కృత్రిమ మేధ యుగం లో ఛాంపియన్స్ గా నిలవాలంటే...!

కృత్రిమ మేధ యుగం లో ఛాంపియన్స్ గా నిలవాలంటే...!

 ఆధునిక మయ సభ !

ప్రపంచం లో అత్యంత ఖరీదయిన భోజనశాల ఏదో తెలుసా ?
స్పెయిన్ దేశంలోని.. సబ్లిమేషన్ .
ఇక్కడ సగటున వ్యక్తికి ఒక భోజనానికి అయ్యే ఖర్చు కేవలం రెండు లక్షల యాభై వేల రూపాయిలు .
సంవత్సరంలో కేవలం మూడు నెలలు మాత్రం దీన్ని తెరిచి ఉంచుతారు .
ఈ రోజు ఆదివారం .
లంచ్ కి మిమ్మల్ని మీ కుటుంబం మొత్తాన్ని అక్కడికి తీసుకొని వెళ్లి .. మీరు కోరిన వంటకాలు తినిపిపించి... బిల్లు నేనే కడుతాను .
మీరు రెడీనా ?
ఇదేందీ??? బంపర్ ఆఫర్ అనుకొంటున్నారా ?
నిజంగా కాదండి .
వర్చువల్ గా ..
కృత్రిమ మేధతో ఒక వీడియో తయారు చేస్తాను .
మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఈ రెస్టారెంట్ కు వెళ్లినట్టు... అక్కడ విందు భోజనం చేసినట్టు ....
దీన్ని చూస్తూ ఈ రోజు లంచ్ మానేస్తారా?
ఏదో తమాషాకి ఒక రోజు ఇలా చెయ్యొచ్చు .
కానీ అదే పనిగా చేసే వాడు... పిచ్చోడు అయ్యి ఉండాలి .
ఒప్పుకొంటారా?
మీ ఇంట్లో పిలల్లు ఉన్నారా?
అయితే వారిని అడగండి .. రాబొయ్యే వారి పుట్టిన రోజు వేడుకను ఎలా చెయ్యాలి ?
మహేష్ బాబు , ప్రభాస్, అల్లు అర్జున్, సల్మాన్ ఖాన్ ఇంకా అనేక మంది సినీ హీరోస్ , క్రికెట్ స్టార్స్ తో గ్రాండ్ గా హైదరాబాద్ ఫలక్ నుమా పాలస్ లో "ఆడా " భోజనశాలలో హైదరాబాద్ దమ్ బిర్యానీ లాంటి వాటితో సెలెబ్రేట్ చేసుకొంటారా?
లేక ఇంట్లో తోటి ఫ్రెండ్స్ తో నా ?
ఆగండాగండి .
మొదటిది కేవలం వర్చువల్ రియాలిటీ .
కృత్రిమ మేధ సాయం తో ఇలాంటి ఫిలిం ఒకటి తయారు చేసి వారికి చూపించి అదే పుట్టిన రోజు వేడుక అనుకోమనండి . లేదంటే ఇంట్లో నిజంగానే వేడుక .. కాకపోతే జస్ట్ కేక్ .. ఐస్ క్రీం .. ఇరుగు పొరుగు పిలల్లు .. దగ్గర బంధువులు .
రెంటిలో ఏది కావాలో కోరుకొమ్మని అడగండి .
నూటికి తొంబై మంది వాస్తవికతనే కోరుకొంటారు .
కదా ??
మయసభకు ఆహ్వానం .
దానవీరసూరకర్ణ సినిమా చాలా మంది చూసే ఉంటారు.
అందులో మయ సభ ఘట్టం మరచి పోలేము .
లేనిది ఉన్నట్టు చూపించేదే మయసభ .
ఆ రోజుల్లో కృతిమ మేధ లేదు . అలాంటి అద్భుత మాయలోకాన్ని సృష్టించడం మయుడికే సాధ్యపడింది .
ఇప్పుడు .. ఇంకా ఐదారేళ్ళ ఆగితే మనం కూడా మన ఇంట్లో మయసభ ను ఏర్పాటు చేసుకోవచ్చు . కాకపోతే ఒక విషయం . ఏదీ నిజం కాదు .. అంత మాయ. భ్రమ.. వర్చువల్ రియాలిటీ .
ఏదో తమాషా కోసం కాసేపు బాగానే ఉంటుంది .
కానీ ..అదే బతుకైతే ?
రాబొయ్యే రోజుల్లో ..
చాలా మంది లోహాలను పెళ్లి చేసుకొంటారు .
అదేనండి ఆండ్రాయిడ్ రోబోస్ .
దాన్నే భార్య / భర్త అనుకొంటారు .
సంసారం చేస్తారు .
అది తన మాటకు అడ్డు చెప్పదు. తన మనసుకు నచ్చినట్టు చేస్తుంది .
అదే నిజంగా మనిషిని పెళ్లి చేసుకొంటే మనస్పర్హలు .. కీచులాటలు .. బ్రేక్ అప్ లు .
ఇలాంటి వాళ్ళను ఏమనాలి ?
ఆండ్రాయిడ్ రోబో అయినా కనీసం కంటికి ముందు తిరిగే ఒక వస్తువు .
వర్చువల్ రియాలిటీ పద్దతిలో ఒక స్నేహితుడు / స్నేహితురాలి ని ఏర్పాటు చేసుకొంటారు . రాబొయ్యే రోజుల్లో స్క్రీన్ కూడా అక్కర లేదు .బొమ్మ మన ముందు నిలుస్తుంది .
కూర్చుంటుంది .
మాట్లాడుతుంది .
మనల్ని ఓదార్చుతుంది . పాటపాడుతుంది. కబుర్లు చెబుతుంది . డాన్స్ చేస్తుంది . మన మనసుకు తగ్గట్టు నడుచుకొంటుంది .
కేవలం స్నేహితుడు / స్నేహితురాలేనా? విర్చువల్ రియాలిటీ లో అమ్మ . నాన్న . కొడుకు.. కూతురు.. కుక్క పిల్ల .. ఇలా ఎవరినైనా ఇంటికి రప్పించుకోవచ్చు . ఎన్ని గంటలు కావాలంటే అన్ని గంటలు గడపొచ్చు .అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే అన్నాడు సినీ కవి . కానీ ఏఐ యుగంలో కృతిమ అమ్మలొస్తారు .
మీకు నచ్చిన హీరో / హీరోయిన్ మీ ఇంటికొచ్చి.. మీ బెడ్ పైకి వచ్చి .. మీరు కోరినట్టల్లా చేస్తే ఎలా ఉంటుంది . ఎస్ .. మరి కొన్నేళ్లల్లో మీ ఫాంటసీ హీరో / హీరోయిన్ ను కృత్రిమ మేధ సాయం తో తో మీ ఇంటికి రప్పించుకోవచ్చు . గంటలు గంటలు గడపొచ్చు . మాట్లాడొచ్చు . రొమాన్స్ చెయ్యొచ్చు .. ఇంకా ఇంకా ..
ఇదే బతుకు అనుకునేవాళ్లు ఉంటారు .
ఒకరో ఇద్దరో కాదు .. వోడ్కా వర్మ స్కూల్ అందరిదీ ఇదే బతుకు
లోహాలతో కాపురం చేసేవారు .. విర్చువల్ రియాలిటీ లో బతికే వారు .. భవిషత్తులో లక్షలాది మంది కనిపిస్తారు . వీరు కృత్రిమ మేధ యుగపు హిప్పీ లు.
1970 లలో ఇల్లు వాకిలి వదిలి చింపిరి బట్టలు వేసుకొని గంజాయి కొడుతూ సామహిక జీవితాన్ని గడుపుతూ దేశంపై పడి దిమ్మరులుగా బతికేసారు . ఇదే భవిషత్తు అని ఆ రోజుల్లో కొంత మంది పిచ్చి ప్రేలాపన లు చేసారు .
సీన్ కట్ చేస్తే... ఇప్పుడేమైంది .
హిప్పీ లు లేరు .
ఇలాంటి కుక్క మూతి పిందెలను ప్రపంచం చాలా చూసింది .
టెక్నాలజీ మానవ జీవితాలను పెద్ద మొత్తం లో మార్చేస్తుంది .
మనిషి నలభై లక్షల సంవత్సరాల క్రితం రాతి ని పనిముట్టుగా వాడినప్పుడే సాంకేతిక పయనం మొదలయ్యింది .
సాంకేతికత మనిషి చేతిలో సాధనం .
కొత్త సాంకేతిక పరిజ్ఞానం వచ్చినపుడు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక కొంతమంది దానికి బానిసలు అయిపోతారు .
రేండేళ్ల పిల్లాడి చేతికి మొబైల్ ఇచ్చి .. "అబ్బో మా వాడు ఎంత స్మార్ట్ " అనుకొనే తల్లితండ్రులు . రోజంతా మొబైల్ గేమ్స్ ఆడుతూ అదే లోకం అనుకొని చదువును నాశనం చేసుకొని మానసిక శారీరిక ఆరోగ్యాన్ని పాడుచేసుకొనే పిల్లలు... . భార్యను బెడ్ రూమ్ లో వదిలేసి పోర్న్ స్టార్ తో ఊహల్లో సంసారం చేస్తూ లాప్ టాప్ ముందు చేతికి పని చెప్పే స్వయం తృప్తి గాళ్ళు .. కోకొల్లలుగా ఉన్న ప్రపంచం ఇది .
తొండ ముదిరి ఊసర వెళ్లి అయినట్టు .. ఇలాంటి వాళ్ళందరూ కృత్రిమ మేధ యుగం లో న్యూరో నోమాడ్స్ { అంటే పిచ్చెక్కిన దిగంబర గాళ్ళు} గా మారి లోహాల్ని వివాహం చేసుకొని ఊహల్లో కాలం గడిపేస్తూ అదే బతుకనుకొని మానసిక శారీరిక రోగాలతో చచ్చి పోతారు . మానవ జనాభా తగ్గుదలకు దోహదం చేస్తారు .
అటు పై అంతా సర్దుకుంటుంది . కృత్రిమ మేధ హిప్పీ లు అదే న్యూరో నోమాడ్స్ కాలగర్భం లో కలిసిపోతారు .
పరిణామ క్రమ సిద్ధాంతంలో ప్రకృతి వరణం అంటే నేచురల్ స్లేలెక్షన్ అనేది ఉంది. ఎవరు బతకాలో ఎవరో కాలగర్భంలో కలిసిపోతారో ఇదే నిర్ణయిస్తుంది . ఇప్పుడు కృతిమ మేధ వరణం . మయసభ లో నిజమయిన బతుకు అనుకొనే న్యూరో దొమ్మరిగాళ్లు విలుప్తం అయిపోతారు . ఇదొక దశ. సంధి కాలం .
మీ ఇంటి పిల్లలు కృత్రిమ మేధ యుగం లో ఛాంపియన్స్ గా నిలవాలంటే వారికి..
రియల్ లైఫ్ ఏంటో చూపండి .
నిజ జీవితం అర్థం అయ్యే వరకు అంటే కనీసం 18 ఏళ్ళ వారికి మొబైల్ పరికరాలు ఇవ్వొద్దు .
లైఫ్ అంటే సంతోషం .. సంతోషం అంటే సామాజిక భావోద్వేగ తేలితేటలు .. క్రిటికల్ థింకింగ్ .. లాటరల్ థింకింగ్ .. సృజనాత్మకత . సహానుభూతి అని నేర్పండి .
కృతిమ మేధతో స్మార్ట్ సిటీ లు, స్మార్ట్ ఇళ్ళు. కాలుష్యకారకం కాని ఇంధన , రవాణా వ్యవస్థ , మీరు ఎక్కడున్నా మీ ఆరోగ్యాన్ని కనిపెట్టే సెన్సార్లు .. మీ దగ్గరికే ఎగిరొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చే మేడి డ్రోన్స్ .. రోబో డాక్టర్లు .. నగరాల్లో నిలువుటెత్తు వ్యవసాయ క్షేత్రాలు ..
ఒక్క మాట లో చెప్పాలంటే నిజమయిన స్వర్గం మనముందు నిలవనుంది .
కృతిమ మేధ.. అద్భుత అవకాశం ..
కృతిమ మేధ . ... పెను సంక్షోభం .. .
కృత్రిమ మేధ .. మెడలో బంగారు పథకం ..
కృతిమ మేధ .. మెడకు ఉరి..
ఎలా ఉపయోంచుకోవాలి అనేది పూర్తిగా మన చేతుల్లో .
నిర్ణయం మీదే.
ఈ మెసేజ్ ను మీ మీ వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేసుకోండి .
సర్వే జనా సుఖినోభవంతు .
వాసిరెడ్డి అమర్నాథ్ .

Post a Comment

0 Comments

Advertisement