ఉత్తరాది - ఏంటా మ్యాజిక్కు ?

ఉత్తరాది - ఏంటా మ్యాజిక్కు ?

 ఉత్తరాది - ఏంటా మ్యాజిక్కు ?


భూమి ! 

దాన్ని రెండుగా విభజిస్తూ .. మధ్యలో భూమధ్య రేఖ !

దానికి .... 

పైన ఉత్తరాది { ఉత్తరార్ధ గోళం }

కింద దక్షిణం { దక్షిణార్ధ గోళం } 

ప్రపంచ మాప్ లేదా గ్లోబ్...  ఒక సారి చూడండి .

భూమి...  అంటే అన్ని ఖండాలు మొత్తంగా తీసుకొంటే ఉత్తరాన వెడల్పుగా { రష్యా ,  గ్రీన్లాండ్ కెనడా ప్రాంతాలు } దక్షిణాది కొచ్చేటప్పటికీ కూసుగా / చిన్నదిగా { దక్షిణాఫ్రికా , ఆర్జెంటినా మొదలయిన ప్రాంతాలు }...  { ఆస్ట్రేలియా మినహాయింపు } .

ఇప్పుడు..  ఒక్కో ఖండం తీసుకొందాము.

ఎక్కడ చూసిన ఇదే పరిస్థితి. అన్ని ఖండాలలో  యూరోప్ , ఆసియా , ఆఫ్రికా , ఉత్తర ,దక్షిణ అమెరికాలు . 

 ప్రతి ఖండం ఉత్తరాన వెడల్పుగా ... దక్షిణాది కొచ్చేటప్పటికీ సన్నగా/  ఇరుకుగా వున్నాయి .

 గమనించారా ?

మన భారతదేశం కూడా ఇంతే . 

ఉత్తరాన హిమాలయాలు...  గంగా-  యమునా...  సింధు నదీ లోయలు .

 దక్షిణాది కొచ్చేటప్పటికీ నారో . ఒక విధంగా చెప్పాలంటే త్రిభుజా కారం కదా ?

 ఎందుకిలా ? ఎప్పుడైనా ఆలోచించారా ??

ఇంకో కోణం లో చూద్దాము రండి .

చరిత్రలోకి .... 

తొలిసారిగా ప్రపంచాన్ని జయించిన గ్రీకు వీరుడు .. రాకుమారుడు అలెగ్జాండర్ .. ఉత్తరాదివాడు . 

ప్రపంచ నాగరికతలు .. మెసపొటోమియా , చైనా , హరప్పా , సుమేరియాన్ , గ్రీకు .. 

ఒక్కటైనా దక్షిణార్ధ గోళానికి చెందినవి ఉన్నాయా ?

 లేవు . అన్నీ ఉత్తరార్ధ గోళం   గోళం .

 మాయ , ఇంకా , అజ్టెక్ .. ఇవి అమెరికా లో ఒకప్పటి నాగరికతలు . ఇందులో అజ్టెక్ మాత్రం దక్షిణార్ధ గోళం . 

ఇంకో కోణం . 

ప్రపంచాన్ని ఆధునిక యుగం లో ఏలిన రాజ్యాలు ..

పోర్చుగల్ , స్పెయిన్ , ఫ్రాన్స్ , ఇంగ్లాండ్ .. అన్నీ ఉత్తరాదివే .

నేటి అగ్ర రాజ్యాలు  తీసుకొందాము.. 

అమెరికా,  రష్యా , చైనా, కెనడా ,  జపాన్ .. ఇంగ్లాండ్ .. అన్నీ ఉత్తరాదివే .

 వచ్చే రోజుల్లో అగ్ర రాజ్యాలుగా మారే అవకాశమున్న దేశాలు  అయినా  చైనా , ఉత్తర కొరియా , జపాన్ , టైవాన్ , ఇండియా .. ఇవీ ఉత్తరాదివే . 

ఎందుకబ్బా ఇలా ?

ఇదేంటి మ్యాజిక్కు ?

 ఆగండి.. అప్పుడే అయిపోలేదు .

మన దేశానికీ వద్దాము .

ఉత్తరాన వైశాలము ఎక్కువ .

 గంగా యమునా  సింధు బ్రహ్మపుత్ర పరీవాహిక ప్రాంతాలు .. సారవంతమయిన ఒండ్రు మట్టి .. జీవ నదులు .

దక్షిణాన ?

ఇటు ఒక కొండ { తూర్పు కనుమలు } అటు ఒక కొండ { పశ్చిమ కనుమలు } మధ్యలో బండ { రాళ్ళూ రప్పలతో కూడిన దక్కను పీఠభూమి } . 

దక్షిణాన కూడా ఒండ్రుమట్టి లోయలు వున్నాయి కదా . అని మీరు అడగవచ్చు . 

అవునండీ .. కావేరి .. కృష్ణ , గోదావరి .. ఈ మొత్తం కలిసినా ఉత్తరాది తో పోలిస్తే కనీసం పదో వంతు లేదు .

అఖిల భారత సామ్రాజ్యాన్ని స్థాపించిన   చక్రవర్తులు ఎవరు ? 

చంద్ర గుప్త మౌర్యుడు , అశోకుడు , చంద్ర గుప్త విక్రమాదిత్యుడు , ఆలా ఉద్దీన్   ఖిల్జీ .. అక్బర్ .. 

ఒక్కరంటే ఒక్కరు దక్షిణాది రాజు లేదేంటి ?

శ్రీకృష్ణ దేవరాయలు అంటారా ?

తెలుగు భాష అభిమానం నాకూ వుంది మాస్టారూ .. కానీ ఆయన రాజ్యం ఒరిస్సా దాటలేదు . 

చరిత్ర లో దక్షిణాది రాజులు ఉత్తరాధిని కూడా ఏలిన సందర్బాలు అరుదు  .

 రాజేంద్ర చోళుడు .. గంగా నదీ ప్రాంతాన్ని జయించాడు . 

 ఆధునిక కాలం .. 

నెహ్రు .. లాల్  బహదూర్ శాస్త్రి . ఇందిరా , మొరార్జీ , చరణ్ సింగ్ , రాజీవ్ గాంధీ  చంద్ర శేఖర్,  విపి సింగ్ , వాజపేయి .. అయ్యో ఆధునిక కాలం లో కూడా ఇంతేనా ?

అవునండీ .. ఒక నరసింహ రాజు { రావు } ఒక్కడే మినహాయింపు . 

ఇంకో ఆయన వున్నాడు అంటారా ? 

అబ్బా .. ఆయనకు నిద్ర పోవడానికే సమయం సరిపోలేదు .. మీరు మరీను .

చేబితే సింటిమెంటల్ గా అనిపిస్తుంది కానీ ..

ఉత్తరాది నుంచి రాజధాని ని  దక్షిణాది వైపు { మధ్య భారత  దేశం } షిఫ్ట్ చేసిన ఒకాయన తుగ్లక్ గా మిగిలిపోయాడు . { అది ఆయన ఇంటి పేరు .. కానీ తుగ్లక్ అంటే పిచ్చోడు అని జనాలు అనుకొంటున్నారు } .

 ఇంకో ఆయన రాజధాని  ని షిఫ్ట్ చేయలేదు కానీ గోల్కొండ బీదర్ బీజాపూర్ పై కన్నేసి ఇక్కడే వుండిపోయాడు . చివరకు డెక్కను అతని  సమాధి  అయ్యింది . 

నేడు దక్షిణాది దేశాలు అనేక సమస్యల్లో .. దక్షిణాఫ్రికా..  వెనుజువెలా , పెరు , అర్జెంటీనా , అనేక ఆఫ్రికా దేశాలు  ఇలా ...  .

హైదరాబాద్ నగరం లో గత ఇరవై ఏళ్లుగా బాగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు .. మాదాపూర్,  కొండాపూర్ , ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ , గచ్చిబౌలి , కూకట్పల్లి,  పటాన్చెరు , కండ్ల  కోయ.. ఇప్పుడు కోకాపేట్  ..అన్నీ ఉత్తర దిక్కు .

 శంషాబాద్ లో ఇరవై ఏళ్ళ క్రితమే రియల్ ఎస్టేట్ ఊపు మొదలయ్యింది . 111 జీవో అయినా ,  .. ఇప్పటికీ అంత పెద్ద అభివృద్ధి లేదు . శంషాబాద్ దక్షిణాన ఉంది. { ఎయిర్పోర్ట్ తో కలుపుకొని } 

హిందూ సంప్రదాయం ప్రకారం .. ఉత్తరం కుబేర స్థానం . 

దక్షిణం యముడి ఆవాసం . 

 ఇంటికి మెయిన్ డోర్ దక్షిణ వైపు  ఉంటే మంచిది కాదు అని నమ్మకం .

నార్త్..  నార్త్ - ఈస్ట్ ఫేసింగ్ ఇళ్లకు ఫ్లాట్స్ కు రెండింతల డిమాండ్ .

  సౌత్ ఫేసింగ్ వాటికి డిమాండ్ తక్కువ .

భీష్ముడు మహాభారత యుద్ధం లో తీవ్రంగా గాయపడ్డాడు . 

ఈ రోజు .. మకర సంక్రాంతి . అంటే సూర్యుడు ఉత్తర దిక్కకు పయనాన్ని మొదలెట్టే కాలం -  ఉత్తరాయణ కాలం . దేశమంతా రకరకాల పేర్లతో ఈ పండుగ ను జరుపుకొంటారు  . అదే దక్షిణాయన కాలానికి ప్రాధాన్యత లేదు .

ఇదేంటి  మ్యాజిక్కు ?

ఉత్తరాది మ్యాజిక్కు !!1 

ఆలోచించండి . 

పండగ పూట బాగా  ఆలోచించండి .

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు .


Post a Comment

0 Comments

Advertisement