చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది

చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది

 చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది

దాని జిమ్మదీయ..దాని జిమ్మదీయ..
అందమంతా చీరలోనే ఉన్నది
అని అక్కినేని అంతతోడే వాణిశ్రీ చీర చూసి బంగారు బాబులో పడిపోయాడు కదా
అంటే ఏంటన్నమాట ,
మామూలుగా అయితే నిన్ను చూడలేం
ఈ చెంగావి చీర కట్టటంతో నీ అందం పెరిగింది
అంచేత అందమంతా చీరలోనే ఉంది వాణిశ్రీ అని నొక్కి వక్కాణిస్తాడు అన్నమాట
అలా చీరకట్టులో ఉన్న అందం..సొగసుల గురించి కవి గారు ఎప్పుడో చెప్పేశారు
అసలా మాటకొస్తే అలనాటి సావిత్రి.. సౌందర్యలు
శ్రీదేవి..జయసుధ..జయప్రదలు చీరకట్టులో ఎంత అందంగా ఉండేవారనీ ,
ఆ రోజుల్లో హీరోయిన్లు కట్టే చీరలు చూట్టానికే పాటలు వచ్చేటప్పుడు కన్నార్పకుండా చూసేవాళ్ళు మహిళా మణులు
ఒక్క పాటకే ఓ పదిరవై చీరలు మార్చేవారు మరి
మా విజయవాడలో సినిమా శత దినోత్సవ సభలు గ్రాండ్ గా ఓపెన్ గ్రౌండ్లో నిర్వహించేవాళ్ళు
ఈ ఫంక్షన్ కి సినిమాలో వేసిన హీరోయిన్లతో పాటు తోటి హీరోయిన్లు కూడా చక్కగా చీరలు కట్టుకుని వచ్చేవాళ్ళు
ఎంత అందమనీ ,
ఆకాశంలో ఒక తార నాకోసమొచ్చింది ఈ వేళ అని పాడుకుని మురిసిపోయేవాళ్లం
వీళ్ళు నటించిన సినిమాలు చూడటంతోనే బాల్యం గడిచిపోయింది
ఆనాటి హీరోయిన్లు అలా ఓ పది పదిహేను ఏళ్ళు వెండి తెరను ఏకఛత్రాధిపత్యంగా ఏలారు
బాగా క్లోజ్ అవరేంటి మరి ?
ఇప్పుడో.. ముంబై నుంచి డౌన్ లోడ్ అవుతున్న స్వీట్ సిక్స్టీన్ లు ఒక్క సినిమాతో చర్మ సౌందర్యాన్ని ఇక్కడ ఆరేసి మాయమైపోతున్నారు
మనం ఆ చర్మ సౌందర్య రహస్యాన్ని సంతూర్ యాడ్లు చూసినట్టు చూసి ఇంకో యాడ్ వచ్చేవరకు కాలక్షేపం చేస్తున్నాం
రోజూ చెట్టుకు కాసిన మందార గులాబీ మరుమల్లెలను చూసిన కళ్ళతోనే ప్లాస్టిక్ పూలను చూస్తున్నాం
ఏమైనా ఆ చీరకట్టు ఉంది చూశారూ..
సంప్రదాయానికి సంప్రదాయం
అందానికి అందం
పాత స్టీల్ సామాన్ల వాడిలా ఇప్పుడీ చీరల గోల ఏంటంటారా?
అనంతు అంబానీ పెళ్ళికొచ్చిన కొంతమంది హీరోయిన్లకు బట్టలు బాహ క(బ)రువైనట్టున్నాయ్
దీని జిమ్మదీయ ఒక్కల్లకీ వంటి మీద బట్టలు సరిగా కనిపించి చావట్లేదు
నాయనా అనంతూ నీ స్నేహితులకు ఒక్కొడికి రెండు కొట్లుబెట్టి వాచీలు కొనిచ్చావు కదా
అదే చేత్తో ఓ లారీలో చందనా చీరలు తెప్పించి తలా ఒకటి వీళ్ళ ముఖాన పడెయ్యి నాయనా..చూడలేకపోతున్నాం
వీళ్ళ జిమ్మడ
రేయ్ వీళ్ళకి చీరలు చూపించండ్రా..అలా వదిలేయకండ్రా..
రావు రమేష్ అరుస్తున్నాడు
credit goes to పరేష్ తుర్లపాటి ✍️ from facebook

Post a Comment

0 Comments

Advertisement