Dollar Dreams -- What is life...?

Dollar Dreams -- What is life...?

 డాక్యూమెంటెడ్ డ్రీమర్స్ భవిష్యత్తు ?

అమెరికాలో పుట్టిన పిల్లలకు జన్మతః ఆ దేశ పౌరసత్వమొస్తుంది .
ఇండియా లో పుట్టి, తల్లితండ్రితో పాటుఅమెరికా కు వెళ్లిన పిల్లలు ?
వీరు డిపెండెంట్ వీసాతో వెళ్ళివుంటారు .
వీరిని డాక్యూమెంటెడ్ డ్రీమర్స్ అంటారు .
21 ఏళ్ళు దాటితే డిపెండెంట్ స్టేటస్ పోతుంది .
ఇప్పుడు అలాంటి వారు రెండు లక్షల యాభై వేలమంది ఉన్నారు.
వీరందరిని తిరిగి పంపించేస్తారా ?
అమెరికా కు వెళ్ళినాటికి వీరిలో ఎక్కువమంది చిన్న పిల్లలు . అక్కడే చదివి పెరిగి పెద్దవారయ్యారు . ఇండియాకొచ్చి స్థిరపడలేరు .
ఇక్కడికి రావాలని వారికి ఉండదు కూడా .
మరి వారి భవిషత్తు ?
తిరిగి గ్రీన్ కార్డు కు అప్లై చేసుకోవడం లేదా డిపోర్టేషన్ .
గతంలో రిపబ్లికన్ పార్టీ ఈ సమస్యకు చెందిన బిల్లులను వ్యతిరేకించింది .
ఇప్పుడు ట్రంప్ గెలిస్తే పరిస్థితి ఏంటి ?
కమలమ్మ గెలిస్తే వీరందరికీ గ్రీన్ కార్డు ఇస్తుందా ?
వీరి సంగతి ఆలా ఉంచితే .. నేడు అమెరికా లో ఉద్యోగాలు చేస్తున్న భారతీయుల పరిస్థితి గందరగోళంగా ఉంది
అమెరికా కు వెళ్ళిపోతే ఎలాగో ఒకలా హ్యాపీగా బతికేయొచ్చు . ఇదీ మనవారి ఆలోచన .
నిన్నటిదాకా ఇది నిజం కూడా .
కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులయ్యింది .
ఉద్యోగాలు లేవు .
ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయి.
ఇండియా కు వచ్చేసేవారు కొందరు . "పరిస్థితి మారుతుంది . కొంత కాలం వేచి చూద్దాము" అని మరికొందరు .. స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకొని కొత్త ఉద్యోగాలు పొందుతూ మరి కొందరు.
చాలా కాలం క్రితం వెళ్లి స్థిరపడి ఆస్తులు సంపాదించుకొన్నవారు హ్యాపీ .
గత పది పదహైదు ఏళ్ళ క్రితం వెళ్లిన వారు పైన చెప్పిన పరిస్థితుల్లో .
గత రెండేళ్లగా ఉన్నత చదువు కోసం వెళ్లిన వారి పరిస్థితి దయనీయం . ఇంట్లో నానీ { చిన్న పిల్లల సంరక్షణ చేసే ఆయా ఉద్యోగాలు కూడా దొరకని స్థితిలో } .
సరైన సమాచారం ఉంటే వారిలో నూటికి డెబ్భై మంది వెళ్ళివుండేవారు కాదు .
" అమెరికా అద్భుత ప్రపంచం అక్కడికి వెళ్ళితే లైఫ్ సెటిల్ అయినట్టే .. రెండిళ్లల్లో ఒక కారు .. ఇల్లు కొనుకోవచ్చు" అనే భ్రమల్లోనే అందరూ ఉన్నారు.
వీరికి వాస్తవ పరిస్థితులు తెలిసే అవకాశం లేదు . అమెరికా ఉన్నత చదువులు వీసాలు .. అక్కడ ఉద్యోగాలు ఇప్పించడం .. ఇది వందల కోట్ల బిజినెస్ . ఈ లాబీ చాలా పవర్ఫుల్.

Post a Comment

0 Comments

Advertisement