ముల్లు విరిగిపోతుంది .. జాగ్రత్త !

ముల్లు విరిగిపోతుంది .. జాగ్రత్త !

 ముల్లు విరిగిపోతుంది .. జాగ్రత్త !

చేతిలో సెల్ ఫోన్ !
యూట్యూబ్ లో అర్ధ -పోర్న్ ..
వెబ్ సిరీస్ లో ముప్పావు- పోర్న్ ..
నెట్ పై ఫుల్- పోర్న్
వాటర్ బాటిల్ లో ఓడ్కా
వీధి చివర గంజాయి !
కాలేజ్ బయట బడ్డీకొట్టులో ఎలఎస్డీ !!
ఒంట్లో వయసు హార్మోన్ !
ఫ్రెండ్స్ గ్యాంగ్ తో పీర్ ప్రెషర్ !
పేరెంట్స్ అకౌంట్ లో మస్తు డబ్బు !!
ఇడియట్ బాక్స్ లో సిక్స్టీ ప్లస్ లీడర్స్ సెక్సకపెడ్స్ ..
ఆవులు .. ఎడ్లు .. చేలో మేస్తుంటే ..
దూడలు గట్టున ఎట్లా మేస్తాయి బ్రో ?
సైట్ కొట్టడాలు .. బీట్ వెయ్యడాలు .. ప్రేమ లేఖలు !
ఇంతా చేస్తే " నిన్ను ఎప్పుడు ఆ దృష్టి తో చూడలేదు అన్నయ్యా " అనే రిప్లై !
నాటి యువకులకు.. ఎంత కష్టం.?. ఎంత కష్టం???
ప్రేమ లో గెలవడమంటే .. లక్కు చిక్కనట్టే ఒలింపిక్ గోల్డ్ మెడల్ దక్కినట్టే !
సీన్ కట్ చేస్తే ..
కారు .. కనీసం స్పోర్ట్స్ బైక్ ఉంటే ..
మూడు నెల్లు జిం కు పోయి .. రోజూ కూసింత అనబోలిక్ స్టెరాయిడ్ తింటే ..
అమ్మాయిలే వెంట పడే స్థితి నేడు { అమ్మాయిలందరూ ఇలా వున్నారని కాదు .}
ఆ సుఖం కోసం" ప్రేమ .. పెళ్లి" అని కబుర్లు చెప్పనక్కర లేదు
" ప్రేమ గీమా అంతా బుల్ షిట్ .. జస్ట్ కలిసామా.. ఎంజాయ్ చేశామా" ..
తాగిన గ్లాసులు సింక్ లో పడేసింత కాజువల్ గా దాని గురించి మరిచిపోయామా " అనేదే ఆల్ఫా జెనెరేషన్... మాట .. బాట ! .తాగిన మైకం లో ఎవరి తో చేసాము? ఎంత మందితో చేసాము? అనేది కూడా గుర్తుండని కాజువల్ కాలం !
"డేటింగ్" .. "లివ్ ఇన్" పాతబడి పోయింది ..
సిచువేషన్షిప్.. లవ్ బాంబింగ్ .. ఆర్బిటింగ్ .. బెంచింగ్ .. బ్రెడ్ క్రంబింగ్ . కాఫిన్గ్ ... ఘోస్టింగ్ . అబ్బో .. మస్తు ఉన్నాయిలే!
తెలుగు నాట శృంగార రసం ఏరులై పారుతోంది .
"అదృష్టమంటే నేటి కలం కుర్రాళ్లది .
అంత త్వరగా ఎందుకు పుట్టి చచ్చానో" అని నిరాశ నిసృహల్లొ కొంత మంది తాతల్స్ అంకుల్స్ ..
ఒక వైపే చూడకు .. రెండు వైపు చూడు ..
ఇప్పటికే మగాడి బతుకు జంబాలకాడిపంబ అయిపోయిందని మగాళ్ల సంఘాలు వాపోతున్న స్థితి .
{ మగాడిని మోసం చేసే ఆడ కిలాడీస్ సంఖ్య పెరిగిన మాట వాస్తవం . కానీ నేటికీ మన సమాజం లో పురుషాధిక్యత తగ్గలేదు .. అత్యాచారాలకు గురవుతున్న అమ్మాయిలు .. మహిళలు కోకొల్లలు అనేది నా అభిప్రాయం . ఇటీవల కాలంలో పోర్న్ చూసిన చిత్తకార్తె కుక్కలు... ఇళ్లల్లో విద్యాసంస్థల్లో పసి మొగ్గలపై కూడా అఘాయిత్యాలు చేస్తున్నారు అంచనాలకు... ఊహకు అందని దారుణాలు జరిగిపోతున్నాయి ఈ అంశం పై మరో పోస్ట్ లో వివరిస్తాను }.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం .. ముల్లును విరిచేస్తుంది .
సెక్షన్ 69 కింద ఒక స్త్రీని పెళ్లి చేసుకొంటానని లేదా ఉద్యోగం లో పదోన్నతి కలిపిస్తానని చెప్పి సెక్స్ చేసి మోసగిస్తే పదేళ్ల దాక జైలు శిక్ష .
చట్టాలు .. లొసుగులు .. వేరే టాపిక్ . ఈ చట్టం మహిళలకు రక్షణ కల్పించేదిలా లేదు అని కూడా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి . ఇది వేరే అంశం .
కానీ స్థూలంగా చెప్పాలంటే కిలాడీ లేడీ .. చేతిలో పడితే ..{ ఇలాంటి వారిని నడిపే గ్యాంగ్స్ కూడా ఉంటాయి ..} పదేళ్లు జైలు శిక్ష అని బ్లాక్ మెయిల్ చేసి మొత్తం ఆస్తిని లాగేస్తారు . ఆ సుఖం దక్కిందన్న మత్తు వదలక ముందే పోలీస్ స్టేషన్ .. బైలు .. జైలు .. బతుకు బస్సు స్టాండ్ .
అమ్మా ! అయ్యా !
ఇంతకీ ఈ పోస్ట్ ద్వారా చెప్పొచ్చేదేమిటంటే ..
సెల్ ఫోన్... టీవీ షో చూసి నలుగురు ఇదే దారిలో ఉన్నారని అడ్డదారి తొక్కితే ..బతుకు ఛిద్రం .
మీ కొడుక్కి అమ్మాయిని గౌరవించడం నేర్పండి .
అమ్మాయిలకు కూడా అబ్బాయి అంటే శతృవు కాదు అని నేర్పండి { పాపం నాలుగేళ్ళ వయసు నుంచే చితా కార్తె కుక్కల గోకుడు ని చూసిన పాప.. మగాడంటే అసహ్యం పెంచుకోక ఏమి చేస్తుంది అనుకుంటున్నారా ! నిజమే . }
సెక్స్ అనేది అంగడి సరుకు కాదు .
ఎన్నో ఏళ్ళ మానవాళి సంచిత విజ్ఞానం .. పెళ్లి.. కుటుంబ వ్యవస్థలు ..
లేదు దానికి రీప్లేస్మెంట్ ..
అవును కావాలి వాటిలో డెమోక్రాటిక్ మార్పులు .
ఎలుకలున్నాయని ఇల్లు తగలపెట్టుకోము !
మంచిని వినండి .. మాట్లాడండి . ఆలోచించండి
శుభోదయం !
పోస్ట్ క్రెడిట్ - Amarnath Vasireddy గారు

Post a Comment

0 Comments

Advertisement