మాతృభాష

మాతృభాష

 ఇప్పుడు వార్తలలో తెలుగు వింటారు!


2035 నాటికి ఖచ్చితంగా జరగబోయేది ఇదే!

**************

"'ఏ భాష నీది ఏమి వేషమురా

 ఈ భాష ఈ వేషమేవరి కొసము రా

  ఆంగ్లమందున మాటలనగానే

 ఇంత కుల్కదవెందుకు రా

 తెలుగువాడివై తెలుగు రాదనుచు

 సిగ్గులేక ఇంక చేప్పుటెందుకు రా

 అన్య భాషలు నేర్చి

 తెలుగు రాదనుచు

 సకిలించు తెలుగోడా

 చావ వెందుకురా?"

 కాళోజీ !

********

మాతృభాషను ఎంతగా ప్రేమిస్తే కాళోజీ అంత మాట అనగలిగాడు?

***********

అమ్మా కాటర్ పిల్లర్!

వాడేమిటంటున్నాడు?

గొంగళి పురుగుని ఇంగ్లీషులో అంటున్నాడే!

అవునా? మన వాడు ఇంగ్లీషులో ఆదరగొట్టేస్తున్నాడు కదండీ?

అవును! రేప్పొద్దున్న మనం వృద్ధాశ్రమoలో ఉంటే వాడు డాలర్లు పంపిస్తాడు మన అంత్యక్రియలు జరపడానికి!

****************

బ్రతకడానికి ఇంకో భాష నేర్చుకోవడం తప్పుకాదు. కానీ తెలుగుని వదిలేస్తే ఎలా? 

మా వాడికి తెలుగు రాదండీ!

ఇలా ఎవరన్నా అంటే చెప్పు తీసుకుని కొట్టే రోజు వచ్చినప్పుడే తెలుగు బ్రతగ గలగుతుంది!

*************

ఆది నుండి 2014 వరకు ఇండియాలో హిందీ, బెంగాలీ  తరువాత తెలుగు బాషా  3వ స్థానంలో వుండేది.

ఇప్పుడు?

తెలుగుని 4వ స్థానంలోకి నెట్టి మరాఠీ 3వ స్థానాన్ని ఆక్రమించింది.

ఐక్యరాజ్యసమితి తెలుగుని అంతరించిపోతున్న భాషల జాబితాలో చేర్చింది అని ఎంతమందికి తెలుసు?

కారణం ఏమిటీ?

తెలుగు మాట్లాడడం కాదు వ్రాయడం, చదవడము కూడా రావాలి. అప్పుడే దానిని పరిగణలోకి తీసుకుంటారు.

కానీ గత దశాబ్ద కాలంగా మాట్లాడడం తప్పితే చదవడం, వ్రాసే వారి సంఖ్య గణనీయంగా పడిపోతూ వస్తున్నది.

2050 వ సంవత్సరానికి తెలుగు అంతరిచిపోగలదని ఐరాస ఇప్పటికే హెచ్చరించింది. 

***************

కాయం అంటే శరీరము.

ఖాయం అంటే తప్పదు.

ఇప్పటి ఆంగ్లం చదివేవారు దోశ అనమంటే "దోష " అంటున్నారు 


*****************

ఇక నీ గొట్టం లో కొంపలో కుంపటి చిత్రాలు:

ఏ కూర ఎలా చేయాలో వివరంగా ఏదో అర్థం కానీ భాషలో చెప్తూపోతుంది 


ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పొటాటో ముక్కల్ని వేసేయాలి.కొద్దిగా మీడియం ఫ్రాయ్ అయ్యాక ఇప్పుడు ఆనియన్ ని స్లైస్ చేసి దానితో పాటు కర్రీ లీవ్స్ కూడా వేయాలి. ఇప్పుడు గార్లిక్ ని కూడా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. పొటాటో బాగా ఫ్రాయ్ చేయాలి మంచి టెక్చర్ వచ్చేదాకా. చివరలో కొరియండర్ ని గార్నిష్ చేసుకోవాలి. అంతే! స్పైసీ పొటాటో ఫ్రాయ్ రెడీ!

ఇందులో ఎన్ని తెలుగు పదాలు ఉన్నాయో వెతుక్కోవాలి!

*********

బ్రిటీష్ వారి కాలములో నాణాల మీద ఇంగ్లీషు,హిందీ,బెంగాలీ, ఉర్దూ, తెలుగు మాత్రమే ఉండేవి.

"గత కాలము మేలు వచ్చు కాలము కంటే"

జైహింద్!

Post a Comment

0 Comments

Advertisement