ప్రభుత్వాలు ఫీజు రీ ఇంబర్సుమెంట్ - నాసిరకం విద్య

ప్రభుత్వాలు ఫీజు రీ ఇంబర్సుమెంట్ - నాసిరకం విద్య

 ప్రాణం తీస్తున్న మందు !

ఇంజనీరింగ్ కళాశాలల్లో పరమ నాసిరకం విద్య .
అమ్మ పెట్టా పెట్టదు . అడుక్కొని తిననివ్వదు అన్న చందంగా ..
ప్రభుత్వాలు ఫీజు రీ ఇంబర్సుమెంట్ సకాలంలో ఇవ్వవు .
పోనీ కాలేజీలను ఫీజు వసూలు చేసుకోనివ్వవు
ప్రభుత్వాలు దివాళా తీసి చాలా కాలం అయ్యింది .
పన్నులు వసూలు చేసి వడ్డీలు కట్టడమే ఇక వాటి పని ..
" మేము ఫీజు రీ ఇంబర్స్ చేయలేము . తల్లితండ్రులే ఫీజులు కట్టుకోండి" అని చెబుతాయా?
వామ్మో .. రాజకీయంగా అవి ఆత్మహత్య సాదృశ్యం అని నాయకులకు తెలుసు .
కాబట్టి ఆ పని చెయ్యరు .
ప్రభుత్వాలు ఎప్పుడో రెండేళ్లకో మూడేళ్లకో రీ ఇంబర్స్ చేస్తాయి .
డబ్బులు లేకపోతే యాజమాన్యాలు జీతాలు ఎలా చెల్లిస్తాయి ?{ నూటికి తొంబై శాతం యాజమాన్యాలు కేవలం దోపిడీకి ఉన్నాయి. అదే సమయలో ఇంజనీరింగ్ కళాశాల లు పెట్టి దివాళా తీసినవారు ఎంతో మంది . ఇది వేరే టాపిక్ }
ఎప్పుడో ఆరునెలలలకో సంవత్సరానికో జీతాలు వస్తే అలాంటి ఉద్యోగాలకు ఎవరు వెళుతారు ?
ఇప్పుడు నూటికి తొంబై అయిదు శాతం ఇంజనీరింగ్ కళాశాలల్లో సరైన ఫాకల్టీ లేదు . మౌళిక సదుపాయాలు లేవు .
కాలేజీ క్యాంపస్ లోనే మందు కొడుతూ .. డ్రగ్స్ తీసుకొంటూ .. రీల్స్ చేసుకొంటూ విద్యార్థులు . ప్రేమ లు.. లివ్ ఇన్ లు .. ఫ్రెండ్షిప్ విత్ బెనిఫిట్ పేరుతొ సెక్స్ కార్యక్రమాలు చేసేవారు కొందరు
ఒకరిని చూసి మరొకరు .
ఇంజినీరింగ్ కాలేజీ లో చేరితే .. చదువు తప్పించి అన్నీ వస్తాయి .
పాడైపోకుండా ఉండడం చాలా కష్టం .
ఇలాంటి వారు బయటకు వస్తే ఉద్యోగాలు ఎలా ?
అమెరికా ఉద్యోగాలు ఒక వెలుగు వెలిగినంత కాలం ఏదోలా గడిచిపోయింది . ఇప్పుడు పరిస్థితి తలకిందులు .
ఇక సాంప్రదాయక కాలేజీ ల { బీఏ బీకామ్ బి ఎస్సీ } పరిస్థితి మరీ దారుణం .
అత్యంత దయనీయమయిన స్థితిలో ఉన్నత విద్య .
డిగ్రీ పిజి కాలేజీ లు .
ఇది ఎక్కడికి దారి తీస్తుంది అని ఎప్పటినుంచో అనుకునేవాడిని .
పనికి రాని చదువును వదిలేస్తున్నారు .
" కాలేజీ లో చేరి మూడు నాలుగేళ్లు కాలక్షేపం చేసి .. అటు పై రోడ్డు పై పడడం ఎందుకు ?"
ఇదీ నేటి యువత ఆలోచన .
ఒక్క తెలంగాణాలో నే .. ముగ్గురిలో ఒక్క విద్యార్థి ఇంటర్ తరువాత విద్య కు దూరం అవుతున్నారు . అంటే కాలేజీ లో చేరడం లేదు . చేరినా కాలేజీ కు పోరు .
స్విగ్గి జొమాటో ఇంకా ఇతరత్రా డెలివరీ పనుల్లో... . ఇంకా అమ్మఅబ్బా సంపాదించిన డబ్బుతో గంజాయి కొడుతూ జులాయిగా తిరుగుతూ విద్యార్థులు.
అందరూ ఇంజనీర్ లు డాక్టర్ లు కావాలి అనేది ఒకనాటి కల . { అదో చెత్త కల .ఇంకేమి ఉద్యోగాలు లేవా ? అనేది వేరే టాపిక్ } .
అందరూ ఉన్నత ఉద్య చదివేస్తే డెలివరీ బాయ్స్ గా ఆటో కార్ డ్రైవర్స్ గా ఎవరు పని చేస్తారు అని కొంతమంది అనుకునేవారు .
ఫీజు రీ ఇంబర్సుమెంట్ లక్ష్యం పేద విద్యార్థులకు కూడా నాణ్యమయిన ఉన్నత విద్య అందుబాటులోకి తేవడం . పేద కుటుంబాల వారు తమ పిల్లల ను ఉన్నత విద్య చదివించలేరు అనే సమస్య కు పరిష్కారం ఫీజు రీ ఇంబర్సుమెంట్ .
ఇప్పుడే ఆ మందే విషంగా మారి విద్య నాణ్యతను దెబ్బ తీసి కాలేజీలను గంజాయి కేంద్రాలుగా .. యువతను జులాయిలుగా చేయడానికి . ప్రధాన కారణమవుతోంది .

Post a Comment

0 Comments

Advertisement