వొంట్లో లో షుగర్ - ఇంట్లో బాధలు !
చిన్న పిల్లల మెదడులో షుగర్ ఎక్కువైతే - ADHD { హైపర్ ఆక్టివిటీ డిసార్డర్ }
పెద్దల మెదడులో షుగర్ ఎక్కువైతే - డెమెన్షియా { మతి మెరుపు వ్యాధి }.
కంట్లో షుగర్ - గ్లూకోమా
దంతాల్లో షుగర్ - పన్ను పుచ్చిపోవడం
చర్మం లో షుగర్ - చర్మం మడతలు .
నిద్రలో షుగర్ - నిద్రలేమి { ఇన్సొమ్నియా }
రక్తం లో షుగర్ - డయాబెటిస్
శరీరంలో అధిక షుగర్ - కాన్సర్ .
ఆహారంలో అధిక షుగర్ - బిలియన్ డాలర్ ఫుడ్ ఇండస్ట్రీ .
సమాజంలో అధిక షుగర్ ను చొప్పించడం - ఫార్మసురుల తంత్రం .
పిజ్జా , బర్గర్ , కోక్ , పెప్సీ మాజా లాంటి డ్రింకులు - పూర్తిగా మానేయండి .
ఐస్ క్రీం లు , చాకోలెట్లులు , బిస్కెట్లు ఇంకా రకరకాల స్వీట్లు , ముఖ్యంగా పార్టీ లలో ఇచ్చే ఆర్టిఫిషల్ స్వీట్నర్లు - అరుదుగా మాత్రమే తీసుకోండి . పూర్తిగా మానేస్తే మేలు .
చక్కర తో చేసిన పదార్థాలు, మైదా - అరుదుగా మాత్రమే తీసుకోండి .
పోలిష్డ్ రైస్ { తెల్లనం } గోధుమ పిండితో చేసిన వంటలు - మీరు ఇప్పుడు తింటున్న దానిలో ఐదో వంతుకు తగ్గించండి .
ఖీర {కుకుంబర్ } ను రోజూ తినండి .. వీలయితే ప్రతి పూట ఒక ఖీర తినండి .
సొర కాయ, దోస కాయ , బెండకాయ , వంకాయ , మునక్కాయ , పొట్లకాయ లాంటి కాయగూరలు - బాగా ఎక్కువగా తినండి { సాంబారు , ఫ్రై లు గా చేసి. తగ్గించిన అన్నం స్థానం లో ఇది; పొట్ట నింపేలా }
రాత్రి నానబెట్టి ప్రతి రోజు పొద్దున్న మూడేసి వాల్నుట్స్ , అల్మొన్డ్స్ , పిస్తా తినండి . ఆ నీరు తాగండి .
ఆకుకూరలు ముఖ్యంగా పాలకూర , తోటకూర ఎక్కువగా తినండి .
ప్రోటీన్ కోసం మాంసాహారులు చికెన్ , ఫిష్ , ఎగ్, మటన్ శాఖాహారులు పుట్టగొడుగులు , పన్నీర్ బ్రోకలీ తినండి . మీ బడ్జెట్ బట్టి వీటిని వీలైనంత ఎక్కువ తినండి . ప్రోటీన్ తింటే కిడ్నీ సమస్యలు వస్తాయి అనే ప్రచారం బూటకం . ఇది వరకే కిడ్నీ సమస్యలు ఉన్నవారి సంగతి వేరు . చికెన్ , ఎగ్స్ తింటే అనారోగ్యం అనే ప్రచారం లో కూడా నిజం లేదు .
ఆయా కాలాల్లో దొరికే పళ్ళు తినండి . పళ్ళు తింటే షుగర్ రాదు . ఇది వరకే అధిక షుగర్ ఉన్న వారు బియ్యం , గోధుమ లాంటి వాటితో చేసిన వంటకాలు తగ్గిస్తే షుగర్ కంట్రోల్ లోకి వస్తుంది . అలాంటప్పుడు సాయంకాలం తక్కువ తీపి ఉన్న జామ , బొప్పాయి ఇంకా పుల్లగా ఉన్న బ్లూ బెర్రీ, కివి లాంటి పళ్ళు తింటే ఇన్సులిన్ ఉత్పత్తి ఎక్కువవుతుంది . షుగర్ సమస్య పోతుంది .
వేరుశనిగ గింజెలు , నువ్వులు , ఆలివ్ నూనె{ వంటకాల్లో } .. వీటిని తరచూ తీసుకోండి .
రోజుకు పురుషులు -నాలుగు.. స్రీలు- మూడు.. లీటర్ల నీరు తాగితే కిడ్నీ సమస్య దరిచేరదు.
రోజుకు ఆరు గ్రాముల లోపు ఉప్పు తీసుకొంటే కీళ్ల నొప్పులు , అధిక బిపి సమస్య రాదు . అధిక ఉప్పు అనేక రోగాలకు కారణం .
గుర్తుంచుకోండి - చక్కర , ఉప్పు, మైదా , తెల్లనం - వైట్ పాయిజన్స్ .
ఆహారమే ఆరోగ్యం .
ముఖ్యంగా పిల్లలకు ఆరోగ్యకరమయిన ఆహారపు అలవాట్లు నేర్పండి.
Amarnath Vasireddy sir.
0 Comments