కాస్ట్ మిధ్య- క్లాస్ సత్య

కాస్ట్ మిధ్య- క్లాస్ సత్య

 కాస్ట్ మిధ్య- క్లాస్ సత్య !

👇👇👇👇👇👇

తెలుగు సినిమా హీరోలు !
మొన్నటి- నిన్నటి - నేటి తరం !
నటనలో నిష్ణాతులు !
ఎందరో మహానుభావులు .
అందరికీ వందనాలు !
సమాజం లో కులాలు !
ఒకప్పుడైతే కులానికి వృత్తికి లంకె ఉండేది .
ఆధునికత ఆ లంకె ను విడగొట్టేసింది .

❓❓కులానికి నటనకు , అభిమానానికి ఏమైనా లింక్ ఉందా ?
ఉండకూడదు. కదా ?
ఫలానా నటుడి నటన నచ్చితే అభిమానం ఏర్పడొచ్చు .
సహజం .
కానీ దానికి, కులానికి ఏమైనా సంభంధం ఉందా ?
అదేంటో చిత్రంగా తెలుగు నాట { ఆ మాటకొస్తే భారత దేశంలో } నటుడి కులానికి- అభిమానుల కులానికి ఫెవికాల్ బంధం .
నటుడి అభిమాన సంఘాల నాయకులు, అభిమానుల్లో సింహభాగం అతని కులస్తులే .

సినిమా రిలీజ్ రోజు కట్ అవుట్ కు దండేసి , పొట్టేలు కొట్టి , కర్పూర హారతి ఇచ్చి , థియేటర్ లో పూలు - పేపర్ లు చల్లి హంగామా చేసి , సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకొంటే "వామ్మో మా హీరో! అని జాలితో ఇంట్లో తల్లి కూలి నాలి చేసి సంపాదించిన డబ్బులతో వారం రోజులు టికెట్ లు తెగకొని హీరో ఇమేజ్ ని కాపాడే అభిమాన గణంలో సింహభాగం అతని కులం వారే .
తోటి మానవుడి పై పిచ్చ అభిమానం పెంచుకొని ఆరాధించడం ఒక మానసిక దౌర్బల్యం అయితే దానికి కుల పిచ్చి తోడవడం మహా మానసిక దౌర్బల్యం .
బహుశా ప్రపంచం లో... ఏ దేశం లో.. ఏ కాలం లో... జరగని దృగ్విషయం .
ఒక హీరో నటన గొప్పదై నప్పుడు అతని అభిమానాలల్లో అన్ని కులాల వారుండాలి .
కదా ?
ఉన్నారు!
నిజమే .
ఒకే కులం వారు చూస్తే ఏ సినిమా హిట్ కాదు .
కానీ మనం మాట్లాడుకొంటోంది సినిమా చూసేలా చేసే అభిమానం గురించి కాదు .
కట్ అవుట్ లు పెట్టడం... ఆడియో ఫంక్షన్ లు కు హాజరు కావడం.. ప్లాప్ సినిమా ల టికెట్ లు తీయడం లాంటి ... వ్యవస్థీకృత అభిమానం గురించి .

ఈ వ్యవస్థీకృత అభిమానానికి వెన్నెముక కులం అన్నది కాదనలేని సత్యం .
ఎవరు అవునన్నా కాదన్నా కులం వల్ల హీరో లు పొందిన లబ్ది అంతా ఇంతా కాదు.
కులం కారణంగా కొన్ని లక్షల మంది యువతీ యువకుల సేవలు హీరో లకు అయాచితంగా దొరుకుతాయి .
తప్పేముందండి?
తమ కులానికి చెందిన హీరో పాపులర్ అయితే సంతోషపడి సెలెబ్రేట్ చేసుకోవచ్చు కదా ? అని ఎవరైనా అడగొచ్చు .

గతం లో ఆ కులానికి చెందిన ఆయన లాభం పొందాడు .
అతని కులానికి చెందిన వారు అతనికి అభిమానదళంగా నిలిచారు .
మరి ఇప్పుడు చేస్తే తప్పేంటి? అనేది మరో ప్రశ్న .
ఒక తప్పు మరో తప్పుకు సమర్ధన అనే రీతిలో లోకం సాగుతోంది .
అమెరికా లో తుపాకీ కాల్పులు మరీ దారుణం అని పోస్ట్ పెడితే .. అక్కడ ఎందుకు ఎక్కువయినాయి? .. దానికి పరిష్కారం ఏమిటి? అని కదా ఆలోచించాల్సింది?
" ఇండియా లో లేదా" ? అని ఒక ప్రశ్న . అంటే అమెరికా లో జరుగుతోంది కాబట్టి ఇండియా లో జరిగినా ఫరవాలేదు. లేదా ఇండియా లో రోడ్ ఆక్సిడెంట్ ల లో మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి అమెరికా లో తుపాకీ కాల్పులు జరిగినా తప్పు లేదు అనేనా ?
నాకు ఒక కన్ను పోయినా ఫరవాలేదు . అవతలి వాడికి రెండు పొయ్యింది కదా అని తుత్తి.
అవతలి వాడు అడుక్కుంటున్నాడు కాబట్టి నేను ఆ పని చేస్తే తప్పులేదు అనే ఆలోచన !

కాలం మారిందా ? పిచ్చి ముదురుతోందా ?
👇👇👇👇👇👇👇👇
కులాలు ఒకప్పుడు ప్రకార్య సమూహాలు . అంటే ఒక్కో కులానికి ఒక్కో వృత్తి . సామజిక వ్యవస్థకు అది మూలం .
ఇప్పుడు ఆధునికత .
ఆధునిక వృతులకు కులానికి లింక్ ఉండదు .
కులం పై అభిమానం ఉండడం ఓకే .
ఏ కులం సమాజం లో ఒంటరిగా మనుగడ సాగించడం అసాధ్యం . నువ్వు ప్రొద్దున వాడిన బ్రష్.. టూత్ పేస్ట్.. మొదలు రాత్రి పడుకొనే బెడ్ వరకు .. నీ కులస్తులు తయారు చేసినవి ఎన్ని ?
రోజులో ఎంత సేపు నువ్వు ఇతర కులస్తులతో వ్యవహరిస్తావు ?
నిన్నటి రోజుల్లో అయితే చదువుకోని వారి సంఖ్య ఎక్కువ . ఇప్పుడు ఆధునికత విస్తరిస్తోంది !
ఇలాంటి స్థితి లో కులగజ్జి తగ్గాలి కదా ? మరెందుకు కరోనా రెండో వేవ్ లా ఇది రాను రాను ప్రబలుతోంది ?
కేవలం సినిమా రంగానికేనా ?

వామ్మో రాజకీయాలు.. అయితే మరీ దారుణం .
ఫలానా నాయకుడి కులం ఇది అనుకొంటే అతని అభిమానుల్లో సింహ భాగం ఆ కులం వారే .
నాయకుడి సిద్ధాంతాలు , పాలనా సామర్థ్యము గొప్పదైతే అభిమానులు అన్ని కులాల్లో ఉండాలి కదా ?
ఒక్క సారి ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫారం పైకి ఎక్కి కులగణన చేయండి .
నాయకుడి కోసం సోషల్ మీడియాఎక్కి... ఇంట్లో పెళ్ళాం పిల్లల తో గడిపే కాలం కంటే ... ఎక్కువ సమయం వెచ్చించి ... యుద్ధం చేసే యోధుల్లో తొంబై అయిదు శాతం అతని కులస్తులే .
నాయకుడి గొప్పతనాన్ని మిగతా కులస్తులు గుర్తించారా ?
నాయకుడి విధ్వంస విధానాలు అతని కులస్తులకు కనపడవా? ఇవతలి కులం వారికే కనిపిస్తాయా ?
తెలుగు నాట ఆధునిక కుల గతితార్కికత కేవలం సినిమా రంగానికో రాజకీయాలకు పరిమితం కాలేదు . విద్యా రంగం ఫార్మా , మీడియా .. ఇలా ఇందుగలడందు లేదని ఎక్కడ పెట్టుబడి ఉంటే అక్కడ కులాభిమానం ఒక కట్టని కోటలా పెద్ద వారికి అండగా నిలుస్తోంది .

కాస్ట్ సరే బ్రో ! మరి క్లాస్ ? ❓
👇👇👇👇👇👇
కులం ఒకటే .
కానీ ఒకాయనది అద్దె విమానం . { చార్టెడ్ ఫ్లైట్ } .
మరొకాయనది షేర్ ఆటో .
ఒకాయనది ఇంద్ర భవనం .
మరొకాయనది సింగల్ బెడ్ రూమ్ ఫ్లాట్ .
చెబితే కానీ కులం కనిపించదు .
చెప్పకపోయినా క్లాస్ కనిపిస్తుంది .
కులం పేరుతొ ఇంత లబ్ది పొందిన పొందుతున్న హీరో లు, నాయకులు , పారిశ్రామిక వేత్తలు తిరిగి ఆ కులానికి ఎంత ఇచ్చారు ?
పుచ్చుకొనుట లో ఉన్న హాయి ఇచ్చుటలో లేదేమి ?

హైదరాబాద్ లో మార్వాడీ జైన్ లాంటి కులాల విద్యా సంస్థలు వున్నాయి . ఆయా కులాలకు చెంది ఉన్నత స్థానానికి ఎదిగిన వారు వీటికి సాయం చేస్తుంటారు . తమ కులానికి చెందిన మధ్య తరగతి వారు ఇక్కడ మంచి విద్య పొంది జీవితం లో పైకి రావాలనేది వీరి ఆశయం . కులం ఈ విధంగా నైనా సమాజం లో కొంత మంది ఎదుగుదలకు కారణం అయితే మంచిదే కదా ?
తెలుగు నాట హీరో లు రాజకీయ నాయకులు పారిశ్రామిక వేత్తలు తమ కులానికి చెందిన మధ్య తరగతి వారి కోసం స్థాపించిన తక్కువ ఫీజు విద్యా సంస్థలు ఎన్ని ?
హాస్టల్స్ ఎన్ని ?
ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఎన్ని ?
స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాలు ఎన్ని ?
తక్కువ అద్దెతో వివాహం మొదలనవాటికి వేదికగా నిలిచే ఫంక్షన్ హాల్స్ ఎన్ని ?
కులాభిమానం తో ఎదిగిన పెద్దవారు .. అదే కులానికి చెందిన పేద ఇంటి అబ్బాయిని తమ ఇంటి అల్లుడుగా... అమ్మాయి ని కోడలుగా తీసుకొని రారు . ఎందుకో ??

అదేమీ విచిత్రమో . ఈ పెద్దింటి పిల్లలు ప్రేమ లో పడితే కులాన్ని పట్టించుకోరు .
అంత వరకు ఓకే .
కానీ క్లాస్ ను మరచిపోరు .
వైరి కులం వారైనా డబ్బుండాలి . స్టేటస్ ఉండాలి .
వాళ్ళింట్లో అన్నింటికి లెక్కలుంటాయి బ్రో !
వారికి తెలుసు .. కాస్ట్ మిధ్య . దాన్ని వాడుకొని వదిలెయ్యాల్సిందే అని .
రియాలిటీ మేటర్స్ .
అదే డబ్బు .
అదే క్లాస్ .
అందుకే చాల ప్రేమలు , పెళ్లిళ్లు , పెళ్ళిపిలుపులు ... అన్నీ డబ్బు .. అదే కాస్ట్ చుట్టూ తిరుగుతుంటాయి .
మర్మం తెలియని అమాయకులు .. చదువు సంధ్యలు ఇంటి పనులు మానుకొని తమ కుల హీరో లు నాయకులకు ఉచిత సేవలు చేసి జన్మ ధన్యం అయ్యిందనుకొని మురిసిపోతుంటారు . ఆధునిక స్వయం వెట్టి చాకిరి ఇది . చదవేస్తే ఉన్నమతి పోయిన వైనం .
కులం ..
డబ్బున్నోడు తెలివున్నోడు.. కోట గోడ ఎక్కి ఉన్నతి సాదించాడనికి వాడే తాడు .
తెలివి లేనోడు మధ్య తరగతి వాడు పిచ్చ అభిమానం తో ఉరేసుకొంటున్న తాడు !

credit goes to Amar sir

Post a Comment

0 Comments

Advertisement