రోబో / కృత్రిమ మేధ

రోబో / కృత్రిమ మేధ

 రోబో / కృత్రిమ మేధ- యుగం వచ్చేసింది !

డ్రైవర్ , క్యాషియర్ , రిసెప్షనిస్ట్ , ప్లంబర్ , ఎలక్ట్రీషియన్ , ఇంటీరియర్ డిజైనర్, డాక్టర్, టీచర్, లాయర్, సోల్జర్, పోలీస్... లాంటి వృత్తుల్లోకి రోబో / కృత్రిమ మేధ రంగప్రవేశం చేసేసింది .
రాబొయ్యే రోజుల్లో విశ్వరూపం చూపనుంది .
కారు ముందు సీట్ లో మనిషికి బదులుగా మర యంత్రం అంటే రోబో కూర్చుని డ్రైవ్ చేయడాన్ని ఊహించుకోకండి.
అలాంటి అవసరం లేకుండా కారు కృత్రిమ మేధతో నడిచేలా డిజైన్ చేసేసారు . అమెరికా లాంటి దేశాల్లో ఇవి రంగ ప్రవేశం చేసేశాయి . మనిషి కారును నడిపితే మహా అంటే ముందు వైపు... కొంత వరకు పక్కకు చూడగలడు . కృత్రిమ మేధ కారు... 360 డిగ్రీ ల కోణం లో చూడగలదు. తుమ్మెద కనుల నుంచి ప్రేరణ పొంది దీని సెన్సర్లను డిజైన్ చేసారు .
పూర్తిగా కృత్రిమ మేధ వాహనాలు వస్తే రోడ్డు ప్రమాదాలు గతం అయిపోతాయి అని అంచనా .
రాన్నున్న కాలం లో రోబో లు ఇళ్లల్లోకి చొరబడుతాయి .
రోబో పని మనిషి , రోబో సెక్రటరీ , రోబో వంటమనిషి... అంతేనా .. రోబో భార్య .. రోబో భర్త... రోబో బాయ్ ఫ్రెండ్... రోబో గర్ల్ ఫ్రెండ్ .. ఇంకా .. ఇంట్లో పెంపుడు జంతువులుగా .. రోబో కుక్క , రోబో పిల్లి.. రోబో సింహం.. రోబో పులి { పులిని ని ఎవరైనా ఇంట్లో పెంచుకొంటారా అనుకొంటున్నారా ? అయితే మీకు దుబాయ్ లాంటి చోట్ల ఏమి జరుగుతోందో తెలియనట్టే.}
రోబో లు మన జీవితాల్లో పెనుమార్పులు తేనున్నాయి . ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచం లో గత రెండు వందల ఏళ్లుగా జరిగిన మార్పులు ఒక ఎత్తు.. రాబొయ్యే పదేళ్లలో రోబోల వల్ల జరగబోయే మార్పులు మరో ఎత్తు .
మంచి .. చెడు.. అన్నీ ఉంటాయి . వస్తాయి .
కాల చక్రాన్ని వెనక్కు తిప్పలేము . ఆ అవసరం లేదు .
మార్పు అనివార్యం .
కాకపోతే మార్పు మంచి కోసం ఉండేలా చూసుకోవాలి .
రోబో ల వల్ల కలిగే ప్రయోజనాలు అపరిపమితం . గడ్డ కట్టే చలిలో మన సైనికులు సరిహద్దు కాపలా కాయాల్సిన అవసరం లేదు . ఆ పని రోబోలు చూసుకొంటాయి . బాంబు ను నిర్వీర్యం చేయడం... రగులుతున్న భవనాన్ని ఆర్పడం లాంటి ప్రాణాంతక పనులు ఇక పై రోబోలు చూసుకొంటాయి . కోనేళ్ళ క్రితం ముంబై పై టెర్రరిస్ట్ ల దాడి జరిగింది . ఇక పై అలాంటి ఆపరేషన్స్ కు రోబోలను వినియోగిస్తారు .
టెర్రరిస్ట్ ల చేతికి రోబో వెళ్ళితే అంటారా ? అవునండీ .. సాంకేతికత రెండు వైపులా పదునైదున కత్తి.
రాజుల కాలం నాటి యుద్ధాలు... కత్తులతో విల్లంబుల తో జరిగేవి . అటుపై తుపాకి వచ్చింది . అది టెర్రరిస్ట్ ల చేతికి కూడా వెళ్ళింది కదా ? ఇదీ అంతే .
డాక్టర్ లుగా .. రైతులుగా కూడా రోబో లు పని చేస్తాయి . ఒక్క మాటలో చెప్పాలంటే భవిష్యత్తు రోబో వ్యవసాయానిదే .
రోబో యుగం ఇంకా వేకువ జామునే ఉంది. ఇప్పటికే ఐఐటీ లలో చదివిన వారికి కూడా ఉద్యోగాలు దొరకని స్థితి . బిట్స్ పిలానీ... ఐఐటీ ముంబై లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివిన ముగ్గురిలో ఒకరికి క్యాంపస్ ప్లేసెమెంట్ రాని స్థితి . అమెరికా లాంటి దేశాల్లో కృతిమ మేధ వల్ల వేలల్లో ఉద్యోగాలు పోతున్నాయి . రాబొయ్యే రోజుల్లో ఇది మరింత ఉదృతం అవుతుంది .ఇప్పుడున్న ఉద్యోగాల్లో కనీసం యాభై- అరవై శాతం రోబోలు ఎత్తుకెళ్ళి పోతాయి .
పారిశ్రామిక యుగం సుమారుగా రెండు వందల యాభై ఏళ్ళ క్రితం మొదలయ్యింది . అప్పుడు ప్రపంచ జనాభా కేవలం ఎనబై కోట్లు . ఇప్పుడు 800 కోట్లు . పది రెట్లు పెరిగింది . యంత్రాల చేత పని చేయించడానికి మానవుల సంఖ్య ఎక్కువగా అవసరం అయ్యింది . దీనికి తోడు పెరిగిన జీవన ప్రమాణాలు వైద్య సదుపాయాలు వల్ల జనాభా పెరుగుదల జరిగింది .
కృత్రిమ మేధ యుగాన్ని నాలుగో పారిశ్రామిక యుగం అంటున్నారు . ఈ యుగానికి ఇంత జనాభా అక్కర లేదు .
నిజమే రోబోల వల్ల కొన్ని కొత్త ఉద్యోగాలు వస్తాయి . "కంప్యూటర్ ల వల్ల ఉద్యోగాలు పోతాయన్నారు . నిజానికి కంప్యూటర్ ల వల్ల వేలాది మందికి ఉపాధి లభించింది .. ఇప్పుడు రోబో లు కూడా అంతే" అని చాల మంది అనుకొంటున్నారు . వీరు ఒక ప్రాధమిక సత్యాన్ని మరచి పోతున్నారు . కృత్రిమ మేధ సొంతంగా నేర్చుకొనే గుణాన్ని కలిగివుంది .
ఇప్పుడున్న నూరు ఉద్యోగాల్లో 60 యాభై కృత్రిమ మేధ ఎత్తుకెళ్ళి పొతే .. కేవలం పది ఉద్యోగాలు మాత్రం కొత్తగా వస్తాయి .
" నాలుగో పారిశ్రామిక యుగానికి ఇంత జనాభా అనవసరం ..ఎలాగైనా జనాభా తగ్గించాలి దీంతో బాటే జనాలు ఆన్లైన్ బతుకులకు అలవాటు పడేలా చెయ్యాలి" అని అలోచించి ... అలోచించి... ప్రపంచ మాఫియా నాయకులు కరోనా ను .. లాక్ డౌన్ ను అటు పై వాకా సీన్ ను ప్రవేశ పెట్టారు... అనేది కుట్ర సిద్ధాంతం . ఇది చెబితే కొంత మందికి ఒళ్లు మంట.
ఏమీ లేనప్పుడు ఏదో కుట్ర జరుగుతోంది అనుకోవడం మానసిక రోగం .. అదే సమయం లో జరుగుతున్నదానిని గ్రహించే తెలివితేటలు లేక .. అంతా మన మంచికే అనుకోవడం డిజిటల్ యుగపు అజ్ఞానం .
గత మూడేళ్ళుగా డిజిటల్ యుగపు అజ్ఞానం తో ఎంతో మంది భారీ మూల్యాన్ని చెల్లించు కొన్నారు . రానున్న రోజుల్లో ఇది మరింత ఎక్కువగా జరుగుతుంది
రోబో యుగం లో బతికి డిస్ట్రెస్డ్ జీన్స్ తొడగాలంటే ఏమి చెయ్యాలి ? { బతికి బట్టకట్టడం పాత సామెత . చిరిగిన జీన్స్ ధరించడం కొత్త ట్రెండ్ }
మరో పది పదహైదు ఏళ్లకు జనాభా లో అరవై డెబ్భై శాతం ఉద్యోగాలు లేకుండా ఇంట్లో కూర్చొవాలిన పరిస్థితి .
బతకడం ఎలాగంటారా ?
చూస్తున్నారుగా .. ఉచితాలు .
రోబో ల వినియోగం వల్ల ప్రభుత్వాల ఆదాయాలు పెరుగుతాయి . సమాజం లో పది ఇరవై శాతం జనాభా మరింత ధనికులవుతారు . మిగతా అంటే... ఎనభై శాతం మంది ప్రభుత్వాలు ఇచ్చే భృతి / పెన్షన్ పై ఆధారపడి బతుకుతారు . ఒక్క మాటలో చెప్పాలంటే సమాజం లో రెండే రెండు వర్గాలు ..1 .సూపర్ రిచ్ . అపర కుబేరులు . 2. బీద వారు .
మిడిల్ క్లాస్ అనేది ప్రాచీన మధ్య యుగ కాలం లో లేదు{ ఉన్నా సంఖ్య/ ప్రభావం బాగా తక్కువ }.
మిడిల్ క్లాస్ మొదటి పారిశ్రామిక యుగం లో పుట్టింది . నాలుగో పారిశ్రామిక యుగానికి అంతరించిపోతుంది అనేది అంచనా .
2010 తరువాత పుట్టిన పిల్లల్ని ఆల్ఫా తరం అంటారు . వీరి తల్లితండ్రులు z తరం
మీరు x తరానికి చెందిన వారా ? అంటే 1965 - 1980 మధ్యలో పుట్టిన వారా? అయితే కృత్రిమ మేధ ప్రభావం మీ జీవితాలపై పెద్దగా ఉండదు . ఒక విధంగా మీరు అదృష్టవంతులు . మరో కోణం లో దురదృష్టవంతులు కూడా .
z తరం తల్లితండ్రులు... తమ ఆల్ఫా తరం పిల్లల్ని ఎలా పెంచాలి ? తమ పిల్లలు ప్రభుత్వ భృతి పై ఆధార పడి జీవించే పేదరిక స్థాయికి పడిపోకుండా .. డిజిటల్ యుగం తేనున్న సవాళ్లు .. { పెళ్ళొద్దు ..ఫామిలీ ఒద్దు ... రోబో ల తో సెక్స్ . లివ్ ఇన్.. బ్రేక్ అప్ .. వాక్ సీన్ లు ఒంటికి పుష్టినిస్తాయి . బిర్యానీ తిన్నాక కోక్ తాగితే బాగా జీర్ణం అవుతుంది .. ఎలర్జీ లకు .. ఆటో ఇమ్యూన్ డిసార్డర్ ల కు కారణాలు ఇంకా కనిపెట్టలేదు .. రీసెర్చ్ జరుగుతోంది .. జరుగుతూనే ఉంటుంది .. ఆన్లైన్ బెట్టింగ్ .. స్త్రీ లు పురుషులు అనేది మిధ్య.. మనుషుల్లో ఎనభై ఏడు రకాల లింగాలు వున్నాయి .. ఇలా సవాలక్ష } . వీటిని ఎలా ఎదుర్కోవాలి ?
ఎలాంటి చదువులు చదవాలి ? దేనికి డిమాండ్ ఉంటుంది ?

Post a Comment

0 Comments

Advertisement