బంగ్లాదేశ్ - విప్లవకారులు ముదిరి దేశద్రోహులుగా !

బంగ్లాదేశ్ - విప్లవకారులు ముదిరి దేశద్రోహులుగా !

 విప్లవకారులు ముదిరి దేశద్రోహులుగా !

ఒక దేశం లో రెండు భాగాలు .
వాటి మధ్య దూరం వెయ్యి మైళ్ళు .
ఒక భాగం రెండో దానిపై పెత్తనం .
.... ఇదీ ఒకప్పటి పాకిస్థాన్ .
ఇప్పుడైతే ఒకటే పాకిస్థాన్ .
కానీ అప్పట్లో రెండు పాకిస్థాన్లు.
పశ్చిమ పాకిస్థాన్ . తూర్పు పాకిస్థాన్ .
నాటి తూర్పు పాకిస్థానే యాభై ఏళ్ళ క్రితం బంగ్లాదేశ్ అయ్యింది .
బంగ్లాదేశ్ అంటే బెంగాల్ ప్రాంతం .
ఇంకో మాటలో చెప్పాలంటే తూర్పు బెంగాల్ - ఇదే బంగ్లాదేశ్ .
పశ్చిమ బెంగాల్ మన దేశం లో రాష్ట్రం .
నేటి బంగ్లాదేశ్ వెయ్యేళ్ల క్రితం బౌద్ధ మత ప్రాంతం .
మౌర్య- గుప్త రాజ్యాలనాడే ఇక్కడ బౌద్ధ మతం వెలుగు వెలిగింది .
ఢిల్లీ సుల్తానుల కాలం లో భక్తియార్ ఖిల్జీ ఈ ప్రాంతాన్ని జయించి ఇక్కడ ఇస్లాం మతాన్ని ప్రవేశపెట్టాడు . ఇతను హింసాత్మక విధానాలను అనుసరించాడు .
షా జలాల్, ఖాన్ జహాన్ అలీ అనే సూఫీ గురువుల కాలం లో ఇక్కడ పెద్ద ఎత్తున మతమార్పిడీలు జరిగాయి .
1905 లో బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ బెంగాల్ను మత ప్రాతిపదికన విభజించాడు . ఆ విధంగా తూర్పు బెంగాల్ ఏర్పడింది .
అదే ఇప్పటి బంగ్లాదేశ్ .
1947 దేశ విభజన జరిగింది .
ఇండియా పెద్ద దేశం .
మత ప్రతిపాదికన ఏర్పడిన దేశం పాకిస్థాన్ .
ఇందులో రెండు ముక్కలు . పశ్చిమ పాకిస్తాన్ . తూర్పు పాకిస్తాన్ .
తూర్పు పాకిస్తాన్ ప్రజలు తమ ప్రత్యేకతను నిలుపుకోవాలి అనే కాంక్ష కలిగిన వారు .
వీరిలో ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎక్కువ .
పశ్చిమ పాకిస్తాన్ ఆధిపత్యాన్ని సహించలేక పోయారు .
ఫలితం 1960 లలోనే బెంగాలీ జాతీయ ఉద్యమం మొదలయ్యింది . దీనికి నాయకుడు ముజీబ్ ఉర్ రెహమాన్ .
ఈయన పార్టీ పేరు అవామీ లీగ్ .
తమకు ప్రత్యేక కరెన్సీ, స్వయం పాలన , ప్రత్యేక ఆర్మీ ఉండాలని 1966 లో అవామీ లీగ్ ఆరు పాయింట్ల డిమాండ్ పత్రాన్ని సమర్పించింది .
పశ్చిమ పాకిస్తాన్ నాయకులది అధికార బలుపు. అందుకే పట్టించుకోలేదు
అధికారం లో ఉన్నవారికి కన్ను మిన్ను కానరాదు .
అధికారం తో ఏమైనా చెయ్యొచ్చు అనుకొంటారు .
తాము ప్రజాస్వామ్య యుగం లో ఉన్నామని మరిచి పోతారు .
తమ గొయ్యి తామే తవ్వు కొంటారు .
నెపోలియన్ , పశ్చిమ పాకిస్తాన్ మిలిటరీ నాయకులు..అంతెందుకు విప్లవ బిడ్డ హసీనా ఇప్పుడు చేసింది ఇదే .
మిలిటరీ తో ప్రజా ఉద్యమాలను అణచివేయడం .
1971 లో పశ్చిమ పాకిస్థాన్ ప్రభుత్వం అదే పని చేసింది .
యాహ్యా ఖాన్ పాకిస్తాన్ మిలిటరీ నాయకుడు .
ఇక్కడ ఇందిరా గాంధీ.
అప్పటికింకా ఆమెకు అధికార మదం తలకెక్కలేదు . పేరు- పదవి నిలుపు కోవాలి అనే తపన .
ఆమె తెలివిగా ఈస్ట్ పాకిస్తాన్ కు చెందిన ముక్తి వాహిని కి మద్దతు ఇచ్చి పాకిస్థాన్ రెండుగా విడిపొయ్యేలా చేసింది . పాకిస్తాన్ ను ఓడించింది .
ఫలితం 1971 లో బంగ్లాదేశ్ ఆవిర్భావం .
ముజీబ్ ఉర్ రెహమాన్ బంగ్లా విముక్తి నాయకుడు . ఆయనే తొలి ప్రధాని అయ్యాడు .
కానీ 1975 లోనే ఆయనను మిలిటరీ ఆఫీసర్స్ హత్య చేసారు . ఆయన తన కుటుంబ సభ్యులతో సహా దారుణ హత్యకు గురయ్యాడు .
ఆయన కూతురు షేఖ్ హసీనా .
తండ్రి హత్యకు గురయ్యే నాటికి తన భర్త తో కలిసి జర్మనీ లో చదువుతోంది .
౧౯౮౧ లో ఆమె బంగ్లాదేశ్ కు తిరిగొచ్చింది .
1996 బంగ్లాదేశ్ ప్రధాని అయ్యింది .
2009 హసీనా రెండో సారి ప్రధాని అయ్యింది .
అధికారం మనుషుల్ని మార్చేస్తుంది .
అందునా రెండో సారి అధికారం దక్కితే ఇక విచ్చలవిడి తనమే
ఆమె మెల్లమెల్లగా నియంతగా మారింది .
అవామీ లీగ్ రాజకీయ పార్టీ గా బలహీనం అయ్యింది . ప్రజల నాడి ఈమెకు అందకుండా పొయ్యింది .
మిలిటరీ ... పోలీస్ పై ఆధారపడి 15 ఏళ్లుగా నియంత పాలన సాగిస్తోంది .
పేరుకే ఎన్నికలు .
చాలా మటుకు ఫ్రాడ్ .
పాలకులకు పాలితులకు కనెక్షన్ కట్ అయితే అంతే సంగతులు .
భూకంపం తప్పక వస్తుంది .
జస్ట్ ఏ మేటర్ అఫ్ టైం .
ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి .
పాలనలో ఈమె అనేక మార్పులు తెచ్చింది .
ఇప్పుడు పాకిస్తాన్ అడుక్కునే స్థితిలో వుంది .
కానీ బంగ్లాదేశ్ అలా కాదు .
అనేక ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కాటన్ షర్ట్స్ బంగ్లాదేశ్ లోనే తయారవుతాయి.
కరోనా బంగ్లాదేశ్ ఆర్థిక స్థితిని దెబ్బ తీసింది .
హసీనా కేమో ప్రజల నాడి తెలియకపోయే .
ఈమె భారత అనుకూల విధానాలను అనుసరించింది .
చాలా కాలం పాటు చైనా ఇండియా ఇద్దరితో మిత్రత్వం సాగించింది ..
ఇటీవల ఇండియా వైపు ఎక్కువ మొగ్గు చూపింది .
దీనితో చైనా కు కోపం .
అమెరికా ఎన్నో ఏళ్లుగా ఏదో చెయ్యాలని చూస్తోంది.
ఇప్పటి అల్లర్లకు ప్రధాన సూత్రధారి అమెరికా .
డబ్బులు అక్కడినుంచే వస్తున్నాయి .
అడుక్కునే స్థితిలో ఉన్నా పాకిస్తాన్ కూడా అగ్నికి ఆజ్యం పోస్తోంది .
ప్రజలతో సంబంధాన్ని కోల్పోయిన హసీనా ఒక పిచ్చి చట్టం తెచ్చింది .
విముక్తి పోరాటం పాల్గొన్న వారి మనవళ్లు మనవరాళ్లకు ముప్పై శాతం రిజర్వేషన్స్ .
స్థానిక తెగలకు మరో ముప్పై శాతం .
మొత్తం అరవై శాతం ఉద్యోగాలు రిజర్వేషన్స్ కింద పొతే తమ గతి ఏంటని యువత .
తన పార్టీ వారికీ ఉద్యోగాలు ఇవ్వడం కోసమే మార్పు తెచ్చింది .. దీన్ని రద్దు చెయ్యాలి అని విద్యార్థులు ఉద్యమం మొదలెట్టారు .
పిలిచి మాట్లాడి ఉంటే సమస్య పరిష్కారం అయ్యేది .
.. అధికార మదం తలకెక్కితే వాస్తవాలు కనబడవు .. వినబడవు . అక్కడే కాదు .. ఎక్కడైనా ఇంతే .
జూన్ లో విద్యార్థుల ఉద్యమం మొదలయ్యింది .
సుమారుగా 200 మంది విద్యార్థులు తుపాకీ గుళ్లకు బలయ్యారు .
చివరిగా సుప్రీమ్ కోర్ట్ ఆ రిజర్వేషన్ రద్దు చేసింది .
కానీ అప్పటికే ఆలస్యం .
విద్యార్థులు అధికార మార్పిడి- ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోరుకున్నారు .
దానితో ఆమె దేశం వదిలి పారిపోవాల్సి వచ్చింది .
హిందువుల పై దాడులు .
దేశ జనాభాలో సుమారుగా తొమ్మిది శాతం హిందువులు .
హిందువులు ఏదో ఒక ప్రాంతానికి పరిమితం కాలేదు . అన్ని చోట్లా ఉన్నారు. మారుమూల గ్రామాల్లో కూడా ఉన్నారు .
హిందువుల పై దాడి అనే దానిలో మతకోణం ఒకటి .
అంతకు మించి మరి కొన్ని కారణాలున్నాయి .
హసీనా కాబినెట్ మంత్రులు అవినీతి సామ్రాట్టులు .
వీరందరూ ఇప్పుడు సింగపూర్ మలేషియా అమెరికా లాంటి దేశాలకు పారిపోయారు . వీరందరికీ ఇండియా ఆశ్రయం ఇస్తోంది అనే రూమర్ అక్కడ బలంగా వ్యాపించింది . హసీనా వెనుక వున్నది కూడా ఇండియా అని అక్కడి వారు నమ్ముతున్నారు .
ఈ దాడులు తాత్కాలికం అని హిందువుల భద్రతకు పెద్దగా ముప్పు లేదని నాకు సమాచారం ఇచ్చిన ఒక వ్యక్తి అభిప్రాయం పడ్డారు .ఈయన ఢాకా లో అత్యంత కీలక పదవిలో ఉన్నారు . నేరుగా దేశ ప్రధాని కి ఫోన్ చెయ్యగలిగిన స్థాయి . గ్రౌండ్ లెవెల్ రియాలిటీ పూర్తిగా తెలిసిన వాడు . జులై 25 ప్రత్యేక విమానం లో ఇండియా కొచ్చేసారు.
ఇప్పడేమవుతుంది ?
విద్యార్థులు రాజకీయ పార్టీ పెడితే తప్పక గెలుస్తారు . హసీనా పార్టీ పట్ల ప్రజల్లో ఎంత కోపం ఉందొ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ పట్ల కూడా అంతే ఏవగింపు .
అంతర్జాతీయ కుట్రలు .. ప్రజాస్వామ్య కాంక్ష .. యువతలో అసంతృప్తి .. విప్లవ పథం.. మత ఛాందసవాదం .. ఇన్నింటి కిచ్చిడీ నేటి బంగ్లాదేశ్ పరిణామాలు .
నడుస్తున్న చరిత్ర!

Post a Comment

0 Comments

Advertisement