డియర్ జగన్ ఇది మీ పైన అభిమానిగానో, వ్యతిరేకి గానో లేక టీడీపీ అభిమానిగానో రాయడం లేదు .. సగటు తటస్థ వాడిగా రాస్తున్నాను
ఎవరు సార్, మీకు సలహాలు ఇస్తున్నది? మిమ్మల్ని రాంగ్ రూట్ లో నడిపిస్తున్నది? మీరు ఆలోచించరా? సెల్ఫ్ గోల్స్ రప్ప రప్పా వేసుకుంటున్నారు ఎందుకు?
గత రెండు పర్యటనలను చూసాను, జాలి,బాధ, వేస్తుంది . ఎందుకు ?
మొదట ఘటన ....
తెనాలి పర్యటనకు వచ్చారు! తీరా చూస్తే వాళ్ళు ముగ్గురు రౌడీ షీటర్లు అట! పోలీసులు అలా రోడ్డుపై శిక్ష వేయడం ముమ్మాటికీ తప్పు! మీరు ప్రశ్నించాల్సింది అలా శిక్ష వేయడాన్ని! మీరు తప్పు పట్టాల్సింది ఆ పోలీసుల దుశ్చర్యను! మీ ప్యాలెస్ లోనే ప్రెస్ మీట్ పెట్టి ఖండిస్తే బావుండేది! అంత దానికి వేలాదిమందిని వేసుకుని వారింటికి వెళ్లి పరామర్శించడానికి వారేమన్నా కడిగిన ముత్యాలా? పక్కా రౌడీ షీటర్లు!
పార్టీ కార్యకర్తలై ఉండొచ్చు కానీ, వెనకా ముందు అలోచించి అడుగులు వేయాలి! పోనీ పాపం, ఆ ముగ్గురి కుటుంబాలకు కనీసం ఒక్కొక్కరికి ఐదు లక్షలు అయినా ఇచ్చి ఉంటే ఓదార్పుకు అర్ధం ఉండేది!
రెండో ఘటన ....
నిన్నా అంతే! రెంటపాళ్ళ వెళ్లారు! వెళ్లేముందు అతని హిస్టరీ తెలుసుకోవాలిగా! మీరు గెలుస్తారని 30 కోట్లు బెట్టింగ్ పెట్టిన వీరాభిమాని! ఎన్నికల ఫలితాల మరుసటి రోజే ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుని, నాలుగు రోజుల తరువాత చనిపోయాడు! అంటే అప్పుడు ప్రభుత్వం మీ హయాంలోనే వుంది! అతనికి విగ్రహం ఏర్పాటు ఏమిటో!
ఈరోజు మీటింగ్ లో మాట్లాడిన మాటలు చుస్తే 11 సీట్స్ ప్రభావం నుండి ఏమైనా నేర్చుకున్నవేమో అని , ఉహు మారలేదు మీరు, మారతారు అనే నమ్మకం లేదు .. లేకపోతే అదేమి వ్యాఖ్య… ఎవడో కార్యకర్త రప్పారప్పా నరుకుతాం అని ప్లకార్డు ప్రదర్శిస్తే పోలీసులు కేసు పెట్టారు… సరే, దాన్నెందుకు జగన్ సమర్థించడం, ఏమిటా భాష..? ఏమిటా ధోరణి..? ఇంకా ఆ ధోరణిని రెచ్చగొట్టడమా..?
ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, దాని సమర్థంగా ఎదుర్కొంది,ప్రజల్లో తిరగండి, జనంలో మీకు అభిమానం ఉంది, ఇలాంటి అనవసర పర్యటనలకు వెళ్లి అనవసరంగా మీ అభిమానాన్ని చెడగొట్టుకోకండి , నష్టం మీకే . చివరికి జననేతగా ఉంటారో , జనాలు మరచిపోయే నేత అవుతారో మీ చేతులలో, చేష్టలతో కాలం సమాధానం చెప్తుంది .. !
0 Comments