సామజిక భావోద్వేగ తెలివితేటలు నేర్పని చదువులది .. తల్లితండ్రులది .. సమాజానిది .

సామజిక భావోద్వేగ తెలివితేటలు నేర్పని చదువులది .. తల్లితండ్రులది .. సమాజానిది .

 మీరు పోతానంటే నేను వద్దన్నానా ?

"సంవత్సరాల తరబడి కష్టపడి చదివితే ఏమొస్తుంది ? చాలీ చాలని జీతం . ఎదుగూ బొదుగూ లేని జీవితం . అదే రీల్స్ చేస్తే కోట్లు సంపాదించవచ్చు " అంటాడు ఒకడు .
కోటి మంది రీల్స్ చేస్తే అందులో ఒకడు కోటి సంపాదించవచ్చు . అదీ స్థిర ఆదాయం కాదు . చిత్ర విచిత్రంగా అనిపించే ఒక రీల్ హిట్ అవుతుంది . ఈ లోగా తనకన్నా పరమ రోతగాడు ఒకడొస్తాడు . అప్పుడు తాను ఫేడ్ అవుట్ - ఈ వాస్తవవికత ను వీడు గ్రహించలేడు. రీల్స్ చేసే వారిలో 99 . 99 శాతం మంది ఎందుకూ కొరగాకుండా పోతారు . ఐఐటీ, సివిల్స్ లాంటి పరీక్షలకు సిన్సియర్ గా ప్రిపేర్ అయ్యి రాంక్ సాధించలేక పోయినా ఆ విజ్ఞానం , కౌశలాలు జీవితం లో ఉపయోగపడుతాయి . రీల్స్ చేసిన తెలివి తేటలు దేనికీ ఉపయోగపడవు .
రీల్స్ చేసి అది హిట్ కాక ఓన్లీ ఫాన్స్ లాంటి పోర్న్ ప్లాటుఫార్మ్స్ లో వెబ్ సిరీస్ లో పోర్న్ ఫిలిమ్స్ లో నటించి నెలకు పది లక్షలు సంపాదిస్తోంది ఒక యువతి. తనతో బాటు ఇంటర్మీడియట్ చదివిన తన స్నేహితురాళ్ళు ఇంకా మెడికల్ ఎంట్రన్స్ కు ప్రిపేర్ అవుతున్నారు . తానేమో సీనియర్ డాక్టర్ కన్నా ఎక్కువ సంపాదిస్తున్నాను అని గర్వంగా చెప్పుకొంటోంది .
తనది కేవలం రెండు మూడేళ్లు సాగే కెరీర్ అని అటు పైన ఎందుకూ కొరగాకుండా పోతానని దీనికి తోడు రోగాలు , మానసిక సమస్యలు తప్పవని గ్రహించలేక పోతోంది .
ఆన్లైన్ లో బెట్టింగ్ కాస్తే కోట్లు సంపాదించవచ్చని... చదువు ఆఫీస్... జాబ్ .. ఇవన్నీ చేతగాని వాళ్ళ ఆలోచనలు అని ఒకడు చెబుతున్నాడు .
బెట్టింగ్ కాచి, జీవితం లో నిలదొక్కుకున్న వాడు చరిత్ర లో లేడు. ఉంటే గింటే వాడు బెట్టింగ్ మాఫియా సృష్టించిన ఫేక్ గాడు . బెట్టింగ్... వ్యాపారులకు లాభం . కాచే వారికి ఉరి అని గ్రహించలేడు వీడు .
" పెళ్లంటే స్త్రీ... పురుషుడికి బానిస కావడం .. తన తల్లి.. అమ్మమ్మ ... నాన్నమ్మ లాగా తాను బానిసత్వాన్ని ఏరి కోరి ఎంచుకోలేను " అని చెబుతోంది ఒక యువతి .
" ఇప్పుడు ఇన్ఫర్మేషన్ యుగం వచ్చింది . జనాల్లో చైతన్యం వచ్చింది. ఎవరూ ఎవరికీ లొంగి వుండరు . ఇక పెళ్లిళ్లు జరగవు . జరిగినా అవి అవి పెటాకులయిపోతాయి" అంటాడు యూట్యూబ్ ఛానల్ లో పిట్టల దొర అవతారం లో ఒకడు .
తప్పు వీరిది కాదు .
సామజిక భావోద్వేగ తెలివితేటలు నేర్పని చదువులది .. తల్లితండ్రులది .. సమాజానిది .
పరిష్కారం ?
చాలా సింపుల్ .
గేట్ల తాత లాంటి వారు కోరుకొనేది కూడా ఇదే .
వచ్చేసింది రోబో యుగం .
మరో పదేళ్లలో కాగ్నిబోట్ లు , టెక్బోట్ లు నర్స్ బోట్ లు , గార్డ్ బోట్ లు, గైడ్ బోట్ లు , కంపానియన్ బోట్ లు , మెంటార్ బోట్ లు, వర్కర్ బోట్ లు, స్పెషలిటీ బోట్ లు రానున్నాయి .
స్మార్ట్ సిటీ లు , స్మార్ట్ హోమ్ లు , అర్బన్ అగ్రికల్చర్, వర్టికల్ ఫార్మింగ్, ఆటోనామాస్ ట్రాన్స్పోర్టేషన్, హాల్లోఫ్లక్స్ డిసిప్లే, ఎయిర్ ప్యూరీఫైర్స్, స్మార్ట్ వాటర్ మానేజ్మెంట్, ఇంటలిజెన్స్ లైటింగ్, స్మార్ట్ కిచెన్, ఆక్వా ఫోనిక్స్, ఆక్వా కల్చర్ , ఏరోఫోనిక్- హైడ్రోఫోనిక్ సిస్టమ్స్.. ఇంకా చాలా చాలా రానున్నాయి .
పనులన్నీ రోబో లు చేస్తాయి .
అప్పుడిక ఇంత మంది మనుషుల అవసరం లెదు.
గంగిగోవు పాలు గరిటడయినా చాలు అన్నట్టు స్మార్ట్ మనుషులు కొంత మంది చాలు . అలాంటి లోకం చూడకుండానే పాపం వీళ్ళందరూ విలుప్త జీవులుగా మారి పోతారు.
దీపపు పురుగులు వీళ్ళు .. స్మార్ట్ ఫోన్ అనే దీపం మంటల్లో తగలబడి పోతున్నారు .
టెక్ యుగపు సవాళ్ళను ఎదుర్కోవాలంటే స్మార్ట్ ఆలోచనలు కావాలి .
ఈ పయనం లో స్మార్ట్ గా సాగేదెవరు ? { నేనుంటా .. మీకు గైడ్ గా.. మెంటార్ గా }
దీపపు పురుగుల్లా మాడి మసై పోయేదెవరు ?
నిర్ణయం మీదే ..
శుభోదయం !
క్రెడిట్ - Amarnath Vasireddy గారు

Post a Comment

0 Comments

Advertisement