రష్యా ప్రయోగించిన Luna25 మూన్ లాండర్ విఫలం అయ్యింది!
చంద్రుడి దక్షిణ ధృవం మీద లాండ్ అవాల్సిన Luna25 శనివారం రోజున చంద్రుడి దక్షిణ ధృవం మీద సురక్షితంగా దిగాల్సి ఉండగా కుప్ప కూలి పోయింది!
*************************
చాలా మంది అనుకుంటున్నట్లు భారత్ కంటే ముందు రష్యా చంద్రుడు మీదకి తన ల్యాoడర్ ని పంపి క్రెడిట్ కొట్టేయాలని చూసింది అని అనడం తప్పు!
నిజానికి 2023 ఆగస్టు లో చేసిన ప్రయోగం ఎదయితే ఉందొ అది గత సంవత్సరం అంటే2022 సెప్టెంబర్ నెలలో జరగాల్సి ఉంది షెడ్యూల్ ప్రకారం! కానీ ఉక్రేయిన్ తో యుద్ధం కారణంగా జాప్యమ్ జరుగుతూ వచ్చింది తప్పితే మనకి పోటీగా మాత్రం కాదు!
********************
చంద్రయాన్2 ఎలా విఫలం అయ్యిందో అదే విధంగా LUNA25 కూడా విఫలం అయ్యింది!
1.సరిగ్గా చంద్రుడి దక్షిణ ధృవం మీద లాండింగ్ అవబోయే సమయంలో చంద్రయాన్2 మరియు LUNA25 లు మిషన్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోయాయి.
2.సంబంధం పునరుద్దరించడానికి చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి!
3.రెండిటిలోనూ లాండింగ్ కి అవసరం అయిన సెన్సార్స్ ఉన్నాయి కానీ చివరి నిముషంలో అవేవీ ఉపయోగపడలేదు!
4 రెండూ కూడా క్రాష్ లాండ్ అయ్యాయి! కానీ ఇస్రో లేదా రోస్ కాస్మోస్ లు ఈ విషయాన్ని వెంటనే కనిపెట్టిన లేదా పసిగట్టిన సూచనలు లేవు!
5.అయితే శాస్త్రజ్ఞులు మాత్రం టెక్నీకల్ గ్లిచ్ వల్లనే విఫలం అయ్యాయి అని చెపుతున్నారు!
6. బ్రేకింగ్ thrusters లో చిన్నపాటి లోపం వలన లాండింగ్ కి ఇబ్బంది అయ్యింది.
7.అయితే ఇలాంటి సైంట్ ఫిక్ అంశాలని విశ్లేషించాలి అంటే ఫిజిక్స్,సాఫ్ట్ వేర్, కంట్రోల్ సిస్టమ్స్ మీద ఆవగాహన ఉండాలి వ్రాసే వాళ్ళకి చదివే వాళ్ళకి!
8.భూమి మీద భూమ్యా కర్షణ శక్తి అన్ని చోట్లా ఒకే విధంగా ఉండదు. కొన్ని చోట్ల బలంగా ఉంటే మరికొన్ని చోట్ల మధ్యాస్థంగానూ మరి కొన్నిచోట్ల బలహీనంగానూ ఉంటుంది.
9.భూమ్యా కర్షణ శక్తి(గ్రావిటీ) లేని ప్రాంతాలు చాల ఉన్నాయి ఈ భూమిపైనా.
10.అలాంటిది చంద్రుడి మీద కూడా ఉండి ఉండవచ్చు! కాబట్టి శాస్త్రజ్ఞుల అంచనాలు తప్పే అవకాశం ఉందని అంటున్నారు. ఏది ఏమయినా లాండర్ దిగే ప్రదేశంలో ఆకర్షణ శక్తి ని బట్టి సెన్సార్స్ పని చేస్తాయి.
************************
ఇక షరా మామూలుగా వివిధ బ్లాగర్లు చంద్రుడి మీద గ్రహాంతర వాసుల స్థావరాలు ఉన్నాయని మానవులు చేసే ప్రయోగాలని వాళ్ళు అడ్డుకుంటారనీ,ఈ విషయమ్ నాసా కి తెలుసునని వ్రాస్తున్నారు. చంద్రయాన్2,LUNA 25 ల ప్రయోగాలు విఫలమ్ అందుకే అయ్యాయని అంటున్నారు. ప్రముఖ దివంగత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్ చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
జైహింద్!
0 Comments