యురేనస్ గ్రహం .... మూడో ప్రపంచ యుద్ధం...!

యురేనస్ గ్రహం .... మూడో ప్రపంచ యుద్ధం...!

 ఇదేమి సైకిల్ ?

యురేనస్ గ్రహం 84 ఏళ్లకు ఒక్క సారి వృషభ రాశిలోకి ప్రవేశిస్తుందని .. గతంలో 1940 - 48 లో ఇలాగే జరిగిందని... అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం వచ్చిందని , ఇప్పుడు మళ్ళీ ఇలాగే ప్రవేశించిందని .. అందుకే బంగ్లాదేశ్ లో ప్రభుత్వం కూలిపోయిందని... రాబొయ్యే ఏడెనిమిది ఏళ్ళల్లో మన దేశం అత్యంత కిష్ట పరిస్థితిని ఎదుర్కోనుందని , మూడో ప్రపంచ యుద్ధం తప్పదని ఇందులో మన దేశం లో అనేక చోట్ల ప్రళయాలు సంభవిస్తాయని కొంతమంది జ్యోతిష్య పండితులు చెబుతున్నారు .
దీనికి సంభందించి నాకు కొన్ని అనుమానాలు.. ప్రశ్నలు ఉన్నాయి.
1 . యురేనస్ ఒక గ్రహం అని సాంప్రదాయిక భారతీయ జ్యోతిష్య / ఖగోళ శాస్త్రం గుర్తించలేదు . ఇది నిజామా ? కాదా?
2 . కేవలం 1950 లో బి వి రామన్ , కే యెన్ రావు లాంటి జ్యోతిష్య శాస్త్రవేత్తలు యురేనస్ గురించి రాయడం మొదలెట్టారు . అప్పటి దాక దీని గురించిన ప్రస్తావన సాంప్రదాయిక జ్యోతిష్య శాస్త్రం లో ఎక్కడా లేదు . సి . ఎస్ పటేల్, వి కే శాస్త్రి లాంటి వారి రచనల వల్ల 1960 - 70 ల నుంచే భారత జ్యోతిష్య శాస్త్రవేత్తలు దీని గురించి మాట్లాడుతున్నారు .
ఇది నిజామా కాదా?
౩. 1940 - 48 మధ్య రెండో ప్రపంచ యుద్ధం జరిగింది . { యుద్ధం జరిగింది 1939 - 45 } నిజమే . కానీ దాని ప్రభావం మన దేశం పై తక్కువ . జర్మనీ జపాన్ లాంటి దేశాలు దారుణంగా నష్ట పోయాయి . ఇదే సమయం లో మన దేశానికి పరాయి పాలన నుండి విముక్తి కలిగింది . దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ?
4 . 1940 - 48 లో దేశ విభజన నేపథ్యంలో మారణ కాండ జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది అని మీ విశ్లేషణలు . భూమి 1940 లో పుట్ట లేదు . మానవాళి అంతకు ముందు కూడా ఉంది. 84 ఏళ్లకు ఒక్క సారి యురేనస్ సైకిల్ అంటున్నారుగా . అంతకు ముందు సైకిల్ 1856 - 64 కాలం లో . అప్పుడు సిపాయిల తిరుగుబాటు జరిగింది . అది మన దేశానికి మంచే చేసింది . మొదటి స్వతంత్ర సమరం .
దానికి ముందు 1772 - 1780 .. 1688 - 1696 .. 1604 - 12 .. 1520 - 26 ... 1436 - 44 , 1352 - 60 , 1268 - 74 , 1184 - 92 . మరి ఈ సంవత్సరాల్లో ప్రపంచ యుద్ధాలు జరగలేదే? మానవులు నాశనం కాలేదే.
1940 కాలం లో ఒక్క సారి జరిగిందాన్ని పట్టుకొని జెనరలైజ్ చేసేసి జనాలు బయపెట్టేస్తున్నారేంటి స్వామి ?
ఇది జ్యోతిష్యమా? జికే నా ?
లోతుగా చూస్తే పైన పేర్కొన్న సంవత్సరాల్లో 1526 మొదటి పానిపట్టు యుద్ధం తప్పించి ఒక మాదిరి యుద్ధాలు కూడా జరగలేదు .
మరి యురేనస్ ప్రభావం ఏమైంది ?
అప్పటికి తనను గుర్తించలేదని యురేనస్ కిమ్మనకుండా ఉండి పోయాడా ?
ఏమీ లేదండీ .. మా ప్రాణానికి .. ఇప్పటికే మీడియా .. ఫార్మాసూరులు తయారయ్యారు . ఆ వైరస్ .. ఈ వైరస్ ..చచ్చి పోతారు .. అని భయపెడుతున్నారు .
ఇప్పుడు వారికి తోడు మీరు తయారయ్యారు . మీలో కొంతమంది ప్రపంచ యుద్ధం గ్యారెంటీ అని జ్యోతిష్యం లెక్కలు చెబుతున్నారు .
నేను జ్యోతిష్యాన్ని నమ్ముతాను .
కానీ సమస్య ఏమిటంటే దాని పై నాస్తికుల దాడికంటే కొంతమంది సో కాల్డ్ జ్యోతిష్యుల దాడి ఎక్కువగా ఉంది . కుసింత పబ్లిసిటీ వస్తే చాలు అనుకోని సోషల్ మీడియా లో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు .
నేను డాక్టర్ కాదు .
కరోనా కాలం నన్ను బలవంతంగా రోగాల గురించి మాట్లాడేలా చేసింది .
జనాలు అందరూ బాగుండాలి అనే బలహీనత .. అంతే..
ఇప్పుడు జ్యోతిష్యం పేరుతొ మీరు మాస్ టెర్రర్ క్రియేట్ చేస్తే నేను జ్యోతిష్యం గురించి మాట్లాడుతా .
తెలివి దేవుడిచ్చిన వరం .
జనహితం కోసం దాన్ని వాడుతా .
మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా? రాదా? అనేది వేరే టాపిక్ .
మీరు జీకే ని.. జ్యోతిష్యాన్ని రంగరించి జనాల్ని భయబ్రాంతులకు గురి చెయ్యడం పైనే ఈ పోస్ట్ .
ఎలాగూ దిగానుగా.. చెబుతా .. సేవ్ చేసుకోండి .
యురేనస్ రోహిణి నక్షత్రం లో ప్రవేశిస్తే ..
✅జీవితం లో సరి కొత్త మార్పులు .. మార్పులు ఆంటే చెడుకు అని అనుకొంటే అది శాడిజం . నేను మంచికి ఆనుకొంటా . కాదని చెప్పండి .
✅శాస్త్ర సాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కరణలు .. నిజమేగా కృతిమ మేధ రానుంది .
✅పునరుజ్జీవం .. స్పిరిచువల్ గ్రోత్ .. వాసిరెడ్డి అమర్నాథ్ కూడా ఆస్ట్రాలజీ గురించి చెబుతున్నదంటే అదే అనుకోవచ్చుగా .
✅విప్లవాలు .. సంక్షోభం .. ఇది మంచి కోసమే అనుకోవచ్చుగా ?
సర్వే జనా సుఖినోభవంతు !
యుద్ధం గ్యారెంటీ .. ఎంతో మంది చచ్చిపోతారు అని సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న ఫేక్ జ్యోతిష్యం పై నా బాణం ఇది .
అంతే గానీ నాకు జ్యోతిష్యం రాదు .
ఎంతో మంది మహనీయులు పబ్లిసిటీ కి దూరంగా ఈ పవిత్ర వృత్తిలో ఉన్నారు.
వారికి వందనాలు .

credit goes to Amarnath Vasireddy sir

Post a Comment

0 Comments

Advertisement