మెకానిక్ వెళుతుంది ఆమె పెళ్లి అయినా కానీ జీవితంలో ఎప్పుడు వండుకుంటూ ఉండడమే తప్పితే పిల్లలను బాగా చదివించాలని కలలు కంటూ ఉంటుంది.. కానీ భర్త అంతకు సహకరించడు.. పాపకు లాప్టాప్ కొనించడం కోసం ఈ ట్రిప్పుకు ఒప్పుకుంటుంది..
ఇలా నలుగురు తమ బైకుల మీద అన్ని వందల కిలోమీటర్లు అదికాక మహిళలు ఒంటరిగా ఎలా వెళ్తారు అనేది ఈ సినిమా లో పాయింట్.. మహిళలు ఒంటరిగా వెళ్లలేరు వాళ్లకు చాలా కష్టాలు వస్తాయి అని అనుకుంటాము.. కానీ అందరూ మగవాళ్ళు అలా ఉండరు.. వాళ్లకు ఓ లారీ డ్రైవరు మరియు ఓ ట్రెకింగ్ చేసే ఫారినర్ బాగా సహాయం చేస్తారు...
అలా బ్యాక్ ప్యాక్ వేసుకొని ఒంటరిగా ట్రావెలింగ్ చేసే మహిళలు తమ ట్రావెలింగ్ బ్లాగ్ లో చాలామంది రాస్తుంటారు.. దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమా తీశారేమో.. ముందు వచ్చిన జిందగీ మిలేగా నా దోబారే అనే సినిమా లాగా అనిపిస్తుంది.. కానీ చాలా సాదాసీదాగా సింపుల్ గా సినిమా సాగిపోతుంది...
ముఖ్యంగా మహిళలు తప్పకుండా చూడవలసిన సినిమా.. ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళలు అనుకుంటే ఏదైనా సాధించగలరు.. జీవిత ప్రయాణంలో అన్ని మనకు నేర్పిస్తుంది.. ట్రావెలింగ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అనేది ఈ సినిమాలో మహిళలు తెలుసుకుంటారు...
నెట్ ఫ్లిక్స్ లో ఉంది.. సినిమా పేరు... ధక్ ధక్ ...హిందీలో ఉంది..మహిళలు తప్పకుండా చూడగలరు..
0 Comments