Dangerous
పోయింది పొల్లు .. మిగిలింది చాలు !
2010 - 2024 మధ్య కాలం లో పుట్టిన పిల్లలను ఆల్ఫా తరం అని పిలుస్తారు .
ఈ పిల్లల్లో అధిక శాతానికి మొబైల్ పరికరాల { స్మార్ట్ ఫోన్ , ట్యాబు , లాప్ టాప్ లాంటివి } వ్యసనం ఉంది.
బేధాభిప్రాయాలు ఉన్నా కనీసం అరవై శాతం మంది తీవ్ర వ్యసనం బారిన పడ్డారు అనేది ఎక్కువ సర్వే లు చెబుతున్న నిజం . { 2022 - 2024 మధ్య పుట్టిన పిల్లలను సర్వే చేయలేదు }.
ఏకాగ్రత లోపం , నిద్ర లేమి , ఒత్తిడి , మానసిక ఒంటరితనం , ఉద్రేకం , ప్రతీకారేచ్ఛ , శాడిజం , బుల్లియింగ్ ఇలా రకరకాల సమస్యలతో వీరు { వారి వారి వయసు బట్టి } బాధ పడుతున్నారు .
పది - పదమూడేళ్లకే మద్యపానం, డ్రగ్స్, వివాహపూర్వ లైంగిక సబంధాలు, ప్రతీకార దాడులు లాంటివి అలవాటు చేసుకొంటున్నారు .
{ ఏంటండీ ఈయన? .. మనం చదివేస్తున్నామని ఏదో రాసేస్తాడు . మరీ పదేళ్లకు సెక్స్ ఆలోచలను ఏంటి అనుకొంటున్నారా ?
" సార్ .. మా అపార్ట్మెంట్ లో పదేళ్ల అబ్బాయి... ఒకటో తరగతి లోని మా పిల్లాడికి పోర్న్ అలవాటు చేసాడు . మేము ఎంత ప్రయత్నించినా వాడు మానడం లేదు" .. అని నిన్నంటే నిన్న ఒకాయన మెసెంజర్ లో మెసేజ్ చేసాడు .
ఒకటో తరగతి పిల్లలు స్త్రీ పురుష అంగాల బొమ్మలు నోట్ పై గీయడం .. లవ్... సెక్స్ .. ఫక్ అని రాయడం జరుగుతోంది. ఏ స్కూల్ లో అంటారా ? హలో మాస్టారూ .. అడగాల్సిన ప్రశ్న అది కాదండీ. ఏ స్కూల్ లో జరగడం లేదు అని అడగాలి }
ఇటీవల కాలం లో అంతర్జాతీయ స్థాయిలో ఆల్ఫా జనరేషన్ పై అనేక వార్త విశ్లేషణలు వెలువడ్డాయి . ఈ ఆల్ఫా తరం నాశనం అయిపొయింది అనేది ఈ విశ్లేషణల సారం .
పాము తన పిల్లలని తింటుంది అనేది బాగా ప్రచారం లో ఉన్న ఒక నమ్మకం . కానీ ఇది వాస్తవం కాదు . కానీ ఆధునిక మానవుడి సంగతి వేరు .
మొబైల్ ఫోన్స్ తయారీ -అమ్మకం నేడు కోటి కోట్ల ప్రరిశ్రమ .
18 - 20 లోపు పిల్లలు మొబైల్ వాడకూడదని నిషేధం విధిస్తే మొబైల్ ఫోన్ అమ్మకాలు సగానికి సగం తగ్గిపోతాయి .
ఇంతే కాదు... మొబైల్ డేటా వాడకం మొదలు వీడియో గేమ్స్ , సోషల్ మీడియా సైట్స్ , నీలి చిత్రాలు , రీల్స్ , ఇలా సర్వం ఇరవై ఏళ్ళ లోపు పిల్లల పై ఆధార పడింది .
వారు లేక పొతే సర్వం కొలాప్స్ .
కాబట్టి పిల్లి మెడలో ఎవరూ గంట కట్టరు.
మీడియా కు వచ్చే ప్రకటనల్లో సింహభాగం మొబైల్ ఫోన్ ఇంకా ఇంటర్నెట్ ఆధార వ్యాపారాలవే . కాబట్టి మీడియా కూడా సమస్య ను పెద్దగా ఎత్తి చూపదు . ఎక్కడో ఆరో పేజీ లో సింగల్ కాలమ్ వార్తగా ప్రచురిస్తారు .
ఉమ్మడి కుటుంబాలు లేవు .. చాలా కుటుంబాల్లో అమ్మ నాన్న ఇద్దరూ ... పనికి వెళ్లాల్సిన స్థితి . ఒక వేళా ఒకరు ఇంట్లో ఉన్నా వారు చేలో పడి మేసే ఆవు టైపు .
అది పెద్ద సెల్ ఫోన్ స్మార్ట్ టీవీ వ్యసనపరులు వీరే .
వృద్ధ తరం వాట్సాప్ గ్రూప్స్ లో... పొద్దున్న షేర్ చాట్ శుభ సోమ మంగళ బుధ గుర శుక్ర శని అది వారాల గ్రీటింగ్స్ తో మొదలెట్టి .. " మా వాడు డల్లాస్ లో .. మా అమ్మాయి న్యూ జెర్సీ లో .. అబ్బో .. అక్కడ టాయిలెట్ లు అద్దాల మేడలా ఉంటాయి . అక్కడే పడుకొని నిద్ర పోవచ్చు . ఏముంది ఇండియా లో .. అంతా చెత్త" .. అని బిల్డ్ అప్ .. దానికి పైన... ఇంకో బిల్డ్ అప్ తో ... రోజంతా టైం పాస్ చేస్తూంటారు. ఇక ఆల్ఫా జనరేషన్ కు చెప్పేది ఎవరు ?}
మానసిక వైద్యశాలలకు , బాలల ఆసుపత్రులకు ఫార్మా కంపెనీ లకు పిల్లల మొబైల్ వ్యసనం ... బంగారు గుడ్లు పెట్టే బాతు అయ్యింది . ఆంటీ డిప్రెసెంట్స్ , ఆంటీ సైకటెంట్స్ , సైకో స్టిములంట్స్ అమ్మకాలు ఇబ్బుడి ముబ్బిడిగా పెరిగిపోతున్నాయి సమస్య ఉంటేనే వారికి వ్యాపారం . ఇంకా ఎంత ముదిరితే అంత లాభాలు .
ఇది కాకుండా డ్రగ్స్ వ్యాపారం , వాయ్యో హోటళ్లు .. పబ్బులు .. ఇంకా అనేకానేక గబ్బులు ... కొండ వీటి చేంతాడు.
జెడ్ తరం ... అంటే 2000 - 2010 మధ్యలో పుట్టిన వారితోనే ఇంత బుసినెస్ నడుస్తుంటే ఇక ఆల్ఫా తరం కాస్త ముదిరితే ? గల్లీ గల్లీ లో గంజాయి దుకాణం .. ప్రతి సందు చివర వాయ్యో హోటల్ ...
రాజకీయ నాయకులు జనాల బలహీనత పై బిజినెస్ చేసుకొనేవారు.
వారే సమస్య .
వారు సమస్యను పరిష్కారిస్తారు అనుకోవడం అమాయకత్వానికి కేర్ అఫ్ అడ్రెస్స్ .
సమస్యకు మరో కోణం .
ఇప్పుడు పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి . ఇది అధికారిక కాపీ రాత పరీక్ష . నిజాయతీగా పరీక్ష నిర్వహిస్తే ఉతీర్ణత శాతం ముప్పై దాటదు.
ఇప్పుడు నూటికి తొంబై అయిదు శాతం పాఠశాలల్లో పిల్లలు పాఠాలు వినరు . ఒక చోట ఓపికగా కూర్చునే అలవాటు అధిక శాతం పిల్లలకు లేదు .
వినరు . విన్నా అర్థం చేసుకొనే శక్తి లేదు .
ఫీజు వసూలు చెయ్యాలి కాబట్టి ప్రైవేట్ పాఠశాలలు... జీతాలు రావాలి కాబట్టి ప్రభుత్వ పాఠశాలలు ఏదో తూతూమంత్రంగా లాగిస్తున్నారు . పిల్లలు వింటే కదా టీచర్ పాఠం చెప్పేది ?
పదో తరగతి ఇంటర్ లాంటి అకడెమిక్ పరీక్షల్లో అయితే కాపీ మంత్రం నడుస్తుంది . కానీ మెడికల్ ఇంజనీరింగ్ లాంటి ఎంట్రన్స్ లు ?
{ ఇంజనీరింగ్ ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ పెట్టి అమెరికా కు వెళ్లిపోతున్నారు . అది వేరే సంగతి }
సెల్ ఫోన్ వ్యసనానికి లోను కాకుండా మీ పిల్లలని పెంచుతున్నారా? అయితే మీ ఇంట్లో బంగారు గని ఉన్నట్టే.
చుట్టూరా తొంబై శాతం... డ్రగ్స్ ... ఫ్రీ సెక్స్... లివ్ ఇన్... బ్రేక్ అప్ .. హింస.. హత్య ఆత్మ హత్య మార్గాల్లో నడుస్తుంటే .. వీరికి వారి వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మాట వాస్తవం . కానీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకొంటే కృత్రిమ మేధ యుగం లో సెల్ ఫోన్ కాటుకి గురికాని మీ పిల్లలే రాజులూ రాణులు .. ఉన్నత ఉద్యోగాలు పెద్ద వ్యాపారాలు వారివే .
లోకం నిద్ర లేయడానికి... వాస్తవాలు గ్రహించడానికి ఇంకా చాలా కాలం పడుతుంది .
నిజమే అందరూ బాగుండాలి . అందులో మనం ఉండాలి .
కానీ వారిస్తున్నా చాల మంది సుడిగుండం లో దిగితుంటే ?
" పోనీరా ... పోనీరా... పొతే పోనీరా.. పాడుకోవడం తప్ప ఏమి చేయగలం ?
రంగులు లేని... టీవీ .. పత్రికల రోజుల్లో నిజాలు ఇంటి తలుపు తట్టి వచ్చేవి .
రంగులు పులుముకున్న నేటి మీడియా... చెప్పినా... చెప్పకున్నా... నిజం తెలుసుకో
ఈ లోకం మాయరంగుల వలయం నుంచి నీ కుటుంబాన్ని కాపాడుకో ..
కలలెప్పుడూ వైట్ అండ్ బ్లాక్ లోనే వస్తాయి .
రంగుల కలలు చూపుతున్న మొబైల్ పరికరాలు వ్యసనం నుంచి నీ ఇంటి బిడ్డను రక్షించుకో ...
0 Comments