సనాతన ధర్మపరిరక్షణ బోర్డు లో ఎవరు ఉండాలి.. ఏ హిందూ నాయకులూ ఆ బోర్డు లో ఉండి , హిందూ దేవాలయాలను పరిరక్షించుకోవాలి .
కాపుల్లో ఉండే హిందువులా ..?
కమ్మల్లో ఉండే హిందువులా?
రెడ్లల్లో ఉండే హిందువులా ?
రాయలసీమ హిందువులా లేక కోస్తా హిందువులా ...?
మాట పట్టింపు కోసమై గల్లీ గల్లీ లో వినాయకుడి బొమ్మ పెడుతున్న హిందువులం మనం.
మా ప్రాంతానికి, మా కులం వారి సరైన స్థానం ఇవ్వలేదని
ఇదే బోర్డు లో పొరపచ్చాలు రాకుండా ఉంటాయా. , విమర్శలు చేసుకొని గబ్బు గబ్బు చేయరని నమ్మకమా
సరే , పీఠాధిపతులకి బోర్డు లో స్థానం ఇవ్వాలంటే
తెలుగు రాష్ట్రాల్లో అన్ని పీఠాధిపతులు రాజకీయనాకులకి పొర్లుదండాలు పెట్టినవారే
జియ్యర్లకి ఇస్తే అయ్యర్లకి కోపం, అయ్యర్లకిస్తే జియ్యర్లకి మంట ..
ఉత్తరాదివారికి ఇస్తే ఇంకో తంటా.
0 Comments