ఢిల్లీ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లు - రాజు గారి దేవత వస్త్రాలు !

ఢిల్లీ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లు - రాజు గారి దేవత వస్త్రాలు !

From Vasireddy Amarnath sir  facebook wall...

ఢిల్లీ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లు - రాజు గారి దేవత వస్త్రాలు !
ఒక్కో క్లాసులో 750 మంది .
చిన్న సైజు పబ్లిక్ మీటింగులా ఉంటుంది .
ప్రశ్నలడిగే అవకాశమే లేదు .
లెక్చరర్ ను కలవలేరు .
గుంపులో కూర్చొని వినబడింది రాసుకోవడమే .
లక్షల్లో ఫీజు .
పోనీ ఉపయోగపడుతుందా? అంటే లేదు .
గత కొన్ని ఏళ్లుగా సివిల్స్ పరీక్ష జూదంలా మారింది .
ఎక్కడ నుంచి ప్రశ్నలడుగుతారో తెలియదు .
చాలా సార్లు క్లాసులో చెప్పింది ఒక ముక్క కూడా రాదు .
కోచింగ్ కు, పరీక్షకు సంబంధమే ఉండదు .
"అందరూ తీసుకొంటున్నారు .. మనం తీసుకోకపోతే ఎక్కడ వెనుకబడి పోతామేమో" అనే భయం కొద్దీ కోచింగ్ కు పోతారు .
కొన్ని వేలమంది కోచింగ్ తీసుకొంటున్నప్పుడు కొందరికి రాంకులు వస్తాయి .
ఇంటర్వ్యూ కోసం కోచింగ్ సెంటర్ లు ఉచిత కోచింగ్ ఇస్తాయి ఇంటర్వ్యూ కు ఎంపికయిన ఇద్దరిలో ఒకరికి రాంక్ ఎలాగూ వస్తుంది .
ఆ రాంక్ లతో కోచింగ్ సంస్థల ప్రచారం .
ఒకటి నిజం .
కోచింగ్ కు వెళ్లడం వల్ల ఒకరితో ఒకరికి పరిచయం . పోటీ వాతావరణం . అవతలి వారు ఎలా ప్రిపేర్ అవుతున్నారు అనే అవగాహన . అంటే అకాడమిక్ అంబియెన్స్ .
ఇదొక్కటే కోచింగ్ వల్ల లాభం .
ఢిల్లీ రాజేందర్ నగర్ అద్వానంగా ఉంటుంది .
భారీ అద్దెలు .
ఒక వీధి వీధి కోచింగ్ సంస్థలు .. మెటీరియల్ అమ్మే షాప్స్ .
దక్షిణాదిన ఐఏఎస్ మోజు తగ్గింది .
మొన్నటి దాక ఇంజినీరింగ్ చేసిన వారికి వెంటనే ఏదో ఒక జాబ్ వచ్చే అవకాశం . సివిల్స్ అంటే మూడు నాలుగేళ్లు కష్టపడాలి .
కానీ బీహార్ లో వాతావరణం వేరు . అక్కడి విద్యార్థుల మొదటి ఛాయస్ సెంట్రల్ అండ్ స్టేట్ సివిల్స్ . వీళ్ళందరూ ఢిల్లీ లోనే కోచింగ్ తీసుకొంటారు .
హైదరాబాద్ లో సివిల్స్ కోచింగ్ జోరు ఎప్పుడో తగ్గిపోయింది . నాతొ కోచింగ్ ఇచ్చిన అనేక మంది మిత్రులు ఢిల్లీ కి ఎప్పుడో వెళ్ళిపోయి అక్కడ కోచింగ్ ఇస్తున్నారు .
స్లేట్ ప్రారంభించక పోయి ఉంటే .. ఇప్పుడు నేను కూడా ఢిల్లీ రాజేందర్ నగర్ లో ఉండేవాడిని .
రావూస్ కోచింగ్ సెంటర్ స్థాపకుడు మా గురువు డాక్టర్ రావు గారు . అప్పట్లో అయన వారం ఢిల్లీ లో వారం హైదరాబాద్ లో ఉండి కోచింగ్ ఇచ్చేవారు .
కోచింగ్ అంటే అది .
క్లాసులంటే ఆయనవి .
సమాచారం పెద్దగా ఇవ్వరు .
ఆలోచింపచేస్తారు .
రాజభవన్ రోడ్డు లో కొండ పైన ఆయన కోచింగ్ సెంటర్ ఉండేది.
బ్రెయిన్ ట్రీ డైరెక్టర్ గోపాల కృష్ణ నేను అక్కడే కోచింగ్ తీసుకొన్నాము .
రావు గారి క్లాసులు విన్నాక నాలో పెద్దపెట్టున మార్పు వచ్చింది .
ఇప్పుడు నాలో మీరు చూసే లక్షణాలకు అక్కడే బీజం పడింది .
నా జీవితం లో అదొక మైలురాయి .
ఒక దశలో దేశం లోని అన్ని రాష్ట్రాల్లో రావు గారి శిష్యులే చీఫ్ సెక్రటరీ లు .
ఒక్క ముక్క లో చెప్పాలి అంటే ఐఏఎస్ కోచింగ్ అంటే రావు గారు . రావు గారంటే ఐఏఎస్ కోచింగ్ .
ఆయన మరణం తరువాత ఆ కోచింగ్ సెంటర్ ను ఎవరో నడుపుతున్నారు . ఇప్పుడు ఉన్నదానికి అప్పటి సంస్థకు కేవలం పేరు మాత్రమే కామన్ .
గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగిన వారికి ఐఏఎస్ ఒక స్వప్నం . అదే నగరాల్లో పుట్టి పెరిగిన వారికి ఐఏఎస్ పై పెద్దగా ఆసక్తి లేదు . తల్లితండ్రి ఐఏఎస్ ఐపీఎస్ అయితే తప్పించి మిగతా కుటుంబాల నగర విద్యార్థులు.. దక్షిణాదిన .. ఐఏఎస్ వైపు అంతగా ఆకర్షితులు కావడం లేదు .
కోచింగ్ కు వచ్చేవారిలో స్టాండర్డ్ ఉన్నవారి సంఖ్య తగ్గిపోతోంది . ఫలితాలు నిరాశాజనకంగా ఉండడానికి ఇదొక కారణం . ఇందాక చెప్పినట్టు సివిల్స్ పరీక్ష గత కొన్ని ఏళ్లుగా జూదంగా మారడం .. మూడేళ్లు కష్టపడినా ప్రిలిమ్స్ పాస్ కాకపోవడం .. ఇంకో కారణం . ఒకప్పుడు హైదరాబాద్ ఢిల్లీ తరువాత రెండో స్థానంలో ఉండేది . ఇప్పుడు సివిల్స్ కోచింగ్ విషయం లో వెనుకబడడానికి కారణం ఇదే .
కోనేళ్ళ క్రితం మాట . చెన్నై ఐఐటీలో చదివిన ఒక ఒక అబ్బాయి కోచింగ్ కొచ్చాడు . సీన్ కట్ చేస్తే అతను ఇప్పుడు ఒక నగర పోలీస్ కమిషనర్ .
కృష్ణ దేవరాయ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ మరో అబ్బాయి .
ఇప్పుడు జైళ్ల శాఖ ఐజీ. ప్రతిభ కలిగిన వారు కష్టపడే తత్త్వం కలిగిన వారు ఐఏఎస్ వైపు చూడడం తగ్గి పోయింది .
మిత్రుడు బ్రెయిన్ ట్రీ గోపాల కృష్ణ మాటల్లో చెప్పాలంటే జరగబోయే దాన్ని ముందుగానే పసిగట్టి అందుకు అనుగుణంగా మారే విజన్ నాది . అందుకే ఇరవై ఏళ్ళ క్రితమే ఐఏఎస్ కోచింగ్ నుంచి జంప్ .
అందుకే ఇప్పుడు పాటశాల దశలోనే డేటా సైన్స్ ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ అర్బన్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ సైకాలజీ నేర్పించే స్మార్ట్ కార్యక్రమాన్ని రూపొందించాను .
మార్పు నిరంతరాయం .
అనుసరణ తప్పని సరి .
లేకపోతే విలుప్తం ఖాయం .
సివిల్స్ కోచింగ్ కోసం ట్రంక్ పెట్టె తో రాయలసీమ ఎక్స్ప్రెస్ రైలు దిగిన వి ఎస్ అమర్నాథ్ ముందుగా .. సివిల్స్ అభ్యర్థి .. అటు పై వాసిరెడ్డి అమర్నాథ్ గా ఆంత్రోపాలజి .. హిస్టరీ .. జనరల్ స్టడీస్ .. అటు పై గ్రూప్ - 1 , 2 , ఎంపిడిఓ . ఎస్సై , బీఈడీ , డీఎస్సీ కోచింగ్ .. ముందుగా ఒక సంస్థలో లెక్చరర్ అటు పై అపెక్స్ డైరెక్టర్ .. ఈనాడు ప్రతిభ వ్యాసకర్త .. అటు పై టీవీ చానెల్స్ లో విశ్లేషకుడు .. మారుతున్నా ట్రెండ్ ను అర్థం చేసుకొని అబిడ్స్ లో స్లేట్ .. అటు పై అమీర్పేట్ ఖర్మన్ఘాట్ .. అటు పై సిబిఎస్సీ పాఠశాలలు .. తిరుపతి , గన్నవరం .. బౌరంపేట్ { ఐసిఎస్సీ } .. ఇప్పుడు కేంబ్రడ్జి కరికులం .. స్మార్ట్ .. ఇక రానున్న రోజుల్లో సరి కొత్త పేరుతొ పటాన్చెరు లో .. ఇంకా .. ఇంకా ..
మార్పు తప్పని సరి గురూ..
అయినా మనిషి మారలేదు .. ఆతని మమత తీరలేదు

Post a Comment

0 Comments

Advertisement