సనాతన ధర్మం లో చెడు - ఆధునికం లో మంచి

సనాతన ధర్మం లో చెడు - ఆధునికం లో మంచి

 


సనాతన ధర్మం లో చెడు ఉంటే సరిదిద్దుకోవాలి, ఆధునికం లో ఒకవేళ మంచి ఉంటే తీసుకోవాలి.

సనాతనధర్మం అంటే ఒక విషయాన్ని గుడ్డిగా నమ్మమని కాదు. సనాతనం లో అలాంటి సంస్క్రుతి లేదు. సనాతన ధర్మం ప్రకారం ఒక విషయాన్ని చెప్తే అది ఎందుకు అని ప్రశ్నలు లేవనెత్తించాలి. లోతుగా ప్రశ్నించటం, గాఢం గా జీవించటమే సనాతన ధర్మం.
పసుపు ఎందుకు, అల్లం ఎందుకు, యోగా ఎందుకు అనే పిచ్చి ప్రశ్నలు ఆపి - మానసిక ఆరోగ్యానికి యోగా చేయాలి అని ప్రపంచం లో ఉన్న డాక్టర్స్ అందరూ ఇప్పుడిప్పిడే అంగీకరిస్తున్నారు, సనాతన ధర్మం లో యోగా ఎప్పటి నుంచో ఉంది. అమెరికా, కెనడా లల్లో పసుపు టాబ్లెట్స్, అల్లం టాబ్లెట్స్ వాడుతున్నారు రా అయ్యా ఆరోగ్యానికి. సనాతన ధర్మం అంటే అల్లోపతి వైద్యం చేపించుకోవద్దు అని కాదు, అలాంటి అవసరం ఎక్కువ లేకుండా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించమని.
సనాతన ధర్మాన్ని పాటించే అర్జునుడే లక్ష ప్రశ్నలు అడిగాడు శ్రీ క్రుష్ణుడ్ని. సనాతన ధర్మం అంటే ప్రశ్నలు వేసుకోవటం, ప్రశ్నలు సంధించటం, సమాధానాలు రాబట్టటం - అంతే కానీ ఏదో ఒక విషయాన్ని గుడ్డిగా అనుసరించటం కాదు, ఒక విషయాన్ని రుద్దటం కాదు.
స్వర్గం, నరకం - ఎక్కువ తక్కువ - కట్టూ బొట్టూ కాదు సనాతనం అంటే, అలాంటి సిద్దాంతాలు పనికి రావు. సనాతన ధర్మం అంటే తర్కం . తర్కానికి నిలబడి జీవితాన్ని ఆచరణాత్మకం గా ఉండి ఉన్నతమైన జీవితానికి ఉపయోగపడేదే సనాతన ధర్మం.
ప్రాణాయామం, యోగా, అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే జీవన విధానమే సనాతన ధర్మం.
సనాతన ధర్మం అంటే శాశ్వతమైన జీవన విధానం - దాని అర్ధం ఎప్పటికీ అనుసరించదగిన జీవన విధానం. నీకు ఏది ఎప్పటికీ మంచి మార్గం అనిపిస్తే అది. నీకు లేవగానే చెట్ల మధ్యలో పక్షుల రాగాల మధ్యలో నడవటం ఎప్పటికీ సంతోషం ఇస్తుంది అనిపిస్తే అలానే చెయ్యి. ఒకవేళ జీవితాంతం జిం కి వెళ్తేనే మంచిది అనిపిస్తే జిం కే వెళ్లు. సూర్య నమస్కారం, ప్రాణాయామం చేస్తే శరీరానికి, మనస్సుకు మంచిగా అనిపిస్తుంది అంటే అలానే ఉండు. కెనడా లో నాకు ఉదయం లేవగానే నది దగ్గరికి వెళ్లి ఒక 15 సూర్య నమస్కారాలు చేసుకొని, ఒక 15 నిమిషాలు ప్రాణాయామం చేసుకొని ఒక 30 నిమిషాలు సైకిల్ తొక్కటం నాకు సనాతన ధర్మం. ఎవర్నీ ఎక్కువ అనుకోను, ఎవర్నీ తక్కువ అనుకోను. అసలు సనాతన ధర్మమే గొప్పది అనుకోకపోవటమే సనాతన ధర్మం. ఎవరికి తగినట్లు వాళ్లు మంచి జీవన విధానాన్ని పాటిస్తూ తర్క బద్దకం గా అన్నికాలాల్లో ఎప్పటికీ అనుసరించదగిన జీవన విధానమే సనాతన ధర్మం.

Post a Comment

0 Comments

Advertisement