చంద్రయాన్3 యాత్ర విజయవంతం అయింది!
ఇస్రో శాస్రవేత్తలకి అభినందనలు!
మొదటి చంద్రయాణ్ 2 విఫలం అయినా ఇస్రో శాస్త్రవేత్త దైర్యం చెప్పి మరొక్కసారి ప్రయత్నం చేయండి అని దైర్యం చెప్పి, దానికి కావలసిన నిధులు మంజూరుచేసాడు.
చివరి15 నిముషాల లో ఆఖరి 5 నిముషాలు చాల కీలకం అనేదానికంటే ఉత్కంఠ నెలకొంది!
లాండర్ అడ్డంగా(హారిజాoటల్ ) పొజిషన్ నుండి నిలువుగా(వర్టికల్ ) తిరరగడం లొనే అసలు కీలకం దాగిఉంది!
ఇక వర్థికల్ పొజిషన్ లోకి వచ్చిన తరువాత సెన్సార్స్ అన్నీ సక్రమంగా పనిచేసి లాండర్ క్షేమంగా దిగడానికి సహాకరించాయి!
******************
అంతరిక్ష కార్యక్రమానికి వేల కోట్లు ఖర్చు చేయడం దేనికి? ఇది లి బ్రాo డుల విమర్శ!
2035 నాటికి 32లక్షల కోట్ల రూపాయల వాణిజ్యం జరుగుతుంది అంతరిక్షంలో!
ఇందులో హీనపక్షం 20% వాటా ఇస్రో చేతికి రావాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు మోదీజీ!
దానికి పునాది రాయి పడ్డది ఈ రోజు!
చంద్రుడి మీదకి ప్రోబ్ పంపించి పరిశోధన చేయడం వేరు లాండర్ ద్వారా రోవర్ ని పంపించి పరిశోధన చేయడం వేరు. ప్రోబ్ అనేది చంద్రుడి చుట్టూ తిరుగుతూ ఫోటోలు తీస్తుంది మరియు సెన్సార్స్ ద్వారా సమాచారం పంపిస్తుంది భూమి మీదకి. తరువాత అది తన అత్యాధునిక కెమెరాలతో అక్కడి దృశ్యాలను రికార్డు చేసి , కొన్ని సాంపుల్స్ తీసుకోని విశ్లేషించి , దాని వివరాలను భూమికి పంపిస్తుంది.
*********************
అమెరికా, రష్యా, చైనా లు ఉన్న క్లబ్ లోకి ఇప్పుడు భారత్ చేరింది!
కానీ మన దేశ ప్రయోగం మాత్రం మిగతా మూడు దేశాల కంటే భిన్నంగా ఉంటుంది అని రాబోయే రెండు వారాలలో తెలిసిపోతుంది. రోవర్ జీవిత కాలం 14 రోజులు మాత్రమే!
*******************
ఎవడో చైనా పడేసే బిస్కట్లకి ఆశపడి ఎదో వాగాడు అని పట్టించుకుంటె ముందుకు వెళ్లలేము! తిన్న ,తింటున్న బిస్కెట్లకి న్యాయం చేయాలి కదా?
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీజీ సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉన్నా జోహాన్స్ బర్గ్ నుండి చంద్రయాన్3 చంద్రుడి మీద దిగడం ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు అంటే అర్ధమవుతుంది ఈ మిషన్ కి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో .
మరిన్ని ప్రయోగాలు, మరిన్ని విదేశీ ఆర్దర్లు తీసుకొని ఇస్రో ని తద్వారా భారత్ ని ముందు ఉంచాలి అనే తాపత్రయం ఉంది మోదీజీ కి.
******************
ఇక రష్యా లూనా25 ప్రయోగం ఎందుకు విఫలం అయిందో కొన్ని వాస్తవాలని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాను రేపు!
*******************
మనదేశంలో ఉన్న వాళ్ళ ఏడుపుకంటే నాకు యూరోపు దేశాల ఏడుపు వినసొంపుగా ఉంటుంది!
ఈపాటికె దేబిరి మొఖాలు వేసుకొని చంద్రయాన్3 ని చూసేవుంటారు! ఇక రేపటి నుండి వీళ్ళ అభినందంనలు వినాలి, చూడాలి!
ఇక్కడ కాదు కానీ వివిధ బ్లాగులలో యూరోపియన్స్ వాగిన చెత్తవాగుడుకి సమాధానం చెప్పే సమయం వచ్చేసినందుకు ఆనందంగా ఉంది నాకు!
ఇక ప్రవాస భారతీయులు కూడా గట్టిగానే తగులుకుంటారు రేపటి నుండి!
******************
శాస్త్రజ్ఞులని,సైనికులని గౌరవిద్దాం!
జైహింద్! జై భారత్!
0 Comments