ఆగస్టు 9 వ తేదీన
జూనియర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ ఘటన కోల్కతాలో జరిగింది.ఈరోజుకి కూడా కొంతమందికి తప్ప చాలా మందికి తెలీదు.
ఈ సోది మనకెందుకు అనుకునేవాళ్ళు ఈ పోస్ట్ చదవటం ఇక్కడే ఆపెయ్యండి.
ఈ రేప్ అండ్ మర్డర్ కేసులో సామాన్యుల కంటికి పైకి కనిపించని చాలా విషయాలు దాగి వున్నాయా...?
ఎక్కడో అటవీ ప్రాంతమో .. మానవ సంచారం లేని మారుమూల ప్రాంతమో కాదు .
24 గంటలూ రోగులు , వైద్య సిబ్బందితో కిటకిటలాడే ఆసుపత్రి.పచ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో
డ్యూటీలో ఉన్న ట్రైనీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్....
ఆమె గర్భ సంచిలో 150 మిల్లి లీటర్ల వీర్యం .
అంటే కనీసం ఆరేడుగురు ఆమెను పాశవికంగా అనుభవించారు(rape).
ఇప్పుడు ... కాదు కాదు .. అది వీర్యం మొత్తం కాదు .. ఆమె గర్భసంచి బరువు అంటున్నారు . సరే ఈ పాయింట్ వదిలేద్దాము.
కాళ్ళు విరిచేసారు.మెడ ఎముక విరిగిపోయింది.కళ్లలోనుంచి రక్తం .
శరీరమంతా నల్లటి గాయాలు .
ఫోరెన్సిక్ సైన్స్ లో బుడ్డోడు కూడా చెబుతాడు ....
ఇది కేవలం రేప్ కాదు . ఆసుపత్రిలోని మిగతా డ్యూటీ డాక్టర్ లను భయభ్రాంతులను చేయడానికి ఉద్దేశించింది అని.
" ఈమె లాగా మీరు కూడా తెలిసిన విషయాలను బయటకు చెబితే ఇంత దారుణంగా చంపేస్తాము" అని తీవ్ర హెచ్చరిక .
ఆమె శరీరం అంత దారుణ స్థితిలో పడివున్నా , ఆత్మ హత్య చేసుకొందని తల్లితండ్రికి ఫోన్ . ఈ ఒక్క పాయింట్ చాలు . ఆ ఫోన్ చేసిన వారికి చేయించిన .. వారికి నేరంలో పాత్ర ఉందని చెప్పడానికి.
అంతేనా ?
ఇంకా చాలా వున్నాయి .
ఉన్నట్టుండి అత్యాచారం జరిగిన స్థలంలో రిపేర్ లు చేయించారు .
సాక్ష్యాలనులను కనుమరుగు చేసే ప్రయత్నం జరిగిందని ఠక్కున అర్థం అయిపోతుంది .
ఆగస్టు 13 వ తేదీన బెంగాల్ ప్రభుత్వ అసమర్ధతని తప్పు పడుతూ కేసుని CBI కి అప్పగించమంటూ బెంగాల్ హైకోర్టు ఆదేశాలిచ్చింది.
ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి
నిరసన కారుల ముసుగులో వేలమంది (దాదాపుగా 7000 మంది అని అంచనా. నేషనల్ న్యూస్ and బెంగాల్ పోలీస్ అంచనా ప్రకారం) ఆసుపత్రి పై దాడి చేసి మిగిలి ఉన్న సాక్ష్యాలను ధ్వంసం చేసేశారు.
అరే ఘటన జరిగిన ప్రదేశాన్ని జాగ్రత్తగా కాపు కాయాల్సింది పోలీసు వ్యవస్థ.
వేలమంది గుమికూడుతున్నారు అంటే జాగ్రత్త పడి లా అండ్ ఆర్డర్ పర్యవేక్షించాల్సింది.. రాష్ట్ర ఇంటెలిజెన్స్...
మీరంతా... ఏం చేస్తున్నారు...?
*రాజకీయానికి పరాకాష్ట*
ఇక్కడ ఆఁ రాష్ట్రముఖ్యమంత్రి డ్రామా మొదలెట్టింది.
ఒక ఆడకూతురు ..
పని స్థలం లో ఇంత దారుణంగా అత్యాచారానికి గురైనా కేసులో ఇంకా పెద్దగా ఏమీ పురోగతి లేదు.దొంగను పట్టుకోండి అని అన్ని రాజకీయ పార్టీలవారు దబాయిస్తున్నారు .
ముఖ్యమంత్రి భాద్యత... లా అండ్ ఆర్డర్ మెయిన్టైన్ చేయడం . దోషులను పట్టుకోవడం .
రోడ్డు ఎక్కి నిరసన తెలియచేయడం ఏంటి ?
జనాలు మరీ అంత ఎర్రిపుష్పాలుగా కనిపిస్తున్నారా?
మనకో రాజ్యాంగం .. పార్లమెంట్ . సెంట్రల్ కాబినెట్ .. ఆర్మీ , నేవీ, ఎయిర్ ఫోర్స్, పారామిలటరీ దళాలు, సుప్రీమ్ కోర్ట్ .. రాష్ట్రాల్లో కాబినెట్ .. హై కోర్ట్ .. పోలీస్ .. ఇంకా ఇంకా చాలా ఉన్నాయి.
ఈ వ్యవస్థలన్నీ మనం కట్టిన పన్నులతో బతికేవే .
మనకు రక్షణ కల్పించడం వాటి కనీస భాద్యత .
నగరం నడి బొడ్డున డ్యూటీ లో ఉన్న డాక్టర్ పై ఇంత ఘోరం జరిగి వారం రోజులు దాటినా ఇంకా పూచిక పుల్లంత కదలిక లేదు .
ఆ ఆసుపత్రి అధిపతిని విచారించాలి.(ఆఁ అధిపతి ఆఁ రాష్ట్ర ముఖ్యమంత్రికి సన్నిహితుడని విమర్శలున్నాయి.ఇది కూడా నేషనల్ మీడియా న్యూస్ లో ఉన్న దాని ప్రకారమే అంటున్న విషయం) ఆఁ అధిపతిని విచారంచండి.విచారణ లో లాఠీకి వేడి నూనె పూసి కారంలో అద్ది ఎక్కడ పెట్టాలో (పోలీసులకు తెలుసు) అక్కడ పెడితే ...కెవ్వుమని నిజం చెప్పడా.....? ఎందుకు... బెంగాల్ పోలీసులు ఆఁ పని చెయ్యలేదు...?
అర్జెంటు గా ఆ ఆసుపత్రి రిపేర్ చెయ్యాలని ఆదేశాలు ఇచ్చింది ఎవరు ?వారిని విచారించరా...?
ఏడు వేలమందిని సమీకరించింది ఎవరు తెలుసుకోవడానికి ఫోన్ లిస్ట్ లు వెలికి తీస్తే వివరాలు రావా..?
ఒక నిజాయతీ అధికారి .. కేవలం డిఎస్పీ స్థాయి చాలు.మూడు గంటల్లో నిజం కక్కిస్తాడు.
కానీ ఇవేవీ చెయ్యని బెంగాల్ ప్రభుత్వాన్ని హైకోర్టు విమర్శించి... కేసు CBI కి అప్పగించింది.
వెంటనే... ప్రజల్లో ఎక్కడ వ్యతిరేఖత వొస్తుందో అని మమతా అక్క.. పెద్ద డ్రామాకి తెర తీసింది.
అమె సాధారణ వ్యక్తి కాదు .
ఆ రాష్ట్రానికి ఎంతో కాలంగా ముఖ్య మంత్రి .
నేరము శిక్ష గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి .
సిబిఐ ఎక్కడైనా ఉరేస్తుందా అక్కో ??
సిబిఐ నేరస్తులను కనిపెట్టి న్యాయస్థానం ముందు ఉంచాలి .
తరువాత కేసు విచారణ .. వాయిదా ..
చాలా ఫాస్ట్ గా జరిగితే ఆరునెలలు .
సాక్షాత్తు ఒక రాష్ట్ర సీఎం హోమ్ మంత్రి కూడా ఆమే..." ఆదివారం లోగా నిందితుల్ని సిబిఐ ఉరివెయ్యకపోతే ఆందోళన చేపడుతాను" అని ప్రకటించడం ఏంది అక్కో ?
ఇంకా ఆమె రాష్ట్రంలో జరిగిన రేప్ అండ్ మర్డర్ పయిన ఆ రాష్ట్ర హైకోర్ట్ ఆమె ప్రభుత్వం మీదే విమర్శలు చేస్తే... ఆమె.. రోడ్డెక్కి నిరసన తెలుపుతుంది.ఇదేం విడ్డూరం.. ఇదేం రాజకీయం.. ప్రజలు మరీ అంత ఎర్రిపుష్పాలులాగా కనిపిస్తన్నారా... దీదీ...?
చెయ్యాల్సిన కర్తవ్య నిర్వహణ చెయ్యకుండా కేవలం పత్రికా ప్రకటనలు... రోడ్లపై నిరసనలు మాత్రం చేస్తే .. అదో పెద్ద డ్రామా అని అందరికీ అర్థమయి పోతుంది.ప్రజలను తెలివిని తక్కువ అంచనా వేయకండి . వడ్డీతో సహా చెల్లించేస్తారు .
*డాక్టర్లు ఎందుకు సమ్మె చేస్తున్నారు ?*
"డ్యూటీ లో ఉన్న జూనియర్ డాక్టర్ అత్యాచారానికి హత్యకు గురయ్యారు . మాకు భద్రత లేదు .." అని కదా ?
ఈ సమ్మె కు సంఘీభావం తెలిపే వారు ఏమి చేస్తారు ?
నిరసన ప్రదర్సన , డాక్టర్ లకు మద్దతు తెలుపుతారు .
అంతే కదా ?
ఏ ఆసుపత్రిలో అయితే అత్యాచారం జరిగిందో దాని పైనే దాడి చేస్తారా ?
అందునా అత్యాచారం జరిగిన సెమినార్ హాల్ పై దాడి చేసి అక్కడి అధారాలు చెరిగి పొయ్యేలా చేస్తారా ?
చెయ్యరు.
ఆలా చేసారంటే వారి ఉద్దేశం వేరే అని అప్పుడే పోలీస్ శాఖలో చేరిన కానిస్టేబుల్ కూడా కనిపెట్టేస్తాడు . కదా ?(వారు అంటే ఆఁ డాక్టర్స్ తో పాటుగా నిరసనలో పాల్గొన్న అసాంఘిక శక్తులు అని)
"అబ్బే లేదు .. సెమినార్ హాల్ పై దాడి చెయ్యలేదు" అని రాష్ట్ర పోలీస్ శాఖవారు చెప్పారనుకోండి. (అనుకోండి కాదు.. అదే చెప్పారు)
అక్కడ ఆధారాలు చెరిపేసి నేరస్తులకు సాయం చెయ్యడానికే ఇదంతా జరిగింది అని అనుకోవచ్చుగా ?
అది చిన్నా చితకా ఆసుపత్రి కాదు . ఎవడో ఆకతాయి తాగిన మైకంలో వచ్చి అఘాయిత్యం చేసుంటే అక్కడి డాక్టర్ లు ఆ విషయాన్ని చెప్పివుండేవారు . ఎవరూ నోరు మెదపడం లేదు . కారణం... భయం . ఆకతాయి కి అందునా ఇప్పుడు పోలీస్ అదుపులో ఉన్నవాడికి అంత మంది భయపడరు .
దీన్ని బట్టి అర్థం అయ్యేదేమిటంటే అక్కడ జరిగిన క్రైమ్ లో ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామంది పాత్ర ఉంది.
సెక్స్, డ్రగ్స్ , మానవ అవయవాల విక్రయం ఆసుపత్రి నుంచి సాగుతోంది అని ఆరోపణలు వస్తున్నాయి . అంటే అక్కడి డాక్టర్ లు కొంతమంది,పై స్థాయి రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఇవన్నీ జరుగుతాయా ?
అక్కడ నోరు విప్పాలంటే జనాలకు భయం .
అందుకే అందరూ కిమ్మనకుండా ఉన్నారు.
వెయ్యి గొడ్లు తిన్న రాబందు ఒక్క గాలివానకు చచ్చిందంట.ఇక్కడా అలాగే జరిగేట్టు వుంది. పొయ్యే కాలం వస్తే అంతే.
ఒకటి నిజం .. రాజకీయాల్లో హత్యలుండవు .. ఆత్మహత్యలే .
ఏమున్నదక్కో .. ఏమున్నదక్కో ?..
చూద్దాం సీబీఐ విచారణలో ఏ దారుణాలు బయటకి వస్తాయో.
ఇవన్నీ ఏ మీడియా చెప్పదు.ఎందుకంటే మీడియా అంతా రాజకీయ నాయకుల గుప్పెట్లో కనుసన్నల్లో నడుస్తుంది.
ఈ వ్యవహారం లో స్థానిక పోలీస్ లు ప్రభుత్వ యంత్రాంగం సహకరించకపోతే 356 అధికారం ప్రకారం రాష్ట్రపతి పాలన విధించాలి .
ఇక్కడ ఎవ్వరూ బయటకి మాట్లాడని విషయాలు కొన్ని వున్నాయి
మానవ అవయవాల అక్రమ సేకరణ , విక్రయం , డ్రగ్స్ .. ఇవేనా బెంగాల్ యువ డాక్టర్ హత్యకు దారి తీసిన కారణాలు....?
ఎన్నో ఏళ్లుగా సాగుతున్న దందాను బయటపెడుతాను అని చెప్పినందుకే ఆమెను చంపారా ?
చూద్దాము సిబిఐ విచారణ లో ఏమి తేలుతుందో... !
కానీ మీ పిల్లలకి చెప్పండి... తస్మాత్ జాగ్రత్త... మీకోసం ఎవరూ రారు... మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి... మీరే సాటి వ్యక్తి కోసం నిలబడాలి, ఇలాంటివి జరిగినప్పుడు ఎమోషన్ తో కొవ్వొత్తుల ర్యాలీలు
చేసి, డీపీ లు పెట్టుకుని, సోషల్ మీడియా లో పోస్ట్ చేసి రాత్రికి బిర్యానీ తిని పడుకోవద్దు, ప్రతీక్షణం అప్రమత్తంగా అవగాహనతో జాగరూకులై వుండండి అని
పోస్ట్ లో ఎక్కువ భాగం విద్యావేత్త శ్రీ Amarnath Vasireddy గారి వ్యాఖ్యలకి నా వ్యాఖ్యలు జోడించి వ్రాశాను
0 Comments